కోటి జన్మలనుండి చేసిన పాపములు పోవుటకు
శ్లో॥ రామా నారాయణనంత ముకుంద మధుసూదన
కృష్ణ కేశవ కంసారేహరే వైకుంఠ వామన
ఇత్యేకాదశనామాని పఠేత్ వాపారయేదితి
జన్మకోటి సహా ప్రాణాంపాతకా దేవ ముచ్యతే
రామా, నారాయణ, అనంత, ముకుంద, మధుసూదన, కృష్ణ, కేశవ కంసారి, హరి, వైకుంఠ, వామన ఈ పదకొండు నామములు నిరంతరము చదువుట వలన వేలకొలది, కోట జన్మల నుండి చేసిన పాపముల నుండి విముక్తుడగును.
ఏ యింటియందు తులసి చెట్టు పెంచబడుచుండునో ఆ గృహము కాశీ క్షేత్రమువలె పవిత్ర తీర్ధస్థలముగాను ఆ ఇంటికి యమ కింకరులు రాజాలరు. గంగాజలము వలె తులసి చెట్టు తన చుట్టు క్రోశ దూరం స్థలమును పవిత్రముగా ఉండును.
Tags: Rama, Vishnu, Mukunda, Krishna, Kesava, Vaikunta, Vamana, Rama Names, Vishnu Names
Comments
Post a Comment