ప్రాణాపాయం లో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు…..అట
ఓరేయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా, నీ భార్య చేసిందా, నీ బిడ్డలు చేసినారా, నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? మీ గురువుల అనుగ్రహం వున్నదా? నీకు పుణ్యం లేదు, నీకు ధారపోసిన పుణ్యం లేదు….మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేదిరా? అనుభవించు నీ కర్మ …..అని అంటాడు…
మన పుణ్యం మన జాతకంలో గురు రూపంలో కనిపిస్తుంది….గురు అనుగ్రహం వున్నదా? గురు దృష్టి వున్నదా? శుభ గ్రహ దృష్టి వున్నదా? వుంటే బ్రతికిపోతావు…..లేదా బాధ పడాలి, తప్పదు…..పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే…..మనసు బాధ పడితే పాప కర్మ క్షయం అవుతుంది…
మనసు సుఖ పడితే పుణ్య కర్మ క్షయం అవుతుంది…..పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే ..ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు, పాపమూ లేదు….అదే అకర్మ….వికర్మ…సుకర్మ……కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు
తాత ముత్తాతలు చేసిన పుణ్య ఫలం, పాప ఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చితీరుతుంది….
ఆ పుణ్యమే నీ మనుమలన్ని కాపాడుతుంది కూడా…మీ వంశాన్ని కాపాడుతుంది…..ఇదే మన జాతకంలో రెండవ ఇల్లు, తొమ్మిదవ ఇల్లు స్పష్టంగా చెబుతుంది…
మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృ దేవతలు చేసిన పుణ్య ఫలితం వలన బ్రతికి బయట పడతాము…..వారి పుణ్య ఫలం మనల్ని కాపాడుతుందీ …
మనం చేసిన పుణ్య ఫలం మన బిడ్డలను కాపాడుతుంది…
Tags: Bhakthi Samacharam, Devotional Storys, Dharmasandehalu, Devotinal News, Adyatmika Samacharam, Telugu Devotional Stories
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment