నవగ్రహాలు ఎక్కువగా శివాలయంలోనే ఎందుకు ఉంటాయి??
జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు చాలా ప్రధానమైనవి. అనంతవిశ్వంలో కంటికి కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొన్ని గ్రహాల పరిశీలన - ప్రాణులపై వాటి ప్రభావంతో వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, వాటికీ మానవ జీవితంతో ఉన్న సంబంధము మొదలైనవి జ్యోతిష్యశాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి.
నవగ్రహాల స్థితి కారణంగానే వ్యక్తుల జాతకాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్రమంలో ఏవైనా గ్రహదోషాలు ఉంటే కొందరు పూజలు కూడా చేస్తారు. అయితే ఈ నవగ్రహాలు అనేవి ప్రధానంగా శివాలయాల్లోనే మనకు ఎక్కువగా కనిపిస్తాయి.
కొన్ని క్షేత్రాల్లో నవగ్రహాలు ఒకే మందిరంలో దర్శనమిస్తూ వుంటే, మరికొన్ని క్షేత్రాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకమైన మందిరం కనిపిస్తూ వుంటుంది.
నవగ్రహాలు ఎలా కొలువైవున్నా అసలు ఇవి ఎక్కువగా శివాలయాల్లోనే ఎందుకు ఉంటాయనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. నవగ్రహాలకు శివుడితో గల సంబంధమేమిటో తెలుసుకోవాలి. ఇందుకు శాస్త్రంలో చాలా స్పష్టమైన సమాధానం కనిపిస్తోంది.
నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి, ఒక్కో అధిష్టాన దేవతను నియమించినది శివుడే. అంతేకాకుండా గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవుడుకి అధిదేవత కూడా శివుడే.
ఈ కారణంగానే గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ వుంటాయి. అందువల్లనే శివాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ వుంటాయి.
ఆదిదేవుడైన పరమశివుడి అనుగ్రహమే వుంటే నవగ్రహదోషాలు ఎలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెప్పడం వెనుక గల కారణం కూడా ఇదే.
అంతెందుకు త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శనిత్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం.
అందుకనే త్రయోదశి శనివారంనాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. శని జన్మించిన తిధి కూడా త్రయోదశి, అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శనిదోషాలైన—ఏలినాటిశని, అష్టమశని, అర్ధాష్టమశని, కంటకశని, తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది..
Tags: నవగ్రహాలు, Navagraha Idols, Sivalayam, Navagraha, Siva Pradakshina, Devotional Story's
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment