Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

పంచారామ క్షేత్రాలు - List Of Pancharama Kshetras

Pancharama Kshetras Temples Information
సుబ్రహ్మణ్యుడు తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశాలలో పడినవి ఆ క్షేత్రములే పంచారామ క్షేత్రాలు. అవి ద్రాక్షారామము , కుమారారామము , క్షేరారామము, భీమారామము మరియు అమరారామము. 

Pancharamas are Located in Andhrapradesh. 
మీరు ఈ క్రింది లింక్ లపై క్లిక్ చెయ్యడం ద్వార ఆ దేవాలయాల స్థలపురాణం , చేరుకునే విధానం తెల్సుకోగలరు
http://www.hindutemplesguide.com/2015/08/draksharamam-temple-guide.html

పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి . ఇక్కడ స్వామి వారు భీమేశ్వరుడు . త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం పేరుపొందినది. ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీగా పిలుస్తారు. ద్రాక్షారామ క్షేత్రం కాకినాడకు 32 కి. మీ దూరంలోను ,రాజమండ్రి  60 కి. మీ దూరంలోను ఉంది. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబదేవి . అష్టాదశ శక్తిపీఠాల్లో 12 వది. దక్షుడు పరిపాలించిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రని ద్రాక్షారామం అని అంటారు.  
From Kakinada to Draksharamam 32 km ,  Rajahmundry to Draksharamam  60 km. Buses are available form kakinada & Rajahmundry. 

http://www.hindutemplesguide.com/2015/09/sri-kumararama-bhimeswara-temple.html
పంచారామ క్షేత్రాలలో ఒకటైనది  శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి  దేవస్థానం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో సామర్లకోట లో ఉంది. ఇక్కడ శివలింగం 14 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ క్షేత్రం క్రీ,శ  892 లో చాళుక్య రాజయిన భీముడు నిర్మించారు. ఇక్కడ శివలింగం తెల్లని రంగులో ఉంటుంది. 

From Kakinada to Samarlakota 15 km
పంచారామ ఆలయాల్లో శివలింగాలు అన్నీ పొడవుగానే వుంటాయి.  సామర్లకోటలో అయితే ఇంకా పొడవు అంటే రెండతస్తుల వరకూ శివలింగం వ్యాపించి వుంటాయి, భక్తులు స్వామి పాదాలు కింది అంతస్తులో దర్శించుకుని పై అంతస్తులో స్వామిని పూజిస్తారు పావపటం కిందనే వుంటుంది పై అంతస్తులో అభిషేకం చేసిన జలాలు పానపట్టం మీదుగా జారుతాయి


3. Ksheraramam ( Palakollu - West Godavari )


http://www.hindutemplesguide.com/2015/09/sri-ksheera-ramalingeswara-swamy-temple.html
ఆంధ్రప్రదేశ్ లో పంచారామలుగా చెందిన  5 పుణ్య క్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. క్షీరారామలింగేశ్వరస్వామి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు లో ఉంది. ఈ ఆలయాన్ని క్రీ .శ.  10,11 శతాబ్దాల కాలంలో చాళుక్యులు నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది.  
http://www.hindutemplesguide.com/2015/09/somarama-temple-bhimavaram-inforamation.html

http://www.hindutemplesguide.com/2015/08/amaralingeswara-swamy-temple-infomation.html
అమరావతిలో ఉన్న అమరలింగేశ్వరుడు లింగం 15 అడుగుల ఎత్తులో ఉంటుంది . ఈ క్షేత్రం గుంటూరు జిల్లాలోని  కృష్ణ నది ఒడ్డున ఉంది. 

కార్తీక మాసం లో R.T.C వారు పంచారామ క్షేత్రాలను చూసి రావడానికి ప్రత్యేక బస్సు లను నడుపుతారు. ఒక్కరోజులోనే అన్ని క్షేత్రాలను చూసి రావచ్చును. మమోలో రోజు లో ఈ సౌకర్యం ఉండదు.  అమరావతి నుంచి మొదలు పెడితే పాలకొల్లు , భీమవరం దర్శించి సామర్లకోట చేరుకొని ద్రాక్ష రామం తో యాత్ర ముగుస్తుంది. మీరు ఉదయాన్నే 4. 30 అమరావతి దర్శనం చేస్కోగలిగితే , ద్రాక్ష రామం చేరుకోవడానికి చీకటి పడిన దేవాలయం వారి అద్దె గదులలో మీరు విశ్రాంతి తీస్కోవచ్చును.
Related Postings :
> Famous Temples in Tamilnadu State
> Famous Temples in Andhrapradesh
> Famous Temples in Karnataka
> Kedharnath Temple Information
pancharama kshetras information in telugu, telugu lo pancharama kshetras , details of pancharama kshetras , pancharama kshetras timings, how to reach pancharama kshetras, pancahrama kshetras accommodation, accommodation in darksharamam, palakollu , samarlakota, amaravathi. hindu temples guide

Comments