Drop Down Menus

గరుత్మంతుని యొక్క ద్వాదశ నామాలు - Sri Garuda Dwadasa Nama Stotram

ఎవరైతే గరుత్మంతుని యొక్క ద్వాదశ నామాలను ప్రతిరోజూ ఉదయం స్నానం చేస్తూ జపిస్తారో వారికీ విషం వల్ల , విష సర్పాలవల్ల ప్రమాదాలు ఉండవు. ఏ జంతువుల వల్ల ప్రమాదాలు ఉండవు. జీవిన పోరాటంలో విజయాలు సాధిస్తారు . చేసే ప్రయాణాలు విజయవంతంగా ముగుస్తాయి.

శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రమ్:

సుపర్ణం వైనతేయం చ నాగారిం నాగభీషణమ్

జితాన్తకం విషారిం చ అజితం విశ్వరూపిణమ్


గరుత్మన్తం ఖగశ్రేష్ఠం తార్క్ష్యం కశ్యపనందనమ్

ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః

యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వత్ర విజయీ భవేత్

విషం నాక్రామతే తస్య న చ హింసంతి హింసకాః


సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే

బంధనాన్ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ

ఇతి శ్రీ గరుడ ద్వాదశనామ స్తోత్రమ్. 

గరుడ ద్వాదశ నామాలు :

1.సుపర్ణ - మంచి రెక్కలు గలవాడు.

2. వైనతేయ - వినతాదేవికి పుట్టినవాడు.

3. నాగారి - నాగులకు శత్రువు.

4. నాగభీషణ - నాగులకు విపరీతమైన భయాన్ని కలిగించేవాడు.

5. జితాంతకుడు - మరణాన్ని కూడా జయించగలవాడు.

6. విషారి - విషాన్ని హరించువాడు.

7. అజిత్ - జయించడానికి సాధ్యంకానివాడు.

8. విశ్వరూపి - సాక్షాత్తు విష్ణువుని పోలినవాడు.

9. గరుత్మాన్ - మహా శక్తిమంతుడు.

10. ఖగశ్రేష్ఠ - పక్షులలో గొప్పవాడు.

11. తర్కషే- గరుత్మంతుడి మరొక పేరు.

12. కస్యప నందన - కస్యప ప్రజాపతి కుమారుడు.

Tags: శ్రీ గరుడ ద్వాదశ నామ స్తోత్రం, గరుత్మంతుడు, Sri Garuda Dwadasa Nama Stotram, Garuthmanthudu, Garukmanthudu Dwadasa Namalu, Garukmanthudu Dwadasa Namalu Telugu, Vishnu Stotram

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments