Drop Down Menus

ఈ స్తోత్రాన్ని ఎవరు రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ విముక్తులవుతారు - Sri Durga Apaduddharaka Stotram

ఈ స్తోత్రము చాలా శక్తిమంతమయినది. ఈ స్తోత్రాన్ని ఎవరు రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ కష్ఠాలనుంచీ విముక్తులవుతారు. అందరూ తప్పకుండా నమ్మకంతో చదవండి.

నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |

నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౧ ||

నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే |

నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౨ ||

అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః |

త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౩ ||

అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే జలే సంకటే రాజగ్రేహే ప్రవాతే |

త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౪ ||

అపారే మహదుస్తరే అత్యంతఘోరే విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ |

త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౫ ||

నమశ్చండికే చండదోర్దండలీలాసముత్ఖండితా ఖండలాశేషశత్రోః |

త్వమేకా గతిర్విఘ్నసందోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౬ ||

త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా |

ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౭ ||

నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే |

విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || ౮ ||

శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం

మునిదనుజవరాణాం వ్యాధిభిః పీడితానామ్ |

నృపతిగృహగతానాం దస్యుభిస్త్రాసితానాం

త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద || ౯ ||

ఇతి శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం సంపూర్ణం

అందరం భక్తితో " ఓం దుం దుర్గాయై నమః " అని వ్రాసి అమ్మ వారి అనుగ్రహం పొందుదాం, ఎంత ఆర్తితో స్మరిస్తే అంత త్వరగా అనుగ్రహిస్తుంది ఆ జగన్మాత.

ఓం దుం దుర్గాయై నమః

Tags: Durga, Durga Stotram, Durga Stotram Telugu, Goddess Stotras, Bhakthi Geethalu, Bhakthi Samacharam, Lakshmi Stotram, Sri Durga Apaduddharaka Stotram, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.