మొండి వ్యాధులను నయం చేసే 'యోగిని ఏకాదశి'! పూజా విధానం, వ్రత నియమాలు, ప్రాముఖ్యత తెలుసుకోండి | Yogini Ekadashi 2024

హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది 24 ఏకాదశిలు వస్తాయి. ప్రతి మాసంలో శుక్ల పక్షంలో, కృష్ణపక్షంలో కూడా ఏకాదశి తిథి వస్తుంది. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశిగా జరుపుకుంటాం. జులై 2వ తేదీ యోగిని ఏకాదశి సందర్భంగా ఈ రోజు ఎలాంటి నియమాలతో వ్రతాన్ని చేయడం వల్ల శుభ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

యోగిని ఏకాదశి పూజా విధానం

ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి. తర్వాత ఇంట్లోనూ పూజగదిని శుభ్రం చేయండి. ఒక పీట వేసి దాని మీద వస్త్రం పరిచి శ్రీ హరి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టించాలి. అనంతరం జలాభిషేకం చేయండి. పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామికి అభిషేకం చేసుకోవాలి.

దేవాలయంలో ఇలా

ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత సమీపంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్లి 11 ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి. ఈ రోజు పేదలకు అన్నదానం చేస్తే నారాయణుడు సంతృప్తి చెందుతాడని శాస్త్రవచనం.

సాయంత్రం పూజ

సాయంత్రం స్నానం చేసి ఇంట్లో దేవుని ముందు దీపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే ఎంతో ఫలప్రదం. ఉండగలిగిన వారు ఈ రోజు జాగారం చేస్తే కూడా పుణ్యం.

మంత్రం- ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం విష్ణవే నమః:

పరిహారం- యోగిని ఏకాదశి రోజున శ్రీ విష్ణు చాలీసా పఠించడం, అరటి చెట్టును పూజించడం ద్వారా వ్యక్తి అన్ని కోరికలు నెరవేరుతాయి.

యోగిని ఏకాదశి వ్రత కథ

పాండవ అగ్రజుడు ధర్మరాజు ఓసారి శ్రీకృషుని యోగిని ఏకాదశి కథ చెప్పమని అడిగాడట! అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు యోగిని ఏకాదశి కథను ఇలా చెప్పాడు.

అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది వుండేవాడు. ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్లి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికి ఇచ్చేవాడు. కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివున్ని పూజించేవాడు. ఒక రోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళుతాడు. సమయం గడుస్తున్నా అతను రాకపోవడంతో పూజకు ఆలస్యం అవుతోందని కుబేరుడు హేమమాలి ఎక్కడ వున్నాడో తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాడు. హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడు. అయితే ఆగ్రహంతో వున్న కుబేరుడు అతడు కుష్టువ్యాధితో బాధపడాలని శాపం పెడుతాడు. వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు. భయంకరమైన వ్యాధితో అడవుల్లో తిరుగతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించినందుకు ఎలా శాపానికి గురైంది వివరిస్తాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని వేడుకుంటాడు. దీంతో మహర్షి కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష వుండాలని సూచించాడు. హేమమాలి భక్తితో, శ్రద్ధగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంతో అతని శాపం తొలగి పూర్వరూపాన్ని పొందుతాడు. అందుకనే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం ద్వారా మనకు వున్న అనేక పాపాలను తొలగించుకోవచ్చని కృష్ణభగవాన్‌ ఉపదేశంలో పేర్కొంటాడు.

చేసుకున్నవారికి చేసుకున్నంత" అనే మాట ఆయా సందర్భాల్లో వినిపిస్తూ వుంటుంది. అంటే ఎవరు చేసుకున్న పాపపుణ్యాలను బట్టి వాళ్లు తగిన ఫలితాలను అనుభవిస్తారని చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది అనారోగ్యాల నుంచి బయటపడలేక పోతుంటారు. మరికొందరు అప్పుల నుంచి, అపజయాల నుంచి బయట పడలేక పోతుంటారు. తాము నీతి నియమాలతో కూడిన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, భగవంతుడు ఎందుకు ఇన్ని విధాలుగా బాధలు పెడుతున్నాడని వాళ్లు అనుకుంటూ వుంటారు.

వాళ్లందరూ కూడా ప్రస్తుతం తాము ఎదుర్కుంటోన్న పరిస్థితులు, గత జన్మలలో చేసిన పాపాలకు ఫలితాలుగా భావించవలసి వుంటుంది. ఆ జన్మలలో చేసిన పాపాలు అందువలన బాధకి గురైన వాళ్లు పెట్టిన శాపాల కారణంగానే తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రహించాలి. మరి జన్మ, జన్మలుగా వెంటాడుతోన్న ఈ పాపాల బారి నుంచి బయటపడే మార్గమే లేదా? అని చాలామంది ఆవేదనకి లోనవుతుంటారు. అలాంటి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా "యోగిని ఏకాదశి" చెప్పబడుతోంది. "జ్యేష్ఠ బహుళ ఏకాదశి" ని యోగిని ఏకాదశిగా చెబుతుంటారు. ఈ రోజున శ్రీమన్నారాయణుడిని పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సమస్త పాపాలు శాపాలు నశించి పుణ్యఫలాలు కలుగుతాయని అంటారు.

యోగిని ఏకాదశి రోజు చేయకూడని పనులు 

నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. వాటికి బదులుగా పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభదాయకం. తులసి సమర్పించకుండా విష్ణు పూజ పూర్తి కాదు. అందుకే యోగిని ఏకాదశి రోజు తులసి తప్పనిసరిగా సమర్పిస్తారు. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులు తెంప కూడదు. అలాగే అన్నం తినకూడదు. ఇలా చేస్తే అపరాధ భావం కలుగుతుందని నమ్ముతారు.

పెద్దవారికి ఎవరిని నొప్పించకూడదు. ఎవరినీ కించపరచొద్దు. యోగిని ఏకాదశి రోజు ఆల్కహాల్ సేవించరాదు. తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి.

Tags: యోగిని ఏకాదశి, Yogini Ekadashi, Yogini Ekadashi 2024, Yogini ekadashi 2024 importance, Yogini ekadashi 2024 telugu, Yogini Ekadashi Vrat Katha, Yogini ekadashi 2024 time, Yogini ekadashi 2024 english, Yogini Ekadashi story, Yogini Ekadashi timings, Yogini Ekadashi

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS