హిందూ సాంప్రదాయంలో అమావాస్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ అమావాస్య రోజున విష్ణుమూర్తిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.
అమావాస్య
ఫిబ్రవరి, 9 వ తేదీ, 2024 శుక్రవారం, ఉదయం 08 గం,02 ని (am) నుండి
ఫిబ్రవరి, 10 వ తేదీ, 2024 శనివారం, తెల్లవారుఝాము 04 గం,29 ని (am) వరకు
చొల్లంగి అమావాస్య
పుష్యమాసంలో చివరిరోజైన అమావాస్యని బకుల అమావాస్య... అర్ధోదయ అమావాస్య అని ధర్మశాస్త్రగ్రంథాలు పేర్కొన్నాయి. చొల్లంగి అనేది తూర్పుగోదావరి జిల్లాలోని ఒక గ్రామం. కాకినాడకి దక్షిణంగా, యానాం రహదారి మీద మూడుమైళ్ళ దూరంలో ఉంది చొల్లంగి. గోదావరి ఏడు పాయల్లో (సప్త గోదావరి) ఒకటి తుల్యభాగ. ఆ పాయ చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఆ సంగమప్రాంతంలో స్నానం చేస్తే పుణ్యనదిలోనూ, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది.
ఈ ఏడు గోదావరీ సాగరసంగమాల దగ్గరికి వెళ్ళి స్నానం చేయడాన్ని 'సప్తసాగరయాత్ర' అంటారు. ఈ యాత్రని పుష్యబహుళ అమావాస్యనాడు చొల్లంగి దగ్గర స్నానం చెయ్యడంతో ఆరంభిస్తారు. వరుసగా మిగిలిన సాగరసంగమాల్లో స్నానాలు చేస్తూ మాఘ శుద్ధ ఏకాదశినాటికి అంత ర్వేదికి చేరుకుంటారు. అది వసి ష్టుని పాయ సముద్రంలో కలిసిన ' ప్రదేశం. ఆ రోజు బ్రహ్మోత్స వాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామివారికి కల్యాణమహో త్సవం జరుగుతుంది. మాఘశుద్ధ ఏకాదశిని అంతర్వేది ఏకాదశి అని కూడా అంటారు.
సప్తసాగర యాత్ర..
కఠోరమైన తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి ఆయన జటాజూటం నుంచి ఒక జటను వరంగా పొందాడు. గౌతమ మహర్షి గంగాజలంతో తడిసి ముద్దయిన ఆ జటని ఆయన చనిపోయిన మాయగోవు మీద పిండాడు. ఆ గోవుగా బతికింది. అక్కడి నుంచి ఆ గంగాజలం నదిగా ప్రవహించింది. గోవుని బతికించిన ఆ నది గోదావరి అయింది. గౌతమమహర్షి మూలంగా భూమికి దిగి వచ్చింది కనుక ఆ నది గౌతమిగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఏడుగురు మహర్షులు ప్రార్ధించగా గోదావరి ఏడుపాయలుగా చీలి సప్తగోదావరి అయింది.
ఆ ఏడుపాయల్ని గౌతముడు, తుల్య భాగుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వసిష్ఠుడు మొదలైన ఏడుగురు మహర్షులు తమ వెంట తీసుకుపోయి ఏడు చోట్ల సముద్రంలో కలిపారు. ఆ కారణంగా ఆ ఏడుపాయలూ ఏడుగురు మహర్షుల పేర్లతో లోకంలో ప్రసిద్ధి చెందాయి. తుల్యభాగుడు తన వెంట తీసుకుపోయిన గోదావరి పాయ చొల్లంగి దగ్గర, ఆత్రేయుని పాయ మసకపల్లి దగ్గర, భరద్వాజుని పాయ మొండి దగ్గర, కౌశికుని పాయ రామేశ్వరం దగ్గర, వసిష్టుని పాయ అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నాయి.
అక్షయపుణ్యఫలం
పుట్టుకతో దానవుడైనా, నడవడిలో ఏమాత్రం దానవ లక్షణాలు లేని మహర్షి తుల్యభాగుడు. ఎప్పుడూ పరమార్థ తత్త్వచింతనలో ఉంటూ, తరచుగా చీటికీ మాటికీ దేవదానవుల మధ్య ఏర్పడే వివాదాల్ని ఏ మాత్రం పక్షపాతం లేకుండా చాకచక్యంగా అతను పరిష్కరించేవాడు. అందుకని అతనిని అందరూ తుల్యభాగుడని పిలిచేవాళ్లు. సప్తగోదావరుల్లో ఒక పాయని తీసుకెళ్లి అతను సముద్రంలో కలిపాడు. అందుచేత ఆ పాయకి తుల్యభాగ అనే పేరు వచ్చింది.
చొల్లంగి అమావాస్య సందర్భంగా..
లోకకంటకుడైన తారకాసురుని కంఠంలోని అమృత లింగాన్ని కుమారస్వామి ఛేదించాడు. ఆ లింగం ఐదు శకలాలై (ముఖాలై) వాటిలో ఒకటి దక్షవాటిలో పడింది. ఆ శకలాన్ని సప్తగోదావరీజలంతో శుద్ధి చేసి అక్కడే ప్రతి ష్ఠించాలని సప్తర్షులు సంకల్పించారు. వెంటనే వాళ్లు నదిని అర్థించగా అంగీకరించింది. మహర్షుల వెంట దక్షవాటికి వెడుతూ దారిలో దానవమునుల ఆశ్రమాల్ని ముంచెత్తింది సప్తగోదావరి.
అందుకు కోపించిన దానవమునులు సప్తగోదావరిని శుష్కతోయగా (నీళ్లు ఎండిపోయిన నదిగా) ఉండమని శపించారు.
అప్పుడు తుల్యభాగుడు మధ్యవర్తిగా ఉండి. ఆ రెండు పక్షాల శాపాల్ని ఉపసంహరింపజేశాడు. పుష్య బహుళ అమావాస్యనాడు తుల్యభాగ సముద్రంలో సంగమించే చోట చొల్లంగిలో స్నానం చేసినా, దానజపాలు చేసినా అఖండమైన అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాదు, పితృతర్పణాలు చేస్తే 21తరాల పితృదేవతలు తరి స్తారు. అమావాస్యతిథి పితృదేవతలకి ప్రీతికరమైంది. అమావాస్య నాడు పితృవ్రతం చెయ్యాలని చతుర్వర్గ చింతామణి చెప్పింది.
పంచభూతాల్లో జలం శ్రేష్ఠమయింది. ఆ జలాల్లో గంగాజలం ఉత్తమమైంది. గంగాజలం కంటే ఉత్తమమైంది గోదావరి జలం. అందువల్ల ఈ అమావాస్యనాడు చొల్లంగిలో స్నానమాచరిస్తే పాపాలన్నీ నశిస్తాయి. కోరికలన్నీ తీరతాయి.
పుణ్యస్నానాల్లో సముద్రస్నానం ఉత్తమమయింది. ఉప్పు. నీటిలో స్నానం చెయ్యటం వల్ల చర్మగత దోషాలు పోతాయని ఆయుర్వేదశాస్త్రం చెబుతోంది. ఇక జీవనదిలో స్నానం చెయ్యటం వల్ల జలాధిదేవత అయిన వరుణుని శక్తి, సూర్య చంద్రకిరణశక్తి, మహర్షుల తపశ్శక్తి, మూలికలశక్తి, ఖనిజ శక్తి లభిస్తుంది.
'ప్రతి సంవత్సరమును పౌష్యబహుళ అమావాస్యనాడు. చొల్లంగి గ్రామమునకు తుల్యసాగర సంగమస్థలమున నవ గాహనము సేయవచ్చు. వేలకొలది యాత్రికులకు తుల్యనదీ ప్రభావము వినుతి కెక్కనదే' అనే కథ ప్రచారంలో ఉంది.
పుష్యమి అమావాస్య పూజా విధానం:
పుష్యమి అమావాస్య రోజు శ్రీమహావిష్ణువుని పూజించాలి అనుకునేవారు తప్పకుండా భక్తిశ్రద్ధలతో ఉండాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఉదయాన్నే శుభ సమయాల్లో నిద్రలేచి పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరించాల్సి ఉంటుంది.
ఇలా స్నానాన్ని ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
ఆ తర్వాత ఇంటికి చేరుకొని ఇంట్లో పట్టు వస్త్రాలను ధరించి చనిపోయిన పూర్వీకుల ఫోటోలకు పూలదండలు సమర్పించాలి.
ఆ తర్వాత వారికి నైవేద్యాన్ని సమర్పించి ఈరోజు దానధర్మ కార్యక్రమాలు చేయడం చాలా శుభప్రదం.
ఇంట్లో ఉన్న శ్రీమహావిష్ణువు ఫోటోకి పూలమాలను సమర్పించి స్తోత్రాన్ని చదువుతూ ధ్యానం చేయాల్సి ఉంటుంది.
ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికల నెరవేరుతాయి.
పుష్యమి అమావాస్య ప్రాముఖ్యత:
పుష్యమి అమావాస్యకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ అమావాస్య రోజు పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించడం వల్ల వారి అనుగ్రహం లభించి జీవితంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.
అంతేకాకుండా ఈరోజు నదీ స్నానాన్ని ఆచరించి అర్ఘ్యం సమర్పించడం వల్ల జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి.
Tags: పుష్యమి అమావాస్య, Paush Amavasya, Amavasya, 2024 Amavasya, Chollangi Amavasya, Pushya Amavasya,