Drop Down Menus

నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ స్తోత్రాలు, గాయత్రి, జప మంత్రాలు - Navagraha stotram - Gayatri Mantram

నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ స్తోత్రాలు, గాయత్రి, జప మంత్రాలు

నవగ్రహ ధ్యాన శ్లోకం

ఆదిత్యాయచ సోమాయ

మంగళాయ బుధాయచ

గురు శుక్ర శనిభ్యశ్చ

రాహవే కేతవే నమః{9సార్లు}

నవగ్రహ స్తోత్ర సహిత గాయత్రీ

1. సూర్య గ్రహ స్తోత్రం

జపాకుసుమ సంకాశం!

కాశ్యపేయం మహాద్యుతిమ్!

తమోరిం సర్వపాపఘ్నం!

ప్రణతోస్మి దివాకరం(7సార్లు)

సూర్య గాయత్రి:

ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహీ తన్నో ఆదిత్యః ప్రచోదయాత్(10సార్లు)

శ్రీ సూర్య జపమంత్రం:-

ఓం హ్రీం సూర్యాయ నమః (7వేల సార్లు)

2. శ్రీ చంద్రగ్రహ స్తోత్రం

దధి శంఖ తుషారాభం‌!

క్షీరోదార్ణవ సంభవమ్!

నమామి శశినం సోమం!

శంభోర్మకుట భూషణమ్(10సార్లు)

చంద్ర గాయత్రి:

ఓం అమృతేశాయ విద్మహే రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్(10 సార్లు)

శ్రీ చంద్ర జపమంత్రం:-

ఓం ఐం క్లీం సోమాయ నమః (10వేల సార్లు)

3. శ్రీ కుజ గ్రహ స్తోత్రం

ధరణీ గర్భ సంభూతం!

విద్యుత్కాంతి సమప్రభమ్!

కుమారం శక్తిహస్తం!

తం మంగళం ప్రణమామ్యహమ్(6సార్లు)

కుజ గాయత్రి:

ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్న: కుజః ప్రచోదయాత్(10 సార్లు)

శ్రీ కుజ జపమంత్రం:-

ఓం హ్రూం శ్రీం మంగళాయనమః (6వేల సార్లు)

4. శ్రీ బుధ గ్రహ స్తోత్రం

ప్రియంగు కలికాశ్యామం!

రూపేణా ప్రతిమం బుధం!

సౌమ్యం సత్వ గుణోపేతం!

తం బుధం ప్రణమామ్యహమ్(17సార్లు)

బుధ గాయత్రి:

ఓం చంద్ర సుతాయ విద్మహే సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్(10 సార్లు)

శ్రీ బుధ జపమంత్రం:-

ఓం ఐం శ్రీం బుధాయ నమః (17వేల సార్లు)

5. శ్రీ గురుగ్రహ స్తోత్రం

దేవానాంచ ఋషీణాంచ!

గురుం కాంచన సన్బిభమ్!

బుధ్ధిమంతం త్రిలోకేశం!

 తం నమామి బృహస్పతిమ్(16 సార్లు)

గురు గాయత్రి:

ఓం సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్(10 సార్లు)

శ్రీ గురు జపమంత్రం:-

ఓం ఐం క్లీం బృహస్పతయే నమః (16వేల సార్లు)

6. శ్రీ శుక్రగ్రహ స్తోత్రం

హిమకుంద మృణాళాభం!

దైత్యానాం పరమం గురుమ్!

సర్వశాస్త్ర ప్రవక్తారం!

భార్గవం ప్రణమామ్యహమ్(20 సార్లు)

శుక్ర గాయత్రి:

ఓం భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహీ తన్నః శుక్రః ప్రచోదయాత్(10 సార్లు)

శ్రీ శుక్ర జపమంత్రం:-

ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమః (20 వేల సార్లు)

7. శ్రీ శనిగ్రహ స్తోత్రం

నీలాంజన సమాభాసం!

రవిపుత్రం యమాగ్రజం!

ఛాయా మార్తాండ సంభూతం!

తం నమామి శనైశ్చరమ్(19 సార్లు)

శని గాయత్రి:

ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహీ తన్నః శనిః ప్రచోదయాత్(10 సార్లు)

శ్రీ శని జపమంత్రం:-

ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః (19 వేల సార్లు)

8. శ్రీ రాహు గ్రహ స్తోత్రం

అర్ధకాయం మహావీరం!

చంద్రాదిత్య విమర్దనం!

సింహికా గర్భ సంభూతం!

తం రాహుం ప్రణమామ్యహమ్(18 సార్లు)

రాహు గాయత్రి:

ఓం శీర్ష రూపాయ విద్మహే వక్ర పంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్(10 సార్లు)

శ్రీ రాహు జపమంత్రం:-

ఓం ఐం హ్రీం రాహవే నమః (18 వేల సార్లు)

9. శ్రీ కేతు గ్రహ స్తోత్రం

ఫలాశ పుష్ప సంకాశం!

తారకా గ్రహ మస్తకమ్!

రౌద్రం రౌద్రాత్మకం ఘోరం!

తం కేతుం ప్రణమామ్యహమ్(7 సార్లు)

కేతు గాయత్రి:

ఓం తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్(10 సార్లు)

శ్రీ కేతు జపమంత్రం:-

ఓం ఐం హ్రీం కేతవే నమః (7వేల సార్లు)

శ్రీ నవగ్రహ పీడా పరిహారార్థ స్తుతి

గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః!!


రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః

విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః!!


భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా

వృష్టికృద్వ్రష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః!!

ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః

సూర్యఃప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః!!


దేవమంత్రీ విశాలాక్షః సదా లోక హితే రతః

అనేకశిష్య సంపూర్ణః పీడాం హరతు మే గురుః!!

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః

ప్రభుస్తారా గ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః!!


సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః

మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః!!


మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః

అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ!!

అనేకరూపవర్ణైశ్చ శతశో2థ సహస్రశః

ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః!!

(నవగ్రహ పీడా పరిహారార్థం ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ తొమ్మిది సార్లు పఠించాలి)

యదక్షర పదభ్రష్ఠం మాత్రాహీనంచ యద్భవేత్, తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే!!

Tags: నవగ్రహ స్తోత్రాలు, Navagrahalu, Navagraha Stotras, 9Plants, Surya Stotram, Navagraha Pradakshina, Navagraha Pooja, Navagra dosham

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.