వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి సెప్టెంబర్ 6 లేక 7 ? విగ్రహ ప్రతిష్ట ముహూర్త సమయం ఇదే | Ganesh Chaturthi 2024
వినాయక చవితి వచ్చేసింది. ఈ పండగ సెప్టెంబర్ 6నా లేదా 7వ తేదీనా అనే సందేహం ఉంది. ఈ విషయంలో స్పష్టతతో పాటూ, పండగ ముహూర్తం సమయం కూడా తెల్సుకోండి.
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇది జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదించే గణేశుడి జన్మదిన వేడుక. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబరులో గణేశ్ చతుర్థి జరుపుకుంటారు. ఈ పవిత్ర పండుగ సరైన తేదీ, విగ్రహం స్థాపన చేయడానికి శుభ ముహూర్తం వివరాలు తెలుసుకోండి.
వినాయక చవితి తేదీ , పూజ శుభ సమయం:
వైదిక క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి శుక్రవారం సెప్టెంబర్ 6, 2024న ప్రారంభమై మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 7, శనివారం సాయంత్రం 5.37 గంటలకు ముగుస్తుంది. దీంతో కొందరు ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీన విగ్రహ ప్రతిష్ట జరుపుకోవాలని, మరికొందరు 8వ తేదీ జరుపుకోవాలని చెబుతుండటంతో మరోసారి సందిగ్ధత నెలకొంది. అయితే ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజున వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమైన సమయం:
ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ 7న గణేష్ చతుర్థి జరుపుకోవాలి. దీంతో పాటు ఉదయం 11.04 గంటల నుంచి మధ్యాహ్నం 1.34 గంటల వరకు విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి భక్తులకు మొత్తం 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.
నిమజ్జనం తేదీ:
గణేష్ ఉత్సవం సెప్టెంబర్ 7వ తేదీ శనివారం ప్రారంభమవుతుంది. ఈసారి గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం అనంత చతుర్దశి రోజున ముగుస్తాయి. గణేశుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి 10 రోజుల పాటు పూజించే వారు అనంత చతుర్దశి నాడు వినాయకుని నిమజ్జనం చేస్తారు.
చంద్రుడు:
పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:01 గంటల నుండి రాత్రి 8:16 గంటల వరకు, సెప్టెంబర్ 7 న ఉదయం 9:30 నుండి రాత్రి 8:45 గంటల వరకు చంద్రుడిని చూడకూడదు. వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూడకూడదని చెబుతారు.
పండుగ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి స్థాపన చేసి, స్వామిని ప్రార్థించి, పూజాది కార్యక్రమాలు నిర్వహించి, భోగం సమర్పించి, ఉపవాసం ఆచరిస్తారు. ఆచారాల ప్రకారం, ప్రజలు గణపతిని ఒకటిన్నర రోజులు, మూడు రోజులు, ఏడు రోజులు లేదా పది రోజులు తమ ఇళ్లలో ఉంచుతారు. గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది. ఈ రోజున భక్తులు వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. వచ్చే సంవత్సరం తొందరగా వచ్చేయ్ అంటూ ప్రార్థిస్తూ ఈ వేడుకలు ముగుస్తాయి.
Tags: Vinakaya chavithi 2024, Ganesh Chaturthi date 2024, Ganesh Chaturthi 2024 start and end date, ganesh puja 2024: date and time, Ganesh Chaturthi 2024 Date Maharashtra, Vinayaka Stotram, Ganapahti, Vinayaka Chavithi Pooja
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment