కేదార్‌నాథ్ , బద్రీనాథ్ ప్రయాణం చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు - Kedarnath, Badrinath travelers should take precautions?
కేదార్‌నాథ్ , బద్రీనాథ్ ప్రయాణం చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేయండి ?
1 అనుభవం ఉన్న ట్రావలింగ్ ఏజెన్సీ ద్వారానే వెళ్ళాలి.
2 స్వంతంగా వెళ్లాలంటే ఆ ప్రాంత రోడ్ల పై పూర్తి అవగాహన ఉన్న డ్రైవర్ మరియు మాంచి కండిషన్ గల వాహనం ఉండాలి.
3 రాత్రిపూట ప్రయాణం చేయవద్దు.
4 వర్షంలో అసలు ఘాట్ లో ప్రయాణం వద్దు.
5 కేధర్నాథ్ వెళ్లుటకు గాను ఒకరోజు ముందుగానే గుప్త కాశి లేదా ఫాటా చేరుకొని బస చేయాలి.
6 ఇక్కడ చాలా హోటల్స్ కాస్త చవకగానే దొరుకును.
7 హెలికాప్టర్ ముందుగానే బుక్ చేసుకుని ఉండాలి. ఇటువంటి వారు 3 గంటలకే తయారయ్యి హెలిపాడ్ కు బయలుదేరాలి.లేనిచో ట్రాఫిక్ లో ఇరుక్కుంటారు.
8 కేధర్నాథ్ క్షేత్రానికి తగిన దుస్తులు ,బూట్లు,కాప్ గ్లౌస్ మున్నగువాటిని సమకూర్చుకొని ఉండాలి.
9 కేధర్నాథ్ వెళ్లిన తర్వాత సాధ్యమయినంతవరకు మధ్యన్నాము వరకు పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం చేయాలి.
10 ఉన్నత పర్వతాల వల్ల ప్రాణవాయు కొరత ఉంటుంది జాగ్రత్త.ఆస్తమా గుండె జబ్బులు ఉన్నవారు కంగారు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
11 అకాల వర్షాలు, మంచు,చలి మున్నగు వాటి వల్ల హెలికాప్టర్లు నిలిచిపోయి తిరిగి రావడానికి ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త.
12 ఇక ట్రెక్కింగ్ అంటే కాళీ నడక వారు గౌరి కుండ్ నుండీ 19 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది కావున ఉదయం 6 కల్లా ప్రారంభించండి. కనిసము 6నుండి 8 గంటల ప్రయాణం తర్వాత కేధర్నాథ్ చేరవచ్చు. దర్శనం తర్వాత అక్కడనే బస చేసి తర్వాతి రోజు తిరుగు ప్రయాణము ప్రారంభించండి.
13 కవిసిన తినుబండారాలు కాజు బాదం మునగువాటిని తీసుకెళ్లండి.
14 కొండపైన స్టే చేయుటకు రూంలు బెడ్స్ ఉంటాయి లేనిచో గుడారాలలో ఉండాలి. చలి అధికం జాగ్రత్త.
15 తిరిగి పీఓల్కిట్ జోషిమాథ్ ద్వారా బద్రీనాథ్ చేరుకొనండి. ఈ ప్రయాణం హాయిగా వుంటుంది.
16 మార్గంలో అనేక ప్రకృతి అందాలను గంగ నదిని,ప్రయగా దర్శనాలు అమోఘం.
బ్రోకర్లను నమ్మకండి.
Tags: Char Dham Yatra, Kedarnath, Kedarnath Yatra, Badrinath, Kedarnath Badrinath, Kedarnath Badrinath Tour
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment