Drop Down Menus

రికార్డు స్థాయిలో తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ | Tirumala Modati Gadapa Tickets Record

 

tirumala modati gadapa

ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం ... కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సామాన్య భక్తులకు కూడా అవకాశం ఇస్తూ ప్రతి నెల ఆర్జిత సేవలను విడుదల చేస్తుంది. తిరుమల మొదటి గడప దర్శనాలు అనగా సుప్రభాతం , తోమాల , అర్చన , అష్టదళ పాద పద్మారాధన సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కరోనా తరువాత సేవ ప్రారంభించిన వెంటనే నిజపాద దర్శనం సేవను రద్దు చేసారు. ప్రస్తుతం నాలుగు రకాలైన సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలకు ప్రతి నెల లక్కీ డ్రా వేస్తున్నారు , ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల  నుంచి 20వ తేదీ 10 గంటల వరకు లక్కీ డ్రా లో రిజిస్టర్ చేయడానికి అవకాశం ఇచ్చ్హారు ఈ సారి రికార్డు స్థాయి లో భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. 

సుప్రభాత సేవ కు : 2,99,147 మంది 

తోమాల సేవ కు : 2,76,111 మంది 

అర్చన సేవ కు 2,71,987 మంది

అష్టదళ పాద పద్మారాధన సేవ కు 2,61,715 మంది నమోదు చేసుకున్నారు. 

సేవ టికెట్ ధరలు ప్రస్తుతం ఇలా ఉన్నాయి 

సుప్రభాత సేవ టికెట్ ధర 120/- రూపాయలు

తోమాల సేవ టికెట్ ధర 220/- రూపాయలు 

అర్చన సేవ టికెట్  ధర 220/- రూపాయలు 

అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్ ధర 1250/- రూపాయలుగా ఉన్నాయి . 

#tirumala updates tirumala breaking news

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments