Drop Down Menus

గోమాత దర్శనము, గోవుకు గడ్డి పెట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం శుభకరం - Gomatha Slokam

గోవుకు గడ్డి పెట్టేటప్పుడు, తగిన ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం శుభకరం.

ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య సంభవే!

ప్రతీచ్ఛేమం మయాదత్తం సౌరభేయి! నమోస్తుతే!!

పంచ భూతాలకు శుభాన్ని కలిగించే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా! సూర్యుని నుండి కలిగినదానా! (సౌరశక్తిలోని దివ్యత్వం గోవులో ఉన్నదని భావం). నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరించు. సురభీ వంశంలో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.

గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:

నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచ l

నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ll

శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము.

గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతః l

గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహం ll 

గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను

సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతే l

మమాభిలషితంకర్మ సఫలం కురు నందిని ll

ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము.

గోమాతను పూజించండి.

గోమాతను సంరక్షించండి.

Tags: Gomatha Slokam, Gomata, Gomatha Slokas Telugu, Telugu Slokam, Bhakthi Slokas, Bhakthi Samacharam, Devotional Storys, Stotra Nidhi, Cow, Gomata History

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.