భగవద్గీత ప్రారంభం భగవద్గీత లో మొదటి శ్లోకాలు నేర్చుకుందాం | Bhagavad Gita 1st Slokam with Meaning

భగవద్గీత

అథ ప్రథమోऽధ్యాయః - అర్జునవిషాదయోగః
ధృతరాష్ట్ర ఉవాచ |
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1||

భావం

: ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి?

భాష్యం :

మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం.

keywords : bhagavad gita, bhagavad gita 1st chapter, bhagavad gita slokas with meaning,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS