తిరుమలలో ఈ టికెట్లకు ఫుల్ డిమాండ్.. దొరికితే మీ అంత లక్కీ ఇంకెవరూ ఉండరు..Tirumala Angapradakshinam Full Details

శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకుంటున్నారా..

తిరుమలలో కొన్ని టికెట్లకు భక్తులకు భారీగా డిమాండ్ ఉంటుంది. అవి అంత ఈజీగా దొరకవు. ఎంతో అదృష్టం ఉంటేనే లభిస్తాయి. ఆ టికెట్లు ఏంటి? ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం  వేలాది మంది  భక్తులు తిరుపతికి వెళ్తుంటారు. ఆలయంలో శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు పలు రకాల సేవల్లోనూ పాల్గొంటారు. వీటికి ప్రతినెలా టీటీడీ ఆన్‌లైన్ వేదికగా టికెట్లను విడుదల చేస్తుంది.

శ్రీవారి అంగప్రదక్షిణం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లోనే కేటాయిస్తారు. ఈ టికెట్లు పొందిన వారికి శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం చేసే అవకాశం దొరుకుతుంది. ఈ టికెట్స్ ను 3 నెలల ముందే విడుదల చేస్తారు 

ప్రతి నెల 23వ తేదీన అంగ ప్రదక్షిణ టికెట్స్ విడుదల చేస్తున్నారు. ఒక్కోసారి తేదీ మారవచ్చు హిందూ టెంపుల్స్ గైడ్ మీకు ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది.  టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in/ లేదా ttd Devasthanams యాప్‌లోను అంగ ప్రదక్షిణ టికెట్స్  బుక్ చేసుకోవచ్చు.

ప్రతిరోజూ 700 మందికి మాత్రమే అంగప్రదక్షిణ చేసే అవకాశం లభిస్తుంది. ఈ టికెట్లు పొందిన వారు.. రాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో మూడు మునకలు వేసి.. తడి బట్టలతో వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ ద్వారా లోపలికి వెళ్లాలి.

రిపోర్టింగ్ సమయం రాత్రి ఒంటి గంట కాబట్టి.. ఆ సమయానికే క్యూలైన్‌లకు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఎంట్రీ వద్ద.. బుకింగ్ టికెట్, ఐడిని చెక్ చేసిన తర్వాత భక్తులను ఆలయం లోపలి అనుమతిస్తారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా వెయిటింగ్ హాల్లోకి పంపిస్తారు.

శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత.. భక్తులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. తెల్లవారుఝామున 2: 45 గంటలకు మొదట స్త్రీలను .. ఆ తర్వాత పురుషులకు అనుమతి ఉంటుంది. సుప్రభాత సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ పూర్తి అవుతుంది. వారి ప్రదక్షిణ పూర్తయి వెండి వాకిలి వద్దకువెళ్లాక.. పురుషులను అంగప్రదక్షిణకు అనుమతి ఉంటుంది.

ప్రదక్షిణ ఎలా ఉంటుంది? ఎన్నీ ప్రదక్షిణలు??

ప్రదక్షిణ స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ  శ్రీవారి హుండీ (ధనలక్ష్మి విగ్రహం వరకు) చేరుకోవాలి. అప్పుడు ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ప్రదక్షిణలు చేయడం (దొర్లడం)లో ఇబ్బంది కలగకుండా (స్త్రీలు) శ్రీవారి సేవకులు పర్యవేక్షణ చేస్తారు.. కనుక ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. అంగప్రదక్షిణ చేసిన భక్తులకు అంగ ప్రదక్షిణ పూర్తీ కాగానే  శ్రీవారి దర్శనం, ఒక ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు.

సాంప్రదాయ దుస్తులు:

అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలే ధరించాలి. స్త్రీలు చీరలు, లంగా వోణీ వంటివి ధరించాలి. పురుషులు పంచె, కండువా ధరించాలి. షార్ట్, ట్రాక్ ప్యాంట్, టీషర్ట్, షర్ట్, జీన్స్ ప్యాంట్ వంటి దుస్తులను ధరిస్తే.. అంగప్రక్షిణకు అనుమతించడం లేదు.

అంగప్రదక్షిణ టిక్కెట్:

స్వామివారి ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలనుకునే భక్తులు దీని టిక్కెట్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనవసరం లేదు. ఆన్లైన్ ద్వారా ఈ అంగప్రదక్షిణ టిక్కెట్ ఉచితంగా పొందొచ్చు. మోబైల్ నెంబర్ తో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణ చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం, 1 ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు. ఒకసారే మనం రెండు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఏ ఇద్దరైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. 12 సంవత్సరాల లోపు పిల్లలను టికెట్ లేకుండా తీసుకుని వెళ్ళవచ్చు. అంగ ప్రదక్షిణ చేసిన వారికి మొదటి గడప దర్శనం ఉండదు, సర్వదర్శనం భక్తులకు ఇచ్చే జయవిజయుల నుంచే దర్శనం ఉంటుంది. 

Click here: తిరుమల పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags: అంగప్రదక్షిణ, Tirumala Angapradakshinam, angapradakshinam benefits, how to do angapradakshinam, angapradakshinam at, tirumala tickets online, angapradakshinam tickets, angapradakshinam experience, angapradakshinam in tirumala video, angapradakshinam in tirumala cost, angapradakshinam in tirumala timings

3 Comments

  1. WITH ONE MOBILE LOGIN HOW MANY TICKETS WE CAN BOOK SIR ?

    ReplyDelete
  2. 21october 12ki aggapradhakshinam ticket booking chesanu 20 night 12 ki vellala

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS