భార్య గర్భవతి గా ఉన్నపుడు భర్త కటింగ్,షేవింగ్ ఎందుకు చేయించుకోకూడదు? Why should the husband not cut and shave when the wife is pregnant?
భార్య గర్భవతి గా ఉన్నపుడు భర్త కటింగ్,షేవింగ్ ఎందుకు చేయించుకోకూడదు?
వైదిక సంప్రదాయంలో పిల్లని కనడాన్ని ఒక యజ్ఞం లా భావించేవారు, అందుకే మన సనాతన ధర్మంలో సృష్టిని యజ్ఞం అన్నారు, అలా చేయడాన్ని పుంసవనం అంటారు,
ఆ తర్వాత గర్భధారణ జరిగాక, 3 వ నెల నుంచి భార్య గర్భం దాల్చాక భర్త కేశపాశాలను మీసమును గడ్డమును పెంచుతాడు, ఎందుకంటే ముందుకాలంలో గర్భం దాల్చి బిడ్డ బయటికొచ్చే కాలాన్ని జాతా సౌచం అనేవారు, క్షౌరం చేసేప్పుడు ఏదేని దెబ్బ తగిలి అది పుండు అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా, అలాగే పవిత్రమైన ప్రేత సంస్కారం వల్ల స్మశానానికి వెళ్తే అక్కడున్న మన కంటికి కనపడని వైరస్ లు ఇంకా పోస్ఫోరస్ లాంటి గ్యాస్ ఇంట్లో రావడం వల్ల కడుపులో బిడ్డకు ఇబ్బంది ఏర్పడుతుందని ఆ పురుషున్నిస్మశానానికి అనుమతించేవారు కాదు.
ఇంకా ఆ అబ్బాయిని పథ్యమైన ఆహరం(ఉప్పు కారం తీక్షణమైన ఆహరం) తగ్గించి ఇవ్వడం వల్ల భార్య యొక్క మనస్థితిని కొంచెం ఓపికగా భరిస్తాడని, అన్ని ఇబ్బందులకు ఓర్చుకుని కాపాడుకుంటాడు, అది ఇంచుమించు వానప్రస్థాశ్రమం లా ఉండడం, అన్యులకు అయన మీద కామం ఏర్పడకుండా అతను ఒక దీక్షలో ఉన్నాడు అని సూచించే విధంగా మగవారిని గడ్డం మీసం క్షౌరం లేకుండా ఉండమనేవారు.
దేవాలయాలకు వెళ్ళకపోవడం, కొబ్బరికాయలు నిషేధించడం, అన్య స్మశాన కర్మలకు వెళ్ళకపోవడం, దేవాలయ అర్చనలు చేయకుండడం అనేవి భార్య కోసం భర్త ఇంటిపట్టునే ఉండడం కోసం పెట్టిన నియమాలు..
Tags: భార్య గర్భవతి, Wife, Husband, Marriage, Pregnant, Pregnancy, Wife Pregnant, Wife Pregnancy husband rules, Dharma Sandesalu telugu
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment