Drop Down Menus

కార్తీక అమావాస్య రోజు ఇలా చేస్తే మీకు కార్తీకమాస పుణ్య ఫలం లభిస్తుంది - Kartik Amavasya: Importance of the Day

కార్తీక అమావాస్య

డిసెంబర్, 12 వ తేదీ, 2023 మంగళవారము, ఉదయం 06 గం,24 ని (am) నుండి

డిసెంబర్, 13 వ తేదీ, 2023 బుధవారము, తెల్లవారుఝాము 05 గం,02 ని (am) వరకు

కార్తీక అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపడానికి ప్రయత్నించాలి.

శివాలయంలోనూ, వైష్ణవ ఆలయంలోను దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది.

కార్తీక మాసంలో ఉపవాస దీక్షతో పాటు ఉభయ సంధ్యలలో దీపారాధన చేస్తే శివపార్వతుల అనుగ్రహమూ పొందొచ్చు.

దీపాన్ని పరబ్రహ్మగా భావిస్తూ, పరమశివుడిని ఆవాహన చేసుకుని మానవాళి మేలుకోసం సాధనలు చేసే బిడ్డలను చూసి పార్వతీ పరమేశ్వరులు ఆనంద తాండవం చేస్తుంటారు.

ఈ రోజు వెలిగించిన దీపం మానవాళి శ్రేయస్సుకు ఉపయోగపడింది కాబట్టి ఇదే అగ్నిహోత్రం సాక్షిగా నిలిచి ఈ జన్మలోనే పాప ప్రక్షాళన చేసి ఉత్తమ గతులు పొందేలా పరమశివుడి సన్నిధికి చేరేలా సహకరిస్తుంది. కార్తీక మాసంలో పెట్టే ఒక్క దీపం ముక్తికి మార్గాలన్ని చూపుతుంది.

కార్తీక బహుళ అమావాస్య కూడా పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది. ఈ రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారని అంటారు.

ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశాభివృద్ధి చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్లు ఈ రోజు పితృకార్యాలు నిర్వర్తించాలి. తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది.

అమ్మవారికి ఇష్టమైన ఈ రోజున అంకితభావంతో ఆరాధించడం వలన ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారని స్పష్టం చేయబడుతోంది.

Tags: కార్తీక అమావాస్య, Karthika masam, Amavasya, Karthika Amavasya, Karthika somavaram, Karthikam, lord shiva

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.