Drop Down Menus

హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి..?? అసలు హారతి ఎలా ఇవ్వాలి..?? Devudiki Harathi Ela Ivvali

హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి..?? అసలు హారతి ఎలా ఇవ్వాలి..??

దేవుళ్ళకి హారతి ఎందుకివ్వాలి..?? 

అందరూ పూజ చేసిన తర్వాత హారతి ఇస్తారు. కానీ అసలు హారతి ఇవ్వడం వెనుక ఉన్న ప్రాముఖ్యత మీకు తెలుసా?

పూజ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ చివర్లో హారతి ఇస్తారు. ఇది హిందూమతంలో పవిత్రమైన ఆచారం. ఈ పురాతన సంప్రదాయంలో దేవతలకు కాంతి, ధ్వనిని అర్పించడం. ఇది భక్తికి ప్రతీక. దేవుని దీవెనలు కోరడం. గంట కొడుతూ హారతి ఇవ్వడం దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం ఇప్పటికీ ఆచారిస్తున్నారు.

హారతి అంటే ఏంటి..??

పురాతన వేద సాంప్రదాయాల ప్రకారం హోమం అని పిలిచే పవిత్రమైన అగ్ని ఆచారాల నుంచి ప్రేరణ పొందింది. ఒక సిద్దాంతం ప్రకారం దేవాలయ గర్భగుడిలో ఉన్న పవిత్రమైన దేవతల చిత్రాలు, విగ్రహాలు బయటకి కనిపించడం కోసం పూజారులు ఇలా హారతి ఇచ్చేవారు. పూజారులు వేద మంత్రాలు లేదా ప్రార్థనలతో దీపాన్ని వెలిగించి తల నుంచి కాలి వరకు తిప్పుతూ దేవుళ్ళకి హారతి ఇస్తారు. ఇది తరతరాలుగా విస్తరించి ఉన్న దైవిక సంబంధాన్ని ప్రేరేపిస్తుంది.

హారతి ఎలా ఇవ్వాలి..??

హారతి ఇవ్వడం అంటే దేవతల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేయడం. నిర్ధిష్ట నియమాలకు కట్టుబడి చేసే ఒక పవిత్రమైన క్రియ. చేతులు, ముఖం,పాదాలు ముందుగా శుభ్రపరుచుకోవాలి. మంచి వస్త్రాలు ధరించాలి. దేవత విగ్రహం చుట్టూ హారతి తిప్పుతూ ఇవ్వాలి. ఒక ప్లేట్, గంట, పువ్వులు, అగర్ బత్తి, కర్పూరం, చిన్న టవల్, నీరు వంటి అవసరమైన వస్తువులు సేకరించాలి. ప్లేట్ పట్టుకుని పువ్వులు, ధూపం సమర్పించడం దేవతల మీద ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది.

ప్రతికూల శక్తుల్ని పారద్రోలడానికి ఎడమ చేతితో గంటను మోగించాలి. కర్పూరం వెలిగించి దేవత ముందు వృత్తాకారంలో తిప్పుతూ ఇవ్వాలి. హారతి తర్వాత శుద్ది చేసిన కొన్ని నీటిని తీసుకోవాలి. దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ కృతజ్ఞతా భావాన్ని తెలియజేయాలి.

హారతి గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..??

హారతి ఇవ్వడం వెనుక భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలు కలగలిపి ఉన్నాయి. హారతి ఇచ్చేటప్పుడు వృత్తాకార కదలికలో లయబద్ధంగా గంట మోగించడం వల్ల ధ్యాన, ప్రశాంతమైన వాతావరణానికి దోహదపడుతుంది. ఇవి మనసు, శరీరం, ఆత్మను సమకాలీకరించడంలో సహాయపడుతుంది.

ధూపం, కర్పూరం చికిత్సా ప్రభావాలు కలిగి ఉంటుంది. వాసన ఇంద్రియాలని ప్రేరేపిస్తుంది. విశ్రాంతి ఇస్తుంది. సున్నితమైన పొగ పర్యావరణాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. దీపం వెలిగించడం ప్రతీక వాదానికి మించింది. జ్వాల దైవిక ఉనికిని సూచిస్తుంది. చీకటిని పారద్రోలుతుంది. జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. కాంతి మానసిక స్థితిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

హారతి సమయంలో ప్రార్థనలు, మంత్రాలు జపించడం, పాటలు పాడటం వల్ల ధ్వని కంపనాలు ఉత్పన్నమవుతాయి. ఆధ్యాత్మిక సంబంధాన్ని పెంపొందిస్తాయి.

పూజ తర్వాత హారతి ఆచారం ఎందుకు అవసరం..??

పూజ చేసిన తర్వాత హిందూ సంప్రదాయాలలో హారతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. హారతి అనేది దేవత ముందు వెలిగించి దీపం భక్తి ఆచారం. హారతి దేవత ఉనికిని ప్రేరేపిస్తుందని నమ్ముతారు. లయబద్ధంగా కదిలించడం వల్ల దేవత దృష్టిని ఆకర్షించడం అవుతుంది. పూజ చేసే వారికి, దైవానికి మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని సృష్టిస్తుంది.

ధూపం, కర్పూరం వేసి హారతి ఇవ్వడం వల్ల వచ్చే కాంతి, సువాసన శుద్ధి చేసేవిగా పరిగణించబడతాయి. ఇలా చేయడం వల్ల వాతావరణం శుభ్రపడుతుంది. ప్రతికూల శక్తులని తొలగిస్తుందని నమ్ముతారు. పవిత్రమైన, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి
ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తే కలిగే ప్రయోజనాలు
పూజ గది ఎలా ఉండాలి? ఇంట్లో ఎక్కడ ఉండాలి తెలుసా?
ఇంట్లో పూజ ఎవరు చేయాలి?
మంగళవారం ఇలా చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి
నవగ్రహ దోష నివారణకు గణపతి పూజా విధానం
శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి.

Tags: హారతి, harathi, kashi harathi, temple harathi, dhupam, pooja vidhanam, puja, 

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.