2600 Years Old Sri Parasurameswara Temple Gudimallam

Parasurameswara Temple

ఈ మధ్యకాలంలో ఈ ఆలయంలోని స్వామి వారి ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి..
విగ్రహం చూడగానే ఆలయం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. 
ఈ ఆలయం వున్న గ్రామం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం లో వుంది.
ఇది పాపా నాయుడు పేట గ్రామానికి శివారు గ్రామం. నిజానికి ఈ ఊరు పేరు గుడి పల్లం అట.. ఆ పేరెలా వచ్చిందంటే..

విష్ణు అంశ అయిన పరశు రాముడు భూ మండలంలో క్షత్రియులను హతమార్చి ఆ బ్రహ్మ హత్యా పతకం నుంచి తప్పించుకోడానికి శివుని అర్చించసాగాడు. అదే సమయంలో బ్రహ్మ సైతం రాక్షస రూపంలో శివుని కోసం పూజలు చేస్తూ.. పరశు రామునికి ఘర్షణకు దిగాడట.. ఇద్దరూ ముష్టిఘాతాలు కొట్టుకుంటూ.. కొన్ని సంవత్సరాలు యుద్దం చేశారట. వారి తాకిడికి భూమి కుంగిపోయిందట. చివరకు శివుడు ప్రత్యక్షమై వారిని శాంతింప చేశాడట. పరశురాముడు, బ్రహ్మ యుద్దం చేసిన చోటనే స్వామి స్వయం భూః గా వెలిశాడు. స్వామి వారి పాదాల వద్ద బ్రహ్మ రాక్షస రూపంలోనూ.. విష్ణు అంశ అయిన పరశు రాముడు విల్లంభులతో వేటగాడిగానూ పరమ శివుడు మానుష లింగ రూపంగానూ .. త్రిమూర్త్యాత్మకంగా వెలిశారు. భూమి పల్లం అయిన చోటనే ఆలయ నిర్మాణం జరిగింది. ఇది డోమ్ ఆకారంలో గజపుష్టి ఆకారంలో ఉంటుంది..

పల్లంలో గుడి వున్న గ్రామం కనుక గుడి పల్లం అన్నారు. అది కాస్తా గుడి మల్లంగా నామాంతరం పొందింది.

ఇది తెలుగు గడ్డపై తొలి శివ లింగంగా చెప్పబడుతోంది. సుమారు 2600 సంవత్సరాల క్రితం ఆలయంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. 
ఒకప్పుడు దట్టమైన అడవిలో వున్న ఈ ఆలయం చాళుక్యులు, చోళుల కాలంలో పలు మార్లు నిర్మితమైందట. 20 సంవత్సరాల క్రితం ఆలయంలో పెద్ద అగ్నిప్రమాధం సంభవించి అయిదుగురు మరణించారట. ఆ దోష కారణంగా ఆలయాన్ని చాలా కాలం పాటు మూసేశారుట. 

ఇటీవలే తిరిగి ఆలయాన్ని తెరిచి ధూప దీప నైవేద్యాలు క్రతువులు చేస్తున్నారు. కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇంత పురాతనమైన అలయమైనా.. ఎందు చేతనో భక్తుల తాకిడి అస్సలు లేదు.
ఆధునిక ఛాయలు అస్సలు లేని నిఖార్సైన పురాతన ఆలయం ఇది. 

ఈ ఆలయంలో మహత్యాలు చెప్పాలంటే.. ప్రతి అరవై సంవత్సరాలకు ఒకమారు శ్రీ కాళహస్తి సమీపంలోని స్వర్ణముఖీ తీర్థం అంతర్వాహినిగా గర్భాలయంలోకి వచ్చి స్వామి వారిని అభిషేకించి అంతర్థానం అవుతుందట. 

ఈ విధంగా 2005 డిసెంబర్ 4న జలాలు అభిషేకించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
అలాగే ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి మారే దిశలో సూర్య కిరణాలు మూల విరాటును తాకుతాయట. 
ఈ ఆలయం ప్రాంగణంలోనే పార్వతీ దేవి శ్రీ ఆనందవల్లి దేవి, వళ్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి, సూర్య భగవానుడు వున్నారు..
ఆలయంలో లభించిన శిలా శాసనాలు వున్నాయి..ఆలయం రెండు ప్రాకారాలుగా నిర్మితమైంది. 
ప్రాచీన ఆలయమే అయినా చిత్రంగా గ్రామం చాలా చిన్నదిగా ఆధునీకరణకు దూరంగా వుంది.
Credits: Saride Nag
Gudimallam Sri Parasurameswara Temple Address:
Sri Parasurameswara Temple,
Gudimallam,
Srikalahasti Mandal,
Chittor District,
Andhrapradesh.
How to Reach Gudimallam:
23 km From Tirupathi, 10 km from Renugunta. Frequently Buses are available from tirupathi and Regunta.

Gudimallam Near by Famous Places / Temple:
36 km form gudimallam


Chandragiri Fort
Gudimallam is Located Near by Tirupathi, 23 km From Tirupathi. Buses are available form Tirumala Bus Stand.
keywords: Old Shiva temples, Famous siva temples, Lord shiva temple in andhra pradesh,srikalahsti,sri kalahasti, Gudimallam Temple, Sri Parasurameswara Temple gudimallam, How to reach Gudimallam, Gudimallam Siva Temple pics, Gudimallam Temple History in Telugu, Temple information in Telugu, Hindu Temples History in Telugu.

Comments