Drop Down Menus

Wonderful Secrets Of Virupaksha Temple | Virupaksha Temple Inverted shadow Hampi

హంపి యొక్క శిధిలాల విస్మయపరిచే రహస్యాలు: 
విరూపాక్ష దేవాలయం హంపి వద్ద ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 350 km దూరంలో ఉంది. ఇది హంపి వద్ద నిర్మాణ సమూహాలలో ఒక భాగం. 
ఇది యునెస్కో ప్రపంచ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాకు ఎంపిక కాబడింది.విరూపాక్షుడు శివుడు యొక్క అవతారం,విరూపాక్ష దేవాలయం శివుడికి అంకితం చేయబడింది మరియు విరుపాక్ష స్వామి వారికి పంపాపతి అని నామము కూడా ఉంది. పూర్వం పంపానదిగా పిలువ బడినదే ఈ నాటి తుంగభద్రా నది.
ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. కర్నాటకలో అత్యంత పవిత్రమైన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచింది.  మరియు పరిసర శిధిలాల మధ్య, ఈ ఆలయం చెక్కుచెదరకుండా ఉంది
9 వ మరియు 10 వ శతాబ్దానికి చెందిన పురాతన శాసనాలు ఉన్నాయి. ముఖ మంటపం లోనికి ఎక్కే మెట్ల ప్రక్కన ఒక శిలా శాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉంది.హంపి గ్రామం విజయనగర శిల్పకళకు మరొక మంచి ఉదాహరణ. 

హంపి రాజభవనాలు, జల నిర్మాణాలు, పురాతన మార్కెట్ వీధులు,  బలవర్థకమైన గోడలు, గేట్లు మరియు టవర్లు,రాజ మంటలు, ఖజానా భవనాలు, ప్యాలెస్లు, స్తంభాలు మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొన్ని ఇప్పటికీ మానవ కళ్ళకు మర్మములే.
విఠల ఆలయం యొక్క రంగ మంటప యొక్క సంగీత స్తంభాలు( సరిగమ సంగీత స్తంభాలు) రహస్యం:
విఠల ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణలలో రంగ మంటపం ఒకటి. పెద్ద మంటప 56 సంగీత స్తంభాలకు ప్రసిద్ది చెందింది. ఈ సంగీత స్తంభాలు కూడా సరిగమ స్తంభాలుగా పిలువబడతాయి,  ఈ ఆలయం లోపలికి 7 ప్రధాన స్తంభాలు ఉన్నాయి, అవి ఒక పెద్ద స్తంభము చుట్టూ ఉన్నాయి మరియు అన్ని 7 స్తంభాలు తాకినప్పుడు సరిగమ పదనిస అనే శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన స్తంభాలు సంగీత వాయిద్యాలుగా రూపకల్పన చేయబడ్డాయి.ఈ 7 స్తంభాలు నుండి 7 వేర్వేరు సంగీత నోట్లను (సరిగమ అనే)విడుదల చేస్తాయి.


ఈ స్తంభాల నుండి వచ్చే  ధ్వని నాణ్యతలో వేర్వేరుగా ఉంటాయి.భారతదేశ బ్రిటీష్ పాలకులు కూడా ఈ స్థలం గురించి తెలుసుకున్నప్పుడు ,ఆశ్చర్యపడ్డారు మరియు సంగీత స్తంభాల వెనుక రహస్యాలను తెలుసుకోవాలని వారు కోరుకున్నారు. అ స్తంభాలలో ఏదైనా ఉందా లేదా ఏ వస్తువు అయినా అమర్చరా అని  తెలుసుకోవడానికి వారు అక్కడి రెండు స్తంభాలను పరిశీలించడానికి కోసం
పగలకొట్టారు (కత్తిరించారు) అప్పుడు అ యొక్కస్తంభాలలో ఏమి లేకపోవడం చూసి ఆశ్చర్యం పోయారు. ఈ స్తంభాలు ఒక ఖచ్చితమైన నోటుని అంత ఖచ్చితంగా ఎలా సాధ్యం అవుతుంది అనే విషయం నేటికి కూడా ఎవరికి అర్థం కానీ ఆశ్చర్యంపోయే పరిసిత్థి.బ్రిటీష్ పాలకులు కత్తిరించిన రెండు స్తంభాలు ఇప్పటికీ ఆలయ సముదాయంలో ఉన్నాయి మరియు సందర్శకులు కూడా ఈ రోజు కూడా చూడవచ్చు. 

తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ యొక్క రహస్యం:
ఈ దేవాలయానికి మూడు గోపురాలు ఉన్నాయి, తూర్పు గోపురం 160 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది, తొమ్మిది అంతస్తులు ఉంటాయి. ఇది పదిహేను శతాబ్దం మొదటి అర్ధభాగం నాటిది మరియు ఇది పదహారవ శతాబ్దంలో కృష్ణదేవరాయలచే పునర్నిర్మించబడింది.విరూపాక్ష ఆలయానికి వెనుక వున్న సాలుమంటప గోడ మీద రాజగోపురం యొక్క నీడ తలక్రిందులుగా పడుతుంది. రాజగోపురం నుండి 300 అడుగుల ఆలయం వెనుక గోడపై పడుతుంది సందర్శకులు చూడవచ్చు.
ప్రధాన ఆలయం లోపల గోడ మీద 6 అంగుళాల సన్నటి చీలిక రంధ్రం వుంటుంది. ఈ రంధ్రం గుండా సూర్యకిరణాలు ఆలయం లోపలి పశ్చిమ గోడపై పడి ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం యొక్క నీడ తలక్రిందులుగా పడుతుంది.ఈ రాజగోపురం, సాలుమండపముకు మరియు రాజగోపురానికి మధ్యలో వుంటుంది.
సాలుమంటపం నేలపై పడే గోపురం నీడ ఎత్తు 15 అడుగులుంటుంది. గోపురం ఎత్తు కూడా 15 అడుగుల ఎత్తు వుండడం ఒక్క ముఖ్య గమనార్థం. ఇలా జరగటానికి విరూపాక్షస్వామి మహత్యమే శివభక్తులు నమ్ముతువుంటారు,వాస్తు శిల్పాచార్యుల యొక్క మేధస్సుకు తార్కాణమని ఇదొక అద్భుతదృశ్యంగా చెప్పవచ్చు. 
పాడ్యమినాడు సూర్యకిరణాలు:
ఇంకొక విశేషం ఏమిటంటే ఏప్రిల్ నెలలో ఉగాది సమయంలో వచ్చే పాడ్యమినాడు సూర్యకిరణాలు గర్భగుడిలో వున్న శివలింగం మీద పడతాయి. ఇటీవల కాలంలో ఇంకొక అద్భుతం కూడా ఈ క్షేత్రంలో చోటుచేసుకున్నది.అది ఏమిటంటే ఈ క్షేత్రంలో ప్రధాన దైవమైన విరూపాక్షస్వామి వున్న గర్భగుడి యొక్క నీడ విరూపాక్ష ఆలయం వెనుక వైపుతల క్రిందులుగా పడడం జరిగింది.సూర్యోదయం నుండి ఉదయం 9 గంటలవరకు ఈ నీడ కనిపిస్తుంది. కొన్నిసార్లు సాయంసమయాల్లోనూ ఈ నీడ కనిపిస్తుంది.
ఇక్కడ నంది యొక్క అతి పెద్ద విగ్రహం ఏక శిలాపై చెక్కడం విశేషం .
మూడు తలల నంది:
ఈ క్షేత్రంలో  అందరినీ  ఆశ్చర్య పరిచే మరొక్క విషయం ఏమిటి అంటే ప్రపంచంలో ఏ  శివాలయంలోని లేని విధంగా  ఇక్కడ మూడు తలలు కలిగిన నంది యొక్క విగ్రహం దర్శనం విస్తుంది. ఏ శివాలయంలో అయిన నందికి ఒక తలవుండడం మనం చూస్తుంటాము . ఇక్కడ ప్రధాన ఆలయానికి ఉత్తరదిశలో వున్న రెండు ఉపఆలయాలలో పరమ శివుని యొక్క సతీమణులైన పంపాదేవి మరియు భువనేశ్వరి ఆలయం బయట మనకు మూడు తలల కలిగిన నంది కనిపిస్తుంది. 
Related Postings 

The Virupaksha Temple in Hampi is dedicated to lord Shiva. The distance from Bangalore to Hampi is about 350 km. Hampi is a temple town in South India and is acknowledged as one of the World Heritage Sites of UNESCO. Virupaksha Temple is dedicated to lord Shiva. This temple was constructed in Lakkana Dandesha’s assistance who was a commander under King Deva Raya Two.

Hampi is on the embankment of River Tungabhadra. The predominant centre of pilgrimage in Hampi is this esteemed temple. It is the holiest and sacred retreat.

keywords:
The Virupaksha Temple,Virupaksha Temple, Hampi, Famous Temples in Hampi,virupaksha temple plan,virupaksha temple pattadakal,virupaksha temple in kannada,hampi temple history,virupaksha temple timings,virupaksha temple images,virupaksha temple wikipedia,virupaksha temple inverted shadow,Virupaksha Temple in Hampi, Video Reviews, Photos, History,The Virupaksha Temple History in telugu,Virupaksha Temple in telugu,Virupaksha Temple history in telugu,Hampi Temple in telugu,Hampi In Telugu,Hampi Temples History In telugu,Hampi Temple Story In Telugu,Hampi Telugu,Virupaksha Devalayam,Virupaksha Temple accommodation,Virupakshi Temple Room Booking

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.