అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ - What is the powerful name of Vishnu?

అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ

సాధు పరిత్రాణం కొరకు,దుష్టవినాశనం కొరకు, ధర్మసంస్థాపన కొరకు పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తు ఉంటానని చెప్పాడు. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమఉంది. అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.

దైవస్మృతి 

సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః అని ఆచమించి ఆరంభిస్తాం.

క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేద వైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.

అచ్యుతానంత గోవింద

నామెాచ్ఛారణ భేషజాత్

నశ్యంతి సకలారోగాః

సత్యం సత్యం వదామ్యహ

ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి. ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను". ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట. వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే ఇంకొక ప్రమాణం అవసరమా" !.ఇది పరమ ప్రమాణం. పద్మపురాణంలో ఈ నామ

మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది. దైవస్మృతి

పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారాయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు. పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంక రమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.ఆ హాలాహలం చుాసి దేవతలు ,దానవులు భయపడి తలో దిక్కుకి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను. అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించసాగారు. అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని -- అచ్యుత, అనంత, గోవింద అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను. ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.

కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు

ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని, విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !

Tags: Vishnu, Lord Vishnu, Achuta, Ananta, Govinda, Vishnu Namalu, Govinda Namalu, Vishnu Stotram

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS