Drop Down Menus

Vijayawada Temple Information | Timings | Accommodation

విజయవాడ కనకదుర్గమ్మ 


శివశక్తి అయిన ఆ ఆదిపరాశక్తే శక్తి. ఆ శక్తిని ఆరాధించకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినా సరే సృష్టి స్ధితిలయ కార్యాలకోసం స్పందించలేదు. క్రియను సఫలీకృతం చేయలేదు. అటువంటి తరుణంలో  మానవులమైన మనం జన్మాంతరపుణ్యం పుంటేనే కాని ఆ జగన్మాతకు నమస్కరించాలని, ప్రణమిల్లాలని స్తుతించాలని బుద్ధి కూడా పుట్టదు అంటారు ఆదిశంకరులు. అంతటి శక్తిని ఎలా కొలుస్తాం? ఏ విధంగా ఆరాధిస్తారో అని భావించనవసరం లేదు. ఆ దేవి స్వారూప స్వాభావాలు అంశాంశలుగా అనేకం ఉన్నాయి. సజ్జన సంరక్షణ దుర్జన శిక్షణ, ధర్మ సంరక్షణల కోసం ఆ జగదంబ త్రిపురసుందరి, లలిత, గాయత్రీ, శ్రీ మహాలక్ష్మి, దుర్గ, సరస్వతి, కాళి, అన్నపూర్ణ, మహిషాసుర మర్దిని, రాజ రాజేశ్వరి మొదలైన అనేక రూపాలలో ఈప్సితార్ధదాయినిగా లోకాలను కాపాడుతూ వుంటుంది. ఆ విధమైన దేవీమూర్తులలో ఆంధ్రప్రదేశ్ లో పవిత్ర కృష్ణానదీ తీరాన విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద స్వయంభువుగా వెలశిన మల్లేశ్వరుని పట్టపురాణి శ్రీ కనకదుర్గాదేవి సమస్త భారత దేశానికీ మహోజ్వల ఆరాధ్య దేవత.

కనకదుర్గ గుడి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్దున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన (ఇంద్రకీలాద్రి) శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం.  అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకి.. అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. ఇక్కడ శ్రీచక్ర అధిష్టాన దేవత దుర్గమ్మగా వెలసింది! కోరినవారికి వరాలిచ్చే కొంగు బంగారంగా ‘బెజవాడ కనకదుర్గ’గా వాసికెక్కింది. ఈ దుర్గ గుడి క్షేత్ర పాలకుడు.. ఆంజనేయస్వామి. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా హనుమను దర్శించుకొని.. ఆపై అమ్మవారిని.. మల్లేశ్వరస్వామివారిని దర్శించుకుని.. ఆశీస్సులు పొందుతుంటారు.
Ammavaru
Temple History :
త్రైలోక్యమాత.. దుర్గాదేవి లోకకంటకుడైన మహిషాసురుడిని సంహరించిన అనంతరం.. ఇంద్రాది దేవతల కోరికపై పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద మహామహిమాన్వితమైన మహిషాసుర మర్దిని రూపంలోనే స్వయంభువుగా వెలిసింది. ఉగ్ర స్వరూపిణిగా ఉన్న అమ్మవారిని శంకరాచార్యులు దర్శించుకుని శ్రీచక్రం వేసి శాంతి స్వరూపిణిగా మార్చారని స్థలపురాణంలో ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

“ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే”

Accommodation Details :
ఇంద్రకీలాద్రిపై మేడపాటి గెస్ట్‌హౌస్‌.. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్‌ల్లో కలిపి మొత్తం (ఏసీ.. నాన్‌ ఏసీ) 55 గదులు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజుకు కనిష్ఠంగా రూ. 500 నుంచి గరిష్ఠంగా రూ. 1200 చొప్పున రుసుంతో కేటాయిస్తారు. ఇవి కాకుండా విజయవాడ నగరంలో పలు ప్రభుత్వ.. ప్రైవేటు వసతిగృహాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వసతి గురించి భక్తులు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మరిన్ని వివరాలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Annadanam Timings :
Near Sivalayam
11:00AM to 2:00 PM

SRI AMMAVARI TEMPLE TIMINGS :
Dharshanam :
4:00AM to 5:45 PM, 6:15PM to 10:00 PM Free
Antaralayam Dharshanam :
5:00AM to 5:45 PM , 6:15 PM to 10:00 PM Rs .300/- One person


Contact:
Joint Commissioner & Executive Officer
SRI DURGAMALLESWARASWAMY VARLA DEVASTANAMS
INDRAKEELADRI, VIJAYAWADA -1
KISHNA DT, ANDHRA PRADESH, INDIA
Important contact Numbers
Toll free Number  : 18004259099
Reception Phone Numbers : 0866 – 2423600, 2423500
                         
Near By Temples :
> Penuganchiprolu – sri laxmi tirupati amma temple
> Vedadri – lord nara simha swamy temple
> Hamsala devi – lord venu gopala swamy temple
> Mangalagiri – nara simha swamy temple
> Amaravathi- lord shiva
> Kotappakonda – lord shiva
> Pedha kaakani – lord shiva
> Yenamalakuduru – lord shiva

vijayawada temple information in telugu, endrakiladri temple history, temple timings, accommodation details, vijayawada temple, endrakiladri, temples information in hindu temples guide, vijayawada, temple history in vijayawada, hindu temples guide, vijayawada temple room booking, vijayawada temple timings, vijayawada temple travel information, hindu temples guide.

               
.                           
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.