Drop Down Menus

ధన త్రయోదశి(ధంతేరాస్) ఏ రోజున జరుపుకోవాలి? ఏం కొనాలి? What is the time for Dhanteras puja 2023?

ధంతేరాస్ ఏ రోజున జరుపుకోవాలి? ఏం కొనాలి?

దీపావళి ముందు జరుపుకునే ధన త్రయోదశి(ధంతేరాస్) పండుగకు ఎంతో విశిష్టత ఉంది. అశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి రోజున ఈ పండుగ జరుపుకుంటారు.

ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 12.35 గంటలకు తిథి ప్రారంభమై.. మరుసటి రోజు మ.1.57గం.కు ముగుస్తుంది. ప్రదోష పూజ పవిత్ర సమయం దృష్ట్యా 10వ తేదీ జరుపుకుంటారు. ఈ రోజున బంగారం, వెండి, వంట పాత్రలు, చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

హిందూ పంచాంగం ప్రకారం, ఉదయం తిథినే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఆదివారం రోజున ధంతేరాస్ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో షాపింగ్ చేయడానికి, ఏదైనా పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

ధన త్రయోదశి వేళ ఈ పనులు చేయడం మరచిపోవద్దు..

ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరి జయంతి రోజునే ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, వినాయకుడు, కుభేరుడిని ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సమయంలో మీ ఇంట్లో మట్టితో తయారు చేసిన లక్ష్మీ గణపతి విగ్రహాలను తీసుకెళ్లి ఆరాధించాలి. అలాగే వెండి విగ్రహాలను కూడా కొనుగోలు చేయొచ్చు. మీ ఇంటికి ఆ విగ్రహాలను తీసుకెళ్లాక ఆ విగ్రహాలను ఎర్రని లేదా పసుపు రంగులో ఉండే వస్త్రంపై ఉంచాలి.

ఆ తర్వాత కుంకుమ తిలకం పెట్టి పూజను ప్రారంభించాలి. పూజ చేసే సమయంలో ఆ విగ్రహాల ముందు నాణెలను ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత వాటిని భద్రంగా మీ అల్మారాలో లేదా లాకర్ లో ఉంచుకుంటే సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

Related Posts:

> ధనత్రయోదశి రోజు ఈ వస్తువులు కొంటె అంతే జాగ్రత్త

Tags: ధన త్రయోదశి, dhantrayodashi puja, dhantrayodashi puja vidhi in telugu, when is dhanteras in 2023, lakshmi poojaa

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.