Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మన ఇంట్లో పూజా మందిరాన్ని వాస్తు ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేయాలి? Which is the best position for pooja room in Vastu?

మన ఇంట్లో పూజా మందిరాన్ని వాస్తు ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేయాలి?” అని చాలామంది అడుగుతున్నారు.

సాధ్యమైనంత వరకూ ఈశాన్యంలో కానీ, తూర్పుదిశన గానీ, ఉత్తరాన గానీ పూజగదిని  ఏర్పాటుచేసుకోవాలి. తద్వారా యోగ, ధ్యానం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. సూర్యభగవానుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కనుక పూజ గదిని ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్య దిక్కునే ఎంచుకోవాలి. స్థలం బాగా ఉంటే ఇంటిమధ్యలో పూజగదిని ఏర్పాటు చేసుకోవచ్చు.

పూజ గదిని ఎప్పుడూ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేయాలి తప్ప బేస్‌మెంట్‌లో చేయకూడదు. దీనికి కారణం బేస్‌మెంట్‌లోకి వెలుతురు ప్రసరించదు. సూర్యుడి తొలి కిరణాలవల్ల లబ్దిపొందలేరు. అలాగే పూజగదిని పై అంతస్థుల్లో కూడా ఏర్పాటు చేసుకోకూడదు. అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళు, కదల్లేని వాళ్లుంటే వాళ్లకు తప్పకుండా సౌకర్యకరంగా ఉండాలి.

పూజగది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజామందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి.

పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పడకగదులలో ఏర్పాటుచేసుకోకూడదు. అలాగే పూజగది బాత్‌రూంకు సమీపంలో లేకుండా జాగ్రత్త పడాలి.

నాపేరును తొలగించి తమ పేరునిందులో చేర్చి ఫార్వర్డు చేసేవారికీ, నాపేరును దీంట్లోంచి తీసేసి ఫార్వర్డుచేసి సంతోషించే వారందరికీ ఇది అంకితం.

ప్రత్యేకంగా పూజగదిని ఏర్పాటుచేసుకుంటే విగ్రహాలను ఎటువైపు పెట్టుకోవాలన్నదీ సందేహమే. విగ్రహాలను ఈశాన్యం, తూర్పు, పడమర దిక్కుల్లో పెట్టుకోవచ్చు. ప్రొద్దుటే సూర్య కిరణాలు ఈశాన్య, తూర్పు దిశ నుంచీ, సాయంకాలం పడమర నుంచీ ప్రసరించి మనలో మరింత భక్తిభావనను ప్రేరేపిస్తాయి.

గోడకు ఆనించకుండా ఒక అంగుళం దూరమైనా ఎడం ఉండేలా విగ్రహాల్ని పెట్టాలి. రెండువైపులా దీపాలను వెలిగించాలి. ఒక పువ్వు వత్తినీ, రెండువత్తులను జతజేసిన ఒక వత్తినీ ఒక్కో దీపపు కుందులో ఉండేలా చూసుకోవాలి. ఆ వత్తులను పూజ చేసుకునేవాళ్లు స్వయంగా తయారుచేసుకోవాలి. ఒక దీపం కుందులో స్వచ్ఛమైన ఆవునెయ్యినీ, మరో కుందులో స్వచ్ఛమైన నువ్వులనూనెనూ ఉపయోగించాలి. ఈ ప్రక్రియను “పాశుపతం” అంటారు. మార్కెట్లో “దీపం నూనె” పేరుతో అమ్మబడుతున్న అడ్డమైన పాపపు నూనెను వాడవద్దు.

పూజ గదిలో గంటను ఏర్పాటుచేసుకోకూడదు. పూజ గది ఆలయం కాదు కదా. అది మన వ్యక్తిగతధ్యానానికి, పూజకు ఉద్దేశించింది. పూజ గదిలో మరణించిన తాత ముత్తాతల ఫోటోలూ పెట్టవద్దు. పెద్దలకు గౌరవం చూపిస్తున్నామనే భావనతో పెడుతున్నామని అనుకుంటారు కానీ అలా చేయకూడదు.

పూజ గదిలో డబ్బు, నగలు లాంటి విలువైన వస్తువులను దాచకూడదు. పూజగది కప్పు కొద్దిగా కిందకి ఉండేలా చూసుకోవాలి. దానివల్ల గది కుదురుగా కనుపిస్తుంది. పూజ గదిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ఆ గదికి రెండు తలుపులున్న ద్వారాన్నే ఎంచుకోవాలి. పూజ గదికి లేత రంగులే వేయాలి. తెలుపు, లేత పసుపు లేదా లేత నీలాన్ని ఎంచుకోవచ్చు. వీలైతే పూజగదికి గడప కూడా ఉండేలా చూసుకోవాలి.

Tags: Vastu, Pooja, Puja, Pooja Room, Vastu room, Devotees, bhakthi, 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు