జ్యేష్ఠ మాసం ప్రారంభం.. జ్యేష్ట మాసం విశిష్టత.. ఈనెలలో ఏం చేస్తే పుణ్యం దక్కుతుంది? Jyeshta Masam Importance
జ్యేష్ఠ మాసం ప్రత్యేకత
[రేపటి నుండి ప్రారంభం]
(7-06-2024 నుండి 05-07-2024 వరకు)
చాంద్రమానం ప్రకారం చైత్ర .. వైశాఖ మాసాల తరువాత వచ్చే జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైన వ్రతాలకు... పర్వదినాలకు వేదికగా కనిపిస్తుంది.
పితృదేవతల రుణం తీర్చుకోవడానికీ.. పాపాలను పరిహరించుకోవడానికి ... దైవసేవలో తరించడానికి అవసరమయ్యే కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి.
జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెలరోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
👉 పార్వతీదేవి ఆచరించిన 'రంభావ్రతం'.
👉 వివాహిత స్త్రీలు ఆచరించే, 'అరణ్యగౌరీ వ్రతం'...
👉 గంగానది స్నానం తో పదిరకాల పాపాలను హరించే 'దశపాపహర దశమి'.
👉 'త్రివిక్రమ ఏకాదశి' పేరుతో పిలవబడే 'నిర్జల ఏకాదశి' భక్తకోటిపై తమ ప్రభావం చూపుతుంటాయి.
👉 అలాగే సూర్యుడిని ఆరాధించే 'మిథున సంక్రమణం' ... వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే 'ఏరువాక పున్నమి' ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి.
👉 ఇక దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే 'జ్యేష్ఠ పౌర్ణమి'.
👉 శ్రీమహావిష్ణువు ఆరాధనలో తరింపజేసే, 'అపర ఏకాదశి' ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయి.
👉 ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను.. మరెన్నో విశేషాలను సంతరించుకుని, పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ వుంటుంది.
Tags: జ్యేష్ఠమాసము, Jyeshta Maas, Jyeshta Masam 2024, Jyeshta Masam Importance, Jyeshta Masam Telugu, Jyeshta Masam Visishta
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment