పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి దర్శించారో మీ జన్మ ధన్యం - What is the story behind Puri Jagannath Temple?

పూరీ జగన్నాథ ఆలయం ఒక్కసారి దర్శించారో మీ జన్మ ధన్యం

పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్ధయాత్రను పూరీను సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధా , దుర్గ , లక్ష్మి , పార్వతి , సతి , మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.

మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ్ ఆలయం.

ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలోని ఈ పూరీజగన్నాథ్ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది. ప్రపంచ ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని 1078 సంలో పూరీలో నిర్మించారు.

ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే గోడలు , స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీస్కోస్తాయి. అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం , దేవతలు , గంటలు , ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత వుంది ఇక్కడ. ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికున్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడా వుండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గోపురం

ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు గానీ ఈ పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు. ఇది దేవుడి కోరిక అంటారు కొందరు. ఆలయ గొప్పదనమని మరికొందరు అంటారు.

రెపరెపలాడే జెండా

ఈ ఆలయగోపురానికి పైనకట్టిన జెండాకి ఒక ప్రత్యేకతవుంది. అన్ని జెండాలలో గాలి ఎటువైపు వస్తే అటు వైపు ఎగురుతుంటాయి.కానీ ఇక్కడ గాలికి వ్యతిరేకదిశలో రెపరెపలాడుతుంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. ఒక వేళ మార్చడం మరిచిపోతే ఆలయాన్ని దాదాపు 18సంలు మూసివేయాలని భావిస్తారు.

పూరీ జగన్నాధుడి రధయాత్ర

ఈ ఆలయ ప్రత్యేకతలో రధయాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈ రధయాత్రలో కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. రధయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు వూడ్చి తాళ్ళను లాగటంతో రధయాత్ర ప్రారంభమౌతుంది.

పూరీ వీధుల్లో శ్రీకృష్ణ , బలరాముల విగ్రహాలను వూరేగిస్తారు. రధం సుమారు 45 అడుగుల ఎత్తు , 35 అడుగులు వెడల్పు వుంటుంది. ఈ రధానికి సుమారు 16 చక్రాలుంటాయి. పూరీ జగన్నాధ రెండు రధాలు లాగుతారు.

మొదటి రధం దేవుళ్ళను రధం వరకు తీసుకెళుతుంది. ఆ తరవాత 3 చెక్క పడవళ్ళలో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రధం దేవుళ్ళను గుండీచ ఆలయానికి తీసుకెళుతుంది.

రధయాత్రలోని విశిష్టత

ప్రతీ ఏడాది జరిగే ఈ రధయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచ ఆలయానికి వూరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక విశిష్టత. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయతలుపులు మూసేస్తారు.

సుదర్శన చక్రం

పూరీలో అత్యంత ప్రసిద్ధిచెందిన జగన్నాధ ఆలయం చాలా ఎత్తైనదిమీరు పూరీలో ఎక్కడ నిలబడినా గోపురం వైపు ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టుమిమ్మల్ని చూస్తున్నట్టు కనిపించటం ఇక్కడి ప్రత్యేకత.

సముద్రపు అలలు

సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకి వుంటుంది. సాయంత్రపు పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం.

దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. పూరీ జగన్నాధ ఆలయం పైన పక్షులుగానీ , విమానాలు గానీ అస్సలు వుండవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు.

సాధారణంగా మనం సముద్రతీరాన ఆలయానికి వెళ్ళినప్పుడు మనం బయటవున్నంతసేపు సముద్రపు అలలు , వాటి శాభ్దాలు మనకు వినిపిస్తాయి. లోపలికి వెళ్ళినాకూడా ఆ శాభ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి.

కానీ ఈ పూరీ జగన్నాధ ఆలయంలో అలా వుండదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది.

అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. దీనికి కారణం కూడా వుంది. ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రా దేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరటం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు.

అంతేకానీ దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు కూడా. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారుచేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు , సుభద్ర , బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు.

రథయాత్ర

ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో రథయాత్ర లేదా రథం ఫెస్టివల్ సమయంలో సందర్శిస్తారు. పండుగ సమయంలో దేవతలైన జగన్నాథ్ , బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను బాగా అలంకరించిన రథాల్లో ఉంచి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు.

ఈ ఉత్సవము సాధారణంగా జూలై నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవము పూరీ పర్యాటక క్యాలెండర్ లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు.

ప్రత్యేకత

ఇక్కడ దేవునికి సమర్పించే ప్రసాదం. పూరీ జగన్నాధ ఆలయంలో 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టికుండలో మాత్రమే తయారు చేస్తారు. ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి , వాసన వుండదు.

ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే ఘుమఘుమలతో పాటు రుచి కూడా వుంటుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక సంవత్సరం వరకు పాడవకుండా వుంటుందట. ఈ ప్రసాదాన్ని దాదాపు 2000మంది దగ్గర నుంచి 2 లక్షల వరకు భక్తులకు ఇవ్వొచ్చు.

ఇంకా దేవుడికి పెట్టె నైవేద్యం 7 మట్టి కుండలలో ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు. సాధారణంగా మంట పైన వున్న కుండలోని ఆహారం మొదటగా వుడుకుతుంది. కానీ ఇక్కడ ఏడవకుండలోని ఆహారం వుడికిన తర్వాత చివరగా వున్న కుండలోని ఆహారం వుడుకుతుంది. అదే ఇక్కడి ప్రసాదం , నైవేద్యం యొక్క ప్రత్యేకత. ఇన్ని విశేషాలు , అద్భుతాలు కలిగిన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని ప్రతీ ఏడాది లక్షలమంది భక్తులు సందర్శిస్తారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని చూసి తరించండి. తప్పకుండా పూరీ జగన్నాధఆలయాన్ని దర్శించండి.

పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు

పర్యాటకులకు పురీలో సందర్శించటానికి అనేక ఆలయాలు ఉన్నాయి. హిందువులకు పూరీ భారతదేశంలో ఉన్న ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ ఆలయమే కాక చక్ర తీర్థా ఆలయం , ముసిమ ఆలయం , సునర గౌరంగ్ ఆలయం , శ్రీ లోక్నాథ్ ఆలయం , శ్రీ గుండిచ ఆలయం , అలర్నాథ్ ఆలయం మరియు బలిహర్ చండి ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలుఉన్నాయి.

మరోక ప్రత్యేకతగోవర్ధన మఠం వంటి మఠాలు దైవిక ఉపశమనం అందిస్తున్నాయి. బేడి హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన స్థానిక పురాణము కలిగి ఉంది. పూరీ బీచ్ మరొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది.

వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పూరీ పర్యాటకంలో ఆకర్షణగా ఉంటుంది. ఈ బీచ్ ను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక ఈ బీచ్ సుందరమైన వీక్షణ నిజంగా మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది.

ఉదయిస్తున్న సూర్యుడి చూడటం లేదా అస్తమిస్తున్న సూర్యుడి చూడటంతో తీర్థయాత్ర ముగుస్తుంది అనుకుంటున్నారా ? కానేకాదు పర్యాటకులు బలిఘి బీచ్ వద్ద కోణార్క్ సముద్ర డ్రైవ్ చేయవచ్చు. పూరీ మతసంబంధ ఆసక్తికరమైన మరొక ప్రదేశం హిందూ మత శ్మశానం స్వర్గాద్వర్ ఉంది.

పూరీ నుండి 14 కిమీ దూరంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని రఘురజ్పూర్ ఉన్నది. ఒరిస్సాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన షాఖిగోపాల్ పూరీ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

నీటి ప్రేమికులు లేదా సర్ఫింగ్ ఆస్వాదించే వారికి మరొక అద్భుతమైన ఆకర్షణ కేవలం పూరీ నుండి 50 కిమీ దూరంలో సాత్పదా వద్ద ఉంది. పూరీ నుండి సాత్పదా చేరుకోవటానికి అనేక బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

పూరీ సందర్శించడానికి ఉత్తమ సమయం

ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి వరకు ఉంటుంది.

Tags:  Puri Jagannath Temple, Puri Jagannath temple idols story, Jagannath Temple Puri photos, Puri Jagannath Temple timings, Puri Jagannath Temple distance, Puri Jagannath Temple height in feet, Puri Jagannath temple built by, Puri Temple, Puri Jagannath Temple History Telugu, Jagannath Temple Telugu, Odisha, Puri Temples

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS