సముద్ర స్నానాలు ఎందుకు చేస్తారో తెలుసా...??
శరీరం మీద ఉండే స్వేద గ్రంథులు రోమాల వల్ల మూసుకొని ఉంటాయి. ప్రతి నిత్యం మనం శరీరాన్ని ఆ స్వేద గ్రంథులు పూర్తిగా తెరుచుకోబడవు.
అకారణంగా ప్రాచీనులు వైద్య పరమైన ఒక నిర్ణయాన్ని చేస్తూ.ప్రతీ వ్యక్తీ ఏడాదిలో నాలుగు సార్లు సముద్ర స్నానం చేయాలనే ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు.
అందుకే ఆషాఢ మాసం, కార్తిక మాసం, మాఘమాసం, వైశాఖ మాసం పూర్ణిమల్లో సముద్రం స్నానం చేయడం ఆచారంగా వస్తోంది.
అయితే ఇలా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న అనవసరం పదార్థం స్వేద రూపంగా బయటకి విసర్జింపబడుతుంది.
కాబట్టి సముద్ర స్నానం అనేది ఆథ్యాత్మికంగానే కాకుండా వైద్య పరంగా కూజా ఏర్పాటు చేయబడింది.
ఆషాడ , కార్తిక, మాఘ, వైశాఖ నాలుగు మాసాల్లో వచ్చే పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలని శాస్త్రం చెబుతున్న మాట.
ఈ నాల్గింటిని వ్యాస పూర్ణిమ ఉత్సవాలుగా అందుకే చెప్పారు. సముద్ర స్నానం అంటే పూర్తిగా శరీరాన్ని శిరోజాలతో సహా సముద్రంలో ముంచి స్నానం చేయడం అన్నమాట.
అలా చేస్తే శరీరంలోని రోమకూపాలు తెరుచుకొని శరీరంలో అనవసరంగా ఉండే స్వేదం మైదలైన వ్యర్థ పదార్థాలు బయటకి నెట్టబడతాయి.
అదీగాక శరీరానికి తగినంత ఉప్పదనం పట్టే కారణంగా చర్మ వ్యాధులు దరిచేరవు. ఏ హీనీ కల్గించే రోగ క్రిములు శరీరానికి బాహిరభాగంలో ఉన్నాయో అవన్నీ ఈ సముద్ర జలంలోని ఉప్పదనం కారణంగా పూర్తిగా మరణించి శరీరానికి సౌఖ్యాన్ని చేకూరుస్తాయి..
సముద్రస్నానం పుణ్యం..
మనదేశంలోని పవిత్రగంగా నది సహా అన్ని పుణ్య నదులూ సముద్రంలోనే కలుస్తాయి.
గంగానది బంగాళాఖాతంలో కలుస్తుంది. అందువలన అది తప్పితే మిగతా సముద్రాలలో స్నానం చేస్తే పుణ్యం దక్కదు అని అనుకోనక్కరలేదు.
ఈ ప్రపంచంలో ని సముద్రాలన్ని ఎక్కడో ఒకచోట ఒకదానితో ఒకటి కలసివుండేవే.
అరేబియా సముద్రం హిందూమహాసముద్రం, బంగాళాఖాతం మాత్రమే కాకుండా పస్ఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మొదలైన సముద్రాలు ప్రపంచంలో యేదో ఒక చోట కలుస్తూనే వున్నాయి.
అలాగే నదులన్నీ కూడా ఆ ప్రాంతాన వున్న సముద్రాలలో కలుస్తున్నాయి. అందువలననే సముద్రస్నానం ఉత్తమమైన పుణ్యఫలాలు యిస్తుందని, విశిష్టత కలిగినదని చెప్తారు.
సముద్రస్నానం వలన గంగలో స్నానం చేసినందువలన కలిగే పుణ్యం తప్పక లభిస్తుంది..స్వస్తీ..
Tags: సముద్ర స్నానాలు, Samudra Stanam, Nadi Stanam, Sea Bath, Pushkaralu, Samudram, Magha Masam,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment