తిరుమల వెళ్లేవారికి అలెర్ట్ ...ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు - NO VIP BREAK ON JULY 9 AND 16

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. జులై నెలకు సంబంధించి రెండు రోజులు టీటీడీ బ్రేక్ దర్శనాలను రద్దుచేసింది.

జూలై 9 మరియు 16వ తేదీలలో శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు.

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని జూలై 9వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 9 మరియు 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కారణంగా జూలై 8 మరియు 15వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబడవు.

మరోవైపు ఏడాదిలో నాలుగుసార్లు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది పండుగ, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆణివార ఆస్థానం వస్తున్న నేపథ్యంలోనే జులై ఆరున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. ఇక శ్రీవారి ఆలయంలో ఉదయం ఆరింటికి ప్రారంభమయ్యే తిరుమంజనం.. మధ్యాహ్నం వరకూ అంటే దాదాపుగా ఐదు గంటలు జరుగుతుంది. తిరుమంజనం తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు అర్చకులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి మాత్రమే భక్తులు దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలోనే బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది.

Tags: TTD, Tirumala News, VIP Break Darshnam, Tirumala Tickets, Tirumala VIP Darshan

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS