హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, అష్టమి రోహిణి, గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. విష్ణు మూర్తి.. పది అవతారాల్లో 8వ అవతారంగా ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా జన్మించాడని పురాణోక్తి. ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో గోపాలుడి జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది? శుభ ముహూర్తం ఎప్పుడు? అనే విషయంలో చాలా మందికి స్పష్టత లేదు. మరి, దానికి కారణం ఏంటి? అసలు జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి? ఈ రోజు తెలుసుకుందాం..
జన్మాష్టమి ఎప్పుడు?
వేద పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి ఈ నెల 26వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:39 గంటలకు ప్రారంభమావుతుంది. మర్నాడు అంటే ఆగస్టు 27వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 2:19 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు 26 సోమవారం మధ్యాహ్నం 03:55 గంటలకు మొదలవుతుంది. ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 03:38 గంటలకు రోహిణి నక్షత్రం ముగుస్తుంది. కనుక ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26న జరుపుకోవాలా, ఆగస్టు 27న జరుపుకోవాలా అన్న సందేశం చాలా మందిలో ఉంది. ఈ సందేశాలకు సమాధానం పండితులు చెప్పారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమిగా రెండు రకాలుగా జరుపుకుంటారని.. అందులో కొందరు ఈ పర్వదినాన్ని రెండు రోజుల పాటు జరుపుకుంటారని చెబుతున్నారు.
స్మార్త కృష్ణాష్టమిలో ఎప్పుడు పూజ చేయాలంటే
శివ కేశవులను పూజించే వారిని స్మార్తులంటారు. అంతేకాదు ఆది శంకరాచార్యులను ఆరాధించే వారిని కూడా స్మార్తులు అని అంటారు. వీరు కృష్ణాష్టమి పండగను ఆగస్టు 26వ తేదీ సోమవారం జరుపుకోవాలని చెబుతున్నారు. ఎదుకంటే వీరికి జన్మాష్టమి జరుపుకోవడానికి సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉండాలన్న నియమం లేదు. ఆ రోజులో ఎపుడు రోహిణి నక్షత్రం ఉన్నా చాలు ఈ వేడుకను జరుపుకోవడానికి..
వైష్ణవ కృష్ణాష్టమి జరుపుకునే సంప్రదాయం ఏమిటంటే..
కేవలం వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారు ఆగస్టు 27 మంగళవారం నాడు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. ఎందుకంటే వీరికి కన్నయ్యను పూజించడానికి అష్టమి తిధి సూర్యోదయ సమయానికి రోహిణీ నక్షత్రం ఉండాలి. అందుకనే విష్ణువుని మాత్రమే పూజించే వైష్ణవులు కృష్ణాష్టమిని ఆగష్టు 27వ తేదీ మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారు.
రెండురోజులు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునే వారు
ఆగస్టు 26న కృష్ణాష్టమిని జరుపుకోవాలి. ఈ రోజు కన్నయ్య భక్తులు ఉపవాసం ఉండి.. బాల కృష్ణుడిని అందంగా అలంకరించి సాయంత్రం పూజ చేయాలి. రకరకాల పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, అటుకులతో పాటు రకరకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కనుక ఆగస్టు 26వ తేదీన అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాల మధ్యలో కృష్ణుడికి పూజ నిర్వహించాలి. ఇక ఆగస్టు 27న ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. వీధుల్లో ఉట్లు కట్టి దానిని కొట్టడానికి పోటీపడతారు. అందుకే క్రిష్ణష్టమిని ఉట్ల పండగ అని కూడా అంటారు. ఇక దేశవ్యాప్తంగానే కాదు విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు.. ఉత్తరప్రదేశ్ లోని మధుర-బృందావనంలో మాత్రం వెరీ వెరీ స్పెషల్. కృష్ణుడు జన్మించిన ప్రాంతం మధుర అయితే.. బాల్యాన్ని ఎక్కువుగా గడిపిన ప్రాంతం బృందావనం అని హిందువుల నమ్మకం.
ఉపవాస దీక్షలు.. కృష్ణాష్టమి నాడు భక్తులు వారి ఇళ్లను అలంకరిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి, సాయం కాలం శ్రీ కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, రుచికరమైన వంటకాలు తయారు చేసి స్వామికి నైవేద్యం పెడతారు. శ్రీకృష్ణుని విగ్రహాన్ని అలంకరించి.. ఊయలలు కట్టి అందులో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ లేదా ‘ఉట్ల తిరునాళ్లు' అని పిలుస్తారు. అయితే.. కృష్ణాష్టమి వేడుకలు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర-బృందావనంలో జరుగుతాయి. ఇక్కడ కృష్ణుడు జన్మించాడని, అతని బాల్యాన్ని ఎక్కువుగా ఇక్కడే గడిపాడని ప్రసిద్ధి.
Tags: Krishnashtami, కృష్ణాష్టమి, Krishnashtami fasting rules, Krishna Janmashtami, Krishnashtami 2024 start date, Krishnashtami 2024 date and time, Krishnashtami 2024, Krishnashtami Telugu