తిరుమ‌ల నవంబర్ టికెట్స్ విడుదల ఈ టికెట్ తో రెండు సార్లు దర్శనం | Tirumala November 2026 Tickets Released TTD

TIRUMALA NOV 2026 TICKETS RELEASED

నవంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పుషయాగం టికెట్స్ : 

నవంబర్ 16వ తేదిన పుష్పయాగం జరగనుంది వీటికి సంబంధించిన టికెట్స్ ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. పుష్పాయాగం కు మొత్తం 1000 టికెట్స్ విడుదల చేస్తున్నారు ఒక్కో టికెట్ ధర 700 రూపాయలు. పుష్పయాగం టికెట్స్ ఒక id పై రెండు టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్ బుక్ చేసుకున్నవారికి 2 సార్లు దర్శనం కల్పిస్తారు. 

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది.

వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

24న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదల

అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

శ్రీవాణి దర్శన కోటా విడుదల

శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

26న హోమం టికెట్స్ విడుదల : 

శ్రీ శ్రీనివాస దివ్యాహానుగ్ర హోమం టికెట్స్ సెప్టెంబర్ నెలకు ఆగస్టు 26న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు . ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వారికీ తిరుమల దర్శనం కూడా ఉంటుంది. 

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ నెంబర్ 7382679767

keywords : tirumala tickets updates, tirumala november month quota , hindu temples guide, tirumala latest information. 

Post a Comment

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS