శివరాత్రి నాడు చేయవలసినవి, చేయకూడనివి ఇవే..!
శివరాత్రి అనగానే అందరికీ గుర్తుకువచ్చేది..
లింగోద్భవం.
అసలు లింగోద్భం గురించి పురాణాగాథలు ఏమిటీ తెలుసుకుందాం.
శివరూపం లింగరూపం అందులోనూ వృత్తాకారం శివుడు , పానవట్టం పార్వతీరూపం అని ఆగమ వాక్యం.
ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకం గురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది.
ఆ రూపం పై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ , వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారం ప్రతీకగా ఏర్పడినది.
జ్ఞానరూపియైన శివుడు చైతన్యజ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్య గా చెపుతారు దానిముందురోజు శివరాత్రిగా చెపుతారు.
కాబట్టే లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని శివరాత్రి గా చెపుతారు.
ఇదిప్రతిమాసంలో వస్తుంది. కానీ పాలసముద్రం చిలికినపుడు హాలాహలభక్షణం చేసి ఒక చిన్న రేగుపండు అంతగా చేసి కంఠంలో ధరించినరాత్రి లోకాల్నికాపాడిన శివుని ఆరాత్రి జాగరణతో దేవతలు జనులు ప్రార్థించినరాత్రిగా మహాశివరాత్రి అని చెపుతారు.
లోకమంతా శివరక్షణవల్ల మంగళాన్ని పొందుటవల్ల దానికి ప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడ జరుపుతారు.
లింగోద్భవ పుణ్యకాలం ఫిబ్రవరి 18 అర్ధరాత్రి 12 గంటలకు.శివరాత్రి నాడు చేయవలసిన విధులు ఇవే..
అన్నం కాకుండా పాలు, పండ్లు పలహారం మాత్రమే తీసుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి ఇతరులతో మాటల్లోకూడా దైవసంబంధమైనవే ఎక్కువగా ఉండటం వీలైనంత తక్కువ వమాట్లడటం ఎక్కువసేపు పంచాక్షరీ
(ఓం నమశ్శివాయ)
జపం చేయటం పండ్లు పలహారాలు దేవునుకి నివేదించటం వాటిని ఇతరులకు పంచిపెట్టటం వీలైనంత వరకు జాగరణచేయటం శివునికి అభిషేకం చేస్తే చాలామంచిది.
చాపమీద పడుకోవాలి , స్త్రీ లైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించాలి.
లింగోద్భవపుణ్యకాలం వరకూ మేల్కొని ఉండాలి. వీలైతే మరుసటి రోజువరకూ ఉండాలి.
ఎవరూ కూడా అనారోగ్యంతో ఉపవాసం చేయకండి సాత్విక ఆహారం స్వీకరించి పూజించండి.
ప్రాతస్సంధ్య,సాయం సంధ్యలో నిద్రపోకండి, శివ పూజకి మొగలిపూవు వాడకండి.
నీటిని అభిషేకానికి ఎక్కువగా వాడండి ఇతరపదార్థాలు (పంచామృతం,పండ్లరసాలు,సుగంధ పరిమళ పదార్థాలు) తక్కువగా వాడండి.
సిమెంట్ రాతివంటి అన్నిలింగాలకన్నా పుట్టమన్నుతో చేసినశివలింగానికి అభిషేకిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది.
తినాల్సిన స్థితివస్తే పిండిపదార్థాలు తీసుకోవచ్చు. పండ్లు, పాలు తీసుకోండి.
అవీ తక్కువ మోతాదులో శరీరానికి అవసరమైన కనీస స్థాయిలో మాత్రమే.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు..
Tags: శివరాత్రి, Sivaratri, Maha Shivaratri, Lord Shiva, Siva Stotram, Shivaratri Importance, Shiva
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment