Ugadi 2024 ఉగాది పచ్చడి తయారు చేసే విధానం Ugadi Pachadi Recipe

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది" అన్న తెలుగు మాట "యుగాది" అన్న సంస్కృతపద వికృతి రూపం.

ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు రసం, అరటి పళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవి వాడుతారు.

ఉగాది పచ్చడి తయారీ విధానం: అవసరమై పదార్ధాలు:

మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది)- 1

వేప పువ్వు- 1/2 కప్పు

సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు

కొత్త చింతపండు- 100 గ్రాములు

కొత్త బెల్లం- 100 గ్రాములు

మిరపకాయలు- 2

అరటిపండు - 1

చెరకు రసం -1/2 కప్పు

ఉప్పు - సరిపడేంత

నీళ్లు

అవసరమైతే అరటి పళ్లు, జామకాయలను కూడా వేసుకోవచ్చు.

తయారు చేసే విధానం:

ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి.

Tags: Ugadi, Ugadi Pachadi Recipe, Ugadi Pachadi, Rasi phalalu, Ugadi 2024, ఉగాది పచ్చడి

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS