ఎక్కడ లేని విధంగా ర్యాలిలో స్వామి వారు జగన్మోహిని కేశవ రూపం లో దర్శనం ఇస్తారు. 5 అడుగుల ఎత్తు కలిగిన సాలిగ్రామ విగ్రహం మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది. జగన్మోహిని అంటే వేరే చోట విగ్రహం ఉంటుంది అనుకోకండి. ఇక్కడ ఒకే విగ్రహం లో ముందు వైపు విష్ణుమూర్తి దర్శనం ఇస్తుంటే వెనకవైపు జగన్మోహిని దర్శనం చేస్కోవచ్చు.
ఈ ఆలయం లో స్వామి వారిని దర్శనం చేస్కుని కోరుకుంటే కోరుకున్న చోటికి ట్రాన్సఫర్ అవుతుంది అని భక్తుల నమ్మకం.
ఈ ఆలయం లో మరో విశేషం ఏమిటంటే స్వామి వారి పాదాల దగ్గర ఉన్న చిన్న గంగాదేవి తలనుంచి నీరు వస్తుంటుంది. విష్ణు పాద్బోవీం గంగా అన్నట్లుగా .. ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. 365 రోజులు నీరు వస్తూనే ఉంటుంది.
ఇక్కడ జరిగే నిత్యపూజలు స్వామివారికి మరియు జగన్మోహినికి కూడా జరుగుతాయి.
ఈ ఆలయం లో శివునకు ఉమా కమండలేశ్వరుడు అని పేరు .. బ్రహ్మదేవుడు ఈ ఆలయం లో తపస్సు చేసినప్పుడు తన కమండలం పై ఉమతో కూడిన పరమ శివుణ్ణి ప్రతిష్ట చెయ్యడం వల్ల ఉమా కమండలేశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వరుడుకి అభిషేకం చేసిననీరు బయటకిగానీ కిందకిగానీ పోవటానికి మార్గంలేదుట. మోహినీమూర్తినిచూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ హరించుకుపోతుందంటారు.
జగన్మోహిని అవతారం కోసం మీకు తెల్సిందే కదా... ఆ సమయం జగన్మోహిని తల లోంచి ఒక పువ్వు రాలిందట ఆ పువ్వును వాసన చూసిన శివునకు మొహం విడిపొయి విష్ణుమూర్తి కనిపించారట. అందుకనే ఈ ఆలయం లో స్వామి వారు జగన్మోహిని కేశవ రూపం లో దర్శనం ఇస్తారు అని స్థలపురాణం.
మరొక కధ ప్రకారం.. 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఈ ప్రదేశమంతా దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు. ఆ విగ్రహాన్ని కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు. విక్రమదేవుడు భగవతాదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడాని స్థలపురాణం.
How to Reach Ryali:
( Rajahmundry ) రాజమండ్రి నుంచి 40 కి.మి. దూరం లో , ( Kakinada ) కాకినాడ కు 74 కి.మి. దూరం లో , ( Amalapuram ) అమలాపురం కి 34 కి.మి. దూరం లో ఉంది. రావులపాలెం నుంచి 6 కి.మీ దూరం లో ర్యాలి ఉంది. బస్సు సౌకర్యం కలదు.
ఉదయం సమయం లో మీరు దర్శనానికి వెళ్తే ( చీకటి పడకుండా ) పచ్చటి అందాలను ఆస్వాదించవచ్చు.
Ryali Temple Timings:
Morning : 5 am to 12 pm
Evening : 4 pm to 8 pm
Ryali Temple Address:
E.O
Sri Jaganmohini Kesava and Venugopala Swamy Temple,
Ryali,
Antreyapuram Mandal,
East Godavari District.
Andhra Pradesh.
Sri Jaganmohini Kesava Swamy Temple is located in Ryali, Atreya mandal District of East Godavari State of Andhrapradesh.
Jagan Mohini Kesava temple. the exquisite idol, made of black stone depicting Maha Vishnu and Mohini on its front and rear sides, is a real marvel of sculptural dexterity.This village is also famous for Uma Kamandaleswara Swamy temple.
Related Postings :
> Toli Tirupati Sri Srungaravallabha Swamy Temple Information
> Sri Manikyamba Shakthi Peetham Daksharamam Temple Information
> Sarpavaram Bhavanarayana Swamy Temple Information
> Korukonda Sri Lakshmi Narasimha Temple
> Peddapuram Maridamma Temple History In Telugu

ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
let me visit the temple,if there is an order from HIM.
ReplyDelete