Tirumala FEBRUARY DARSHAN ONLINE QUOTA Release Dates తిరుమ‌ల ఫిబ్రవరి దర్శనాల, గదుల కోటా విడుదల వివరాలు

tirumala tickets release dates

2026 ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

18న ఎలక్ట్రానిక్ డిప్

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన ఫిబ్రవరి నెల కోటాను నవంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

21న 3pm వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

24న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

24న శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

విరాళాలు ఇచ్చిన దాతల కోటా

లక్ష రూపాయలు పైన విరాళాలు ఇచ్చిన దాతలకు Trusts / Schemes Donors కు ఫిబ్రవరి నెల టికెట్స్ ను నవంబర్ 26 ఉదయం 11:30 కు విడుదల చేస్తున్నారు. 

డిసెంబర్ నెలకు దివ్య అనుగ్రహ హోమం టికెట్స్ :

తిరుపతి అలిపిరి వద్ద నిర్వహిస్తున్న హోమం టికెట్స్ డిసెంబర్ నెలకు గాను నవంబర్ 26న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారు. తిరుమల దర్శనం కూడా ఉంటుంది. 

తిరుపతి పద్మావతి అమ్మవారి టికెట్స్ : 

పద్మావతి అమ్మవారి స్పెషల్ దర్శనం  టికెట్స్ ( టికెట్ ధర 200)  డిసెంబర్  నెలకు గాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. 

లోకల్ ఆలయాల సేవ టికెట్స్ :

పద్మావతి అమ్మవారి ఆలయం కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర ఆలయాల సేవ టికెట్స్  డిసెంబర్ నెలకు గాను నవంబర్ 26న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు.

తిరుమల సేవలు రూమ్స్ తో సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.  

keywords : tirumala updates, tirumala darshan tickets release dates, tirumala december month tickets, tirumala february month tickets release dates.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS