Drop Down Menus

"లక్ష్మీదేవి సిరిసంపదలను ఎలా అనుగ్రహిస్తుంది" How to Obtain Goddess Lakshmi's Blessings

"లక్ష్మీదేవి ఎలా అనుగ్రహిస్తుంది"

లక్ష్మీదేవి సిరిసంపదలను ఎలా అనుగ్రహిస్తుంది అని చెప్పడానికి ఓ కథ ప్రచారంలో వుంది.

పశుపతిశెట్టికి గౌరి, వినీత్ అనే ఇద్దరు సంతానం వున్నారు. వీరిద్దరూ పెళ్ళిళ్ళయ్యాక ఒకరి సంతానాన్ని మరొకరి సంతానానికిచ్చి వివాహం జరిపించాలని వాగ్దానం చేసుకుంటారు. గౌరికి ముగ్గురు కుమార్తెలు, వినీత్ కు ముగ్గురు కుమారులు జన్మిస్తారు. సంపదలతో తులతూగే గౌరి తన వాగ్దానాన్ని విస్మరిస్తుంది.

నిరుపేదైన సోదరుని కుటుంబంతో వియ్యమందటానికి ఇష్ట పడదు. అయితే గౌరి మూడవ కుమార్తె సుగుణ తల్లి వాగ్దానానికి కట్టుబడి, మేనమామ కుమారుని వివాహం చేసుకొని, వారి పూరి గుడిసెలో నివసిస్తుంటుంది. ఒకరోజు సుగుణ ఇంటి పైకప్పుపై నుండి ఓ గద్ద వజ్రం పొదిగిన ఉంగరాన్ని జారవిడుస్తుంది.

ఆ ఉంగరం రాజుగారిదిగా గుర్తించిన సుగుణ, దాన్ని ఆయనకు అందజేస్తుంది. ఆమె నిజాయితీని మెచ్చిన రాజు ఓ బహుమానాన్ని ప్రసాదిస్తాడు. దాని ప్రకారం తర్వాతి శుక్రవారాన్ని 'సుగుణదినం'గా ప్రకటిస్తాడు. అంటే ఆ రోజున సుగుణ ఇంట్లో మినహా మిగతా ఎవరిళ్ళలోనూ దీపాలు వెలిగించకూడదు. దాంతో, దీపం వెలుగులు విరజిమ్మే సుగుణ ఇంటికి సంపదల దేవత లక్ష్మి ప్రవేశిస్తుంది.

ఇక ఆమె ఎప్పుడూ ఆ ఇంటిని విడిచి వెళ్ళలేదు. ఎక్కడయితే దీపం వెలుగుతుందో అక్కడ సంపద వుంటుందనే నమ్మకం భారతీయులలో వుంది. అటువంటిది, ఎల్లెడలా దీపపు తోరణాలు స్వాగతిస్తుంటే సిరిలక్ష్మి కాదనగలదా? అందుకే దీపావళినాడు దీపాలతో తమ ఇళ్ళను అలంకరించుకుని లక్ష్మీదేవిని స్వాగతిస్తారు.

భూలోక వైకుంఠం తిరుమల తిరుపతిలో శ్రీమహాలక్ష్మి.

శ్రీ పద్మావతిదేవితో వివాహం అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి - "తాను కలియుగాంతం వరకు వేంకటాద్రిలో వుంటానని, అప్పుడు నా అవతారం వేంకటేశ్వరస్వామి. కనుక నాకు లక్ష్మీకి పద్మావతికి నివాసయోగ్యమైన ఒక దేవాలయం కట్టించండి. రాజ్యాన్ని మీరు యిద్దరు పంచుకున్నారు. జ్యేష్ఠపుత్రిక అయి వుండి కూడా ఆమెకు పిత్రార్జితమేమియు ముట్టలేదు. కనుక దేవాలయ ఏర్పాట్లు చూడండి" అన్నాడు శ్రీనివాసుడు.

"తప్పకుండా అదేపనిలో వుంటాము" అన్నాడు తొండమానుడు. వేంకటా చలంలో శ్రీనివాసులు చెప్పినట్లు నిర్మాణం పూర్తిచేశారు. వరాహస్వామికి ఆశ్రమం నిర్మించాడు.

నారదుడు లక్ష్మీదేవిని కలుసుకుని ఆమెను ఆవేశపరురాలిని చేశాడు. వెంటనే ఆశ్రమానికి వచ్చింది. పద్మావతి, లక్ష్మీ తగవులాడుకొని నేను భార్యనంటే నేను భార్యను అని యిద్దరు చెరో చెయ్యి పట్టుకుని లాగేశారు.

శ్రీనివాసుడు ఎంత వారించినా వినటం లేదు. విసుగుపుట్టి ఏడడుగులు వెనక్కి వేసి శిలారూపంగా మారిపోయాడు.

ఇద్దరు వెనక్కి తిరిగి చూసేసరికి శిలా ప్రతిమలా కనుపించాడు. 'స్వామీ' అంటూ ఇద్దరూ తలలు బాదుకున్నారు.

అప్పుడు శ్రీనివాసుడు.

"ప్రియపత్నులారా! బాధపడవలదు. ఇప్పటి నుండి నేను వేంకటేశ్వరునిగా పిలవబడతాను. ఈ కలియుగం అంతం వరకూ తిరుమలలో ఈ రూపంలో వుంటాను. నా భక్తుల కోర్కెలను తీరుస్తూ వుంటాను" అని లక్ష్మీకి పద్మావతికి వివరించాడు.*

"చెల్లీ" "అక్కా" ఇద్దరూ కౌగలించుకున్నారు. గొడవ తగ్గినందుకు శ్రీనివాసుడు సంతోషించాడు.

"లక్ష్మీ! నా వివాహానికి కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాను. ఆ అప్పు కలియుగాంతం లోపల తీర్చవలెను. అంతవరకూ వడ్డీ కట్టవలెను. అందు వలన నీవు నా వక్షఃస్థలముపై ఆసీనురాలవు కమ్ము. పద్మావతి నీవు నా దక్షిణ వక్షంలో వుండుము. కానీ నీ అంశముగా లక్ష్మీని సృష్టించి, పద్మ సరోవరంలో వుండునట్లు చేయుము”. అని శ్రీ వేంకటేశ్వరస్వామి పలుకగా లక్ష్మీదేవి సంతోషించింది.

శుకాశ్రమం సమీపమున అలివేలుమంగయను పేరొక అగ్రహారం, దేవాలయం నిర్మించి అందు పద్మావతినీ, పద్మసరోవరం కట్టించి ఆ సరోవరంలో పద్మ పుష్పమందు లక్ష్మీని వుండమని, భక్తుల కోర్కెలు తీరుస్తూ వారికి ధన సహాయం చేస్తూ వుండమని ఆజ్ఞాపించాడు. రాత్రులందు శ్రీనివాసుడు మంగాపట్నం వచ్చి సుప్రభాత సమయంలో తిరుమలకు వెళ్తుంటాడు.

Tags: Lakhmi devi, lakshmi, tirumala, padmavathi ammavaru, aluvelu mangamma, ttd, srivasudu, venkateswara swamy, lakshmi narayana

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.