Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Ahobilam Sri Lakshmi Narasimha Swamy Temple Details


లోకకల్యాణ కారకుడే, తన కల్యాణానికి రమ్మని పిలుస్తాడు. సాక్షాత్తూ... లక్ష్మీపతే భక్తుల కానుకల్ని ప్రేమతో స్వీకరిస్తాడు. ఆహా... అహోబిలం పరిసరాల్లోని ఆ ముప్ఫై అయిదు గ్రామాల ప్రజలు ఎంత అదృష్టవంతులు!

అహోబిలం:
అహోబిలం, కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది.అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం
వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. అహోబిలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరప భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిలక్షేత్రం. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం.ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు.పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. 

ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్థం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి.అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపంలో వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు.దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.

స్థానిక ఐతిహ్యం:
హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరహరి... వీరావేశంతో నల్లమల అడవుల్లో సంచరిస్తుంటాడు. స్వామివారి ఉగ్రత్వం ఎంతకూ తగ్గదు. ఆ సమయంలో చెంచులక్ష్మి కనిపిస్తుంది. ప్రహ్లాదవరదుడు ఆమెను చూసి శాంతిస్తాడు, మనువాడాలని నిర్ణయిస్తాడు. అయితే చెంచులు, స్వామికి తమ ఆడపడుచును ఇవ్వడానికి ఒక షరతు పెట్టారు. పెళ్లి కూతురికి ఓలి (కట్నంగా) ఏమిస్తావని అడిగారు. ‘పారువేటోత్సవాల్లో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను’ అని స్వామి మాటిచ్చాడు. అలా, తన వివాహ మహోత్సవానికి సమస్త భక్తజనులనూ ఆహ్వానించేందుకు అహోబిలం పరిసరాల్లోని 35 గ్రామాల్లో సంచరిస్తాడు నరసింహుడు.
చరిత్ర:
ఈ క్షేత్రాన్ని 1830ల్లో కాశీయాత్రచేసి దానిని గ్రంథస్థం చేసిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రా చరిత్రలో వర్ణించారు. ఆయన వ్రాసిన ప్రకారం 1830 నాటికి ఎగువ అహోబిలానికి, దిగువ అహోబిలానికి నడుమ చీకటిగల అడవి ఉండేది. అప్పటికి ఈ స్థలం కుంభకోణం వద్దనుండే అహోబళం జియ్యరు వారి ఆధీనం. వారి ముద్రకర్త అహోబిలానికి రెండు క్రోసుల దూరానగల బాచపల్లెలో ఉండి ఈ స్థలాన్ని చూసుకునేవారు. ముద్రకర్త యెగువ, దిగువ స్థలాల్లో అర్చన చేసే అర్చకులిద్దరికీ అప్పుడప్పుడూ నెలకు రూ.6 చొప్పున జీతం ఇస్తూవుండేవారు. గుడి ఖర్చులకు జియ్యరు పంపే డబ్బు తప్ప మరే దారీ ఉండేది కాదు. హైదరాబాద్ రాజ్యపు దివాను పేష్కరు రాజా చందులాలా ఈ క్షేత్రానికి సంవత్సరానికి రూ.వెయ్యి చొప్పున ఇప్పించేవారు. దిగువ అహోబిలంలో కొన్ని పేదల గుడిసెలు ఉండేవని, ఎగువన అవీ లేవని, జలము రోగప్రదం కావడంతో మనుష్యులు నివసించేందుకు భయపడేవారని వ్రాశారు. ఫాల్గుణమాసంలో బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో 400 వరహాల హాశ్శీలు ఆదాయం వస్తూండేదని, దానిని కందనూరి నవాబు తీసుకుని గుడికి చేయాల్సిన సౌకర్యాల గురించి మాత్రం పట్టించుకునేవాడు కాదని వివరించారు. ఉప్పుతో సహా ఏమీ దొరకని ప్రాంతంగా ఉండేది. ఏవి కావాల్సినా బాచపల్లె నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. అక్కడ ప్రతిఫలించియున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశము చేత లోకులకు భక్తిని కలగజేయుచున్నది గాని, అక్కడ నడిచే యుపచారములు దానికి నేపాటికిన్నీ సహకారిగా నుండలేదు. అని ఆయన వ్రాశారు.
పారువేటోత్సవాలు:
స్వామి పారువేటోత్సవాలకు వచ్చే ప్రతి గ్రామంలో ‘తెలుపు’లకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుపు అంటే ‘తెలుపు.. ఎరుపు’ రంగులతో అలంకరించిన వేదిక. తెలుపు మంచి మనసును సూచిస్తుంది. ఇక్కడే స్వామి కొలువుదీరి పూజలందుకుంటాడు. ప్రతి గ్రామంలోనూ తెలుపులను సిద్ధం చేసే బాధ్యత వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాలకు దక్కుతోంది. పల్లకీ మోసే బాధ్యత కూడా వారసత్వమే. తరాల నుంచీ ఆ కుటుంబాలవారే మోస్తున్నారు. వీరిని బోయీలంటారు. రుద్రవరం మండలం ఆలుమూరు, టి.లింగందిన్నెలకు చెందిన సుమారు 120 మంది నరసింహుని సేవలో తరిస్తున్నారు. స్వామి ఎగువ అహోబిలం నుంచి కిందికి వచ్చినప్పటి నుంచీ మళ్లీ కొండపైకి వెళ్లేంత వరకూ..ఆ ఆశ్రిత రక్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ప్రతాపరుద్రుడి కాలం నుంచీ వీరి కుటుంబాలు ఆ బాధ్యత మోస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతటి ఉన్నత విద్యావంతులైనా, ఎంత ఉన్నతోద్యోగులైనా స్వామి పల్లకీని ఒక్కరోజైనా మోయాలని పోటీపడతారు.
ఎగువ అహోబలము:
ఎగువ అహోబిలంలో వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము ఉంది.
Accommodation:
అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిథి గృహములో ఉండవచ్చు
లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు.
How to Reach:
చెన్నై-బొంబాయి రైల్వేమార్గములో గల కడప స్టేషన్‌లోదిగి అక్కడ నుండి బస్‌లో 90 కి.మీ.దూరంలోని ఆర్లగడ్డ" అనే చోటదిగి అక్కడ నుండి వేరుబస్‌లో 25 కి.మీ. దూరంలో ఈ క్షేత్రము చేరవచ్చును. నంద్యాల నుండి 45 కి.మీ. బస్ సౌకర్యం ఉంది. అన్నివసతులు ఉన్నాయి.
రోడ్డు మార్గము: హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.కడప. తిరుపతి నుండి వచ్చువారు, చాగలమర్రి నుంచి ముత్యాలపాడు, క్రిశ్నాపురం, బాచేపల్లి మీదుగ కూడా అహోబిలం చేరుకోవచ్చు.
Address:
Contact:
Sri Lakshmi Narasimha Swamy Devasthanam,
Ahobilam,
Allagadda Mandal,
Kurnool District
Andhra Pradesh
Pincode : 518543
Office:+91 9866667959,+91 8519252024

Related Postings:
> Famous Temples in Andhrapradesh
> Famous Temples in Tamilnadu State
> Famous Temples in Karnook District

Ahobilam Temple Details, Ahobilm Temple Accommodation, Ahobilam Temple Timings, Ahobilam Temple history, Best Temple Information in Hindu Temple Guide, Karnool District  Ahobilam Temple, Andhrapradesh famous temples list, Hindu temples guide.com. 

Comments