వారాహి నవరాత్రులు: వారాహి అమ్మవారి 9 రోజుల అలంకారాలు, నైవేద్యాలు పూజ విధానం - Varahi Navaratri Dates 2024

ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.

నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి.హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు,శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి,వాడిని సంహరించి,భూదేవిని రక్షిస్తాడు.స్వామివారి  మీద భక్తి తో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది.అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ.అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది, లేదా పరిష్కరిస్తుంది.

వారాహీ అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది...ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం...ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే,ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది.నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు.నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి, సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది.ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత.

ఆషాఢ నవరాత్రి ప్రతి రోజూ, సప్త మాత్రుక దేవతలను  మరియు అష్ట మాత్రుక దేవతలను  పూజించడం, ఎనిమిదో రోజు వరాహి దేవిని పూజించడం వల్ల సంపన్నమైన జీవితం లభిస్తుంది.

వారాహి అమ్మవారు పూజ సమయాలు

దుస్తులు సంప్రదాయ దుస్తులు

ఉదయం, 4:00 AM నుండి 6:30 AM వరకు  పూజా కార్యక్రమంలో అన్ని చేసుకోవాలి.  సూర్యోదయం ముందే ఈ అమ్మవారు పూజలు చేసుకోవాలి.

సాయంత్రం, 6:00 PM  నుండి 8:00 PM  వరకు అమ్మవారు పూజలు  ప్రసాదాలు అలంకరణలతో చేసుకోవాలి. వారాహి  అమ్మవారు  రాత్రి సమయాన పూజలు  ఎంతో దీపకరమని  చెప్పుకోవచ్చు.

వారాహి గుప్త నవరాత్రులు తారీకు మరియు సమయాలు

వారాహి అమ్మవారు నవరాత్రులు  పూజా మరియు తారీకు తేదీ నెల జూలై నెల రోజున  6 తేదీ శనివారం నుండి 15  తారీకు ఆదివారం వరకు  పూజలు  అఖండ దీపాలు  అమ్మవారిని అలంకరిస్తారు.

ఆషాఢ శుద్ధి పాడమి నుండి  ఆషాఢ శుద్ధి నవమి  రోజు వరకు అమ్మవారిని  పూజిస్తూ ఉండాలి.  ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు మరియు  వారాహి నవరాత్రులు కూడా  పిలువబడుతుంది.

ఆషాఢ గుప్తా నవరాత్రులు 2024  స్వస్థ శ్రీ చంద్రమాన  శ్రీ కోదరి నామ సంవత్సరం క్రోధి  నామ సంవత్సరం ఉత్తరాయణం  గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్లపక్షం జూలై 6 తేదీ  2024 శనివారం  నుండి ప్రారంభమై 15  జూలై  2024  సోమవారంతో ఈ నవరాత్రులు ముగింపు అవుతాయి.

వారాహి అమ్మవారు మొదటి రోజు మరియు 9వ రోజు వివరాలు

  • మొదటి రోజు, వారాహి అమ్మవారు మొదటి రోజు 6 జూలై 2024 శనివారం రోజున ఆషాఢ శుక్ల ప్రాడ్యమి రోజు అమ్మవారికి పూజలు జరుగుతాది. 5 జూలై  2024 శుక్రవారం నుండి తెల్లవారుజామున 3.57 AM నుండి 6 2024 శనివారం రాత్రి మరియు తెల్లవారుజామున 3.48 PM నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు,
  • నవరాత్రులు రోజు అమ్మవారికి కలశం మరో ఆ కొండ దీపం పెట్టుకొని పూజలు చేసేవారు. వారు 6 జూలై శనివారం రోజున శుభోదయం కి ముందే అఖండ దీపం పెట్టుకొని  అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన ఉంటుంది.
  • మొదటి రోజున అమ్మవారు పూజించేవారు శ్రీలిపుత్ర అవతారంలో పూజించాలి. అష్ట మాతగా పూజించేవారు  అమ్మవారిని  ఇంద్రాణిదేవుగా పూజించాలి.
  • మొదటి రోజు అమ్మవారికి నైవేద్యం, పాలతో చేసిన నైవేద్యం మరియు పొంగలి.
  • రెండో రోజు, 7 జూలై 2024 ఆదివారం రోజు ఆషాఢ శుక్ల  విదియ పూజ ప్రారంభం, 6 జూలై 2024 శనివారం  తెల్లవారుజామున 3:49 PM నిమిషాల నుండి ప్రారంభమై ఏడు జూలై  2024 ఆదివారం  తెల్లవారుజామున, 4:17 AM నిమిషాల వరకు శుక్ల విదియ ఉంటుంది.
  • రెండవ రోజు అమ్మవారి దుర్గ రూపంలో పూజించేవారు. బ్రహ్మచారిగా పూజించాలి. అష్ట మాతగా పూజించేవారు బ్రహ్మి దేవిగా  పూజించాలి.
  • రెండవ రోజు అమ్మవారికి నైవేద్యం, కట్టె పొంగలి మరియు పులిహారతో అమ్మవారిని నైవేద్యం  స్వీకరించాలి.
  • మూడవరోజు, 8 జూలై 2024  సోమవారం రోజు అనగా  ఆషాఢ శుక్ల తదియ తిధి పూజ ప్రారంభం, 7 జూలై  2024  ఆదివారం రాత్రి తెల్లవారుజామున, 4:18 AM నిమిషాలకు ప్రారంభమై 8 జూలై 2024 సోమవారం తెల్లవారుజామున , 5:09 AM వరకు తదియ తిధి ఉంటుంది. పూజ మీరు చేసుకోవచ్చు.
  • మూడేవా రోజు అమ్మవారి పూజించేవారు. దుర్గాదేవిగా పూజించేవారు చంద్రగంటగా దేవి పూజించాలి.  అష్ట అమ్మవారిగా పూజించేవారు వైష్ణవి దేవిగా పూజించాలి.
  • మూడోవ రోజు అమ్మవారికి నైవేద్యం, బెల్లంతో చేసిన పాయసం మరియు కొబ్బరి అన్నంతో అమ్మవారికి సమర్పించుకోవాలి.
  • నాలుగవ రోజు, 9 జూలై 2024 మంగళవారం రోజు ఈరోజు తిధి  ఆషాఢ శుక్ల చవితి తిధి  పూజ ప్రారంభం, 8 జూలై  2024 సోమవారం తెల్లవారుజామున, 5:10 AM  నిమిషాలకు ప్రారంభమై10 జూలై 2024 బుధవారం  ఉదయం, 6:38 AM నిమిషాల వరకు చవితి తిథి ఉంటుంది. పూజలు చేసుకోవచ్చు.
  • నాలుగవ రోజు అమ్మవారిని పూజించేవారు. దుర్గ దేవి అవతారం పూజించేవారు. కుష్మాండ దేవిగా పోషించాలి.  అష్ట  మాతలో అమ్మవారిని పూజించేవారు. మహేశ్వరి దేవిగా పూజించాలి.  
  • నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యం, దద్దోజనం మరియు  అల్లం గారెలు అమ్మవారికి సమర్పించుకోవాలి.
  • ఐదవ రోజు, 10, జూలై 2024 బుధవారం తిధి రోజు  ఆషాఢ శుక్ల పంచమి తిథి పూజ ప్రారంభం, 10, జూలై  2024 బుధవారం ఉదయం, 6:39 AM నిమిషాలకు పూజ ప్రారంభమై, 11 ,జులై  2024 గురువారం ఉదయం, 8:22 AM నిమిషాలు వరకు పంచమి తిధి ఉంటుంది. పూజలు చేసుకోవచ్చు.
  • ఐదవ రోజు అమ్మ వాళ్లు పూజించేవారు. నవ దుర్గ దేవిగా పూజించేవారు, స్కంద  మోతగా పూజించాలి. అష్ట మాత  కూలతో  పూజించేవారు  కౌమారి దేవిగా  పూజించాలి.
  • ఐదవరోజు అమ్మవారికి నైవేద్యం,పెసరపప్పుతో చేసిన అన్నం మరియు అన్నం మరియు దద్దోజనం అమ్మవారికి  సమర్పించుకోవాలి.
  • ఆరవ రోజు, 11, జులై, 2024 గురువారం తిధి రోజు  ఆషాఢ శుక్ల షష్టి తిధి రోజు, పూజ ప్రారంభం, 11, జులై, 2024 గురువారం ఉదయం, 8:23 AM నిమిషాలు ప్రారంభమై, 12, జులై  2024 శుక్రవారం ఉదయం, 10:17 AM నిమిషాల వరకు  షష్టి తిధి ఉంటుంది. పూజలు చేసుకోవాలి.
  • ఆరవ రోజు అమ్మవారు పూజించేవారు. నవదుర్గ రూపంలో పూజించేవారు. కాత్యాయని దేవిగా పూజించాలి.  అష్ట మాత  రూపంలో పూజించేవారు. చాముండి దేవిగా పూజించాలి.
  • అమ్మవారికి నైవేద్యం, పులిహోర అన్నం లేదా  కేసరి  స్వీట్ తో అమ్మవారికి సమర్పించుకోవాలి.
  • ఏడవ రోజు, 12, జులై, 2024 , శుక్రవారం రోజు ఆషాఢ శుక్ల సప్తమి తిధి  పూజ ప్రారంభం 12, జూలై, 2024 , శుక్రవారం ఉదయం, 10:18 AM నిమిషాల నుండి 13, జులై , 2024 శనివారం మధ్యాహ్నం, 12:18 PM నిమిషాల వరకు సప్తమి తిధి ఉంటుంది. అమ్మవారిని పూజించుకోవచ్చు.
  • ఏడవ రోజు అమ్మవారిని పూజించేవారు. నవ దుర్గ రూపంలో పూజించేవారు కాలరాత్రి అమ్మవారు పూజించాలి. అష్ట మాత గా పూజించేవారు. శాకంబరి దేవిగా పూజించాలి.
  • ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యం శాఖ అన్నం. మరియు కదంబం కూరగాయలతో పూజించి అమ్మవారికి నైవేద్య సమర్పించుకోవాలి.
  • 8వ రోజు, 13, జులై , 2024,  శనివారం తిధి రోజు  ఆషాఢ శుక్ల అష్టమి తిధి  పూజ ప్రారంభం, 13, జూలై, 2024,  శనివారం మధ్యాహ్నం, 12:19 PM నిమిషాలు ప్రారంభం  14, జులై , 2024, ఆదివారం రోజు మధ్యాహ్నం, 2:12 PM  నిమిషాల వరకు  అష్టమి తిధి ఉంటుంది. అమ్మవారిని పూజించుకోవాలి.
  • 8వ రోజు అమ్మవారిని నవదుర్గ  దీపిక పూజించేవారు. మహాగౌరదేవుగా పూజించాలి.అష్టమాతగా పూజించేవారు.  వారాహి దేవిగా పూజించాలి.
  • 8వ రోజు అమ్మవారికి నైవేద్యం. చక్కెర పొంగలి లేదా బెల్లం పాకంతో స్వీటుతో అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి.
  • 9వ రోజు, 14,జులై, 2024, శనివారం ఈరోజు తిధి ఆషాఢ శుక్ల నవమి తిధి  పూజ ప్రారంభం, 14, జులై, 2024 ఆదివారం మధ్యాహ్నం, 2:13 AM నిమిషాలకు ప్రారంభమై  15, జూలై, 2024, సోమవారం మధ్యాహ్నం, 3:52 PM  నిమిషాల వరకు నవమిత్తిది ఉంటుంది. అమ్మవారు పూజించుకోవాలి.
  • 9వ రోజు అమ్మవారు పూజించేవారు. నవ దుర్గ రూపంలో పూజించేవారు సిద్ధి  ధాత్రిగా పూజించాలి. అష్ట మాతగా పూజించేవారు లలిత దేవిగా పూజించాలి.
  • 9వ రోజు నైవేద్యం అమ్మవారికి పాయసంతో నైవేద్యం అమ్మవారికి సమర్పించుకోవాలి.తొమ్మిది రోజులు  పాటు  నైవేద్యం  చేయడం టైం లేదు మరియు కుదరదు అనుకునేవారు.అమ్మవారికి ఎంతో  ప్రీతంగా ఇష్టమైన  బెల్లంతో చేసిన పాలకాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి.

వారాహి అమ్మవారి ఉద్వాసన

తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు చేసుకునేవారు. వారాహి అమ్మవారి ఉద్వాసన

రాత్రి సమయంలో పూజ చేసేవారు, 14 జులై 2024 ఆదివారం రాత్రి సమయంలో పూజ చేసేవారు, అమ్మవారికి పూజా కార్యక్రమంలో చేసుకొని దీప దూప నైవేద్యాలు సమర్పించి. అమ్మవారు కలశాన్ని మరియు  పీఠాన్ని  మూడుసార్లు కదిలించాలి.

ఉదయం పూజ చేసుకునేవారు, 15 జులై 2024 సోమవారం ఉదయం పూజ చేసుకునేవారు. అమ్మవారికి పూజా కార్యక్రమం చేసుకొని దీప దూప నైవేద్యం సమర్పించి అమ్మవారి కలశాన్ని మరియు పీఠాన్ని మూడుసార్లు కదిలించాలి.

వారాహి అమ్మవారు  మంత్రం

వారాహి అమ్మవారు మంత్రం 9 సార్లు చదవాలి, రెండు నిమిషాలు పాటు మంత్రం జపించాలి.  

ఒకటే వ మంత్రం,

ఓం శ్రీమ్ వం శ్రీమ్ ఓం.!

రెండే వ మంత్రం,

ఓం హ్రీం వారాహి హరి ఓం.!

నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు 108 లేదా  తొమ్మిది సార్లు  ఈ మంత్రాలను చదవండి. చాలా శుభాలు కలుగుతాయి.

ఈ దేవికి నిత్య పూజాతో పాటు వారాహి అష్టోత్తరం, వారాహి షోడశ నామాలతో కుంకుమార్చన చేసుకోండి. వీలయినవరు వారాహి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామలు, సహస్రనామము.. మొదలగు వాటిని పారాయణ చేసుకోవచ్చు. తప్పకుండా వారాహి షోడశ నామా స్తోత్రం పఠిచండి.

Tags: వారాహి నవరాత్రులు, Varahi Navaratri, Varahi Navaratri 2024, Ashadha Varahi Navratri, Varahi Devi Navratri 2024, Jyeshtha Navratri 2024, 4 Navratri 2024 dates, Gupt Navratri 2024 in Telugu, Gupt Navratri Ashtami 2024 Date, Varahi special days, Devipuram Guruji death, Amritananda Natha Saraswati, Varahi Devi Pooja, Varahi Navaratrulu, Varahi Mantram Telugu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS