19.పాశురము
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ మెత్తెన పణ్యశయనత్తిన్ మేలేరి కొత్తలర్ పూజళల్ నప్పిన్నై కొంగ్రెమేల్ తక్కిన మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్ మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్ యెత్తనై యేలుమ్ పిరివాట్ల గిల్లాయాల్ తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్.
భావము: గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచముమీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా? లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్వామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింపకున్నావు!
క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా! కానీ కరుణించి కొంచెమవకాశమీయము తల్లీ! అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 19వ పాశురం