జనవరి 22న - ప్రాణ ప్రతిష్ఠ రోజున అయోధ్య అక్షింతలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? Ayodhya Ram Mandir Akshintalu Distribution
ఇంటింటికీ అక్షింతలను చేరవేసే ప్రక్రియ!
జన జాగరణ చేసే సమయంలో ఇంటింటికీ వెళ్ళినప్పుడు
తాము అయోధ్య రామమందిరము (తీర్థ క్షేత్ర ట్రస్ట్) తరపున వచ్చాము అని పరిచయం చేసుకోవాలి.
ప్రతి ఇంటికి
1. రామ మందిర చిత్ర పటము
2. తీర్థ క్షేత్ర కరపత్రము
3. మృగముద్రలో అక్షింతలు ఇవ్వాలి
ప్రతి ఇంటికి 5 గ్రాములు చొప్పున అక్షింతలు ఇవ్వాలి.
మృగముద్రలో అనగా - బొటన వ్రేలు, మధ్య వ్రేలు మరియు ఉంగరపు వేలు కలిపి ఉంచితే వాటి మధ్యలో పట్టినన్ని ఇవ్వాలి.
అక్షింతలను ఏం చేయాలి..??
అక్షతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు.
(వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకొన్న అక్షతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే.)
వృద్ధి చేసుకున్న అక్షతల వినియోగము ఎలా చేసుకోవచ్చు ?
22 జనవరి 2024 రోజున అయోధ్య లో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగతున్న సమయంలో ఇంటిల్లిపాదీ, ఇళ్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకొని,..
గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకుని.. పూజలు ముగించుకొని
1.వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం
2. పిల్లలను, చిన్నవారిని దీవించడం,
3. భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవడం
4. బీరువాలో పెట్టుకోవడం (లక్ష్మీ స్థానం)
5. పిల్లల పుట్టిన రోజున, పెళ్ళి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించడం
6. ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం (పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రమోషన్లు..)
జనవరి 22న - ప్రాణ ప్రతిష్ఠ రోజున చేయాల్సిన పనులు వివరించాలి.
జనవరి 22 ప్రాణ ప్రతిష్ట రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాటు, హారతి మరియు ప్రసాద వితరణ ఉంటుంది అని చెప్పాలి.
అందులో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి.
తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలి.
ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత (రాత్రి) తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి అని చెప్పాలి.
వీలయితే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి అని చెప్పాలి.
Tags: అయోధ్య, Ayodhya, Ayodhya Akshintalu, Ayodhya Rama, Ayodhya Akshintalu, Ayodhya Rama Mandiram, Ayodhya History Telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment