తిరుపతి అనగానే అందరికీ 7 కొండల శ్రీ వేంకటేశ్వర స్వామి మాత్రమే గుర్తుకు వస్తారు. అందరం ఎంతో ఆనందంతో వెళ్ళి స్వామి ని 2 సెకండ్స్ చూసిన జన్మ ధన్యం. కానీ రెండు రోజులు ఇక్కడ ఎక్కువ గడిపి ముందుగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళితే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా వరకు మనం కూడా దర్శించవచ్చు.
ఇప్పటి వరకు మీకు ఈ సమాచారం మీరూ ఎక్కడ చూడనట్టు వంటి సమాచారం ఈ సమాచారం. ఇందులో తిరుపతి నుంచి కేవలం కార్ లేదా ద్వి చక్ర వాహనం మీద మొదట కేవలం 40కి.మీ దూరంలో ఉన్న మూలకోన వాటర్ ఫాల్ కి చేరుకోవాలి. మొదటి ఫోటో లో ఈ ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడ ఆలయం గుండం మొత్తం నీరు మరియు మధ్యలో చిన్న ఆలయం ఉంటుంది. తరువాత మరియు యొక్క ఆలయం గుండం పక్కనే ఉంటుంది. ఇరు చాలా స్వచ్చంగా ఉంటుంది. మన మహానందిలోని గుండం వలె.
తరువాత ఇక్కడి నుంచి 20 కి. మీ దూరంలో గల సింగిరి కోన వాటర్ ఫాల్ ని చేరుకోవాలి. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ నరసింహ స్వామి. ఇక్కడ కూడా చక్కగా నీటిలో బాగా అడుకోవచ్చు. ప్రయాణ అలసట తిరుపోయే వరకు బాగా నీటిలో బాగా ఆడుకొని స్వామి ని దర్శించుకున్న తరువాత ఇక్కడి నుంచి తీరిగీ మీ ప్రయాణన్ని ప్రారంభించి 15కి. మీ దూరంలో గల కైలాసకోన వాటర్ ఫాల్ కి చేరుకోవాలి. ఇక్కడ చాలా ఎత్తు నుంచి జాలువర్తున్న నీటి జలపాతాన్ని చూసి ఇక్కడే ఒక గుహలో వెలిసి ఉన్న శివయ్య స్వామి దర్శనం చేఊకొని తీరిగీ తిరుపతి కి చేరుకోవాలి. మార్గం మధ్యలో ఎక్కువ షాప్ లు ఉండవు కావున ఆహారం , నీరు , ఎక్సట్రా బట్టలు తీసుకొని వెళ్ళడం మంచిది.
నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. బండి దిగి కొద్ది దూరం నడవవలసి ఉంటుంది. తొందరగా బయలుదేరితే తీరిగీ తొందరగా ఇంటికి చేరుకోవచ్చు. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కావడం వల్ల ఫోన్ సింగ్నల్ సౌకర్యం కూడా సరిగ్గా ఉండదు.