Drop Down Menus

What Is The Right Way To Do The Pradakshina For Shivalayam | Pradakshina

శివాలయంలో ప్ర‌ద‌క్షిణ‌లు" ఎలా చేయాలో తెలుసా ?

శివ ప్రదక్షిణ విధానము :
వృషం చండం వృషంచైవ సోమసూత్రం పునర్వ్రుషమ్ । 
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వ్రుషమ్ ॥ 
శివ ప్రదక్షిణే చైవ సోమసూత్రం న లంఘయేత్ । 
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధ్రువమ్ ॥
దేవాల‌యానికి మాన‌వ దేహానికి అవినాభావ సంబంధం ఉంది. దేవాల‌యానికి వెళ్తే మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌ల‌గ‌డ‌మే కాదు, ఆ ప‌రిస‌రాల్లో ఉండే పాజిటివ్ శ‌క్తి మ‌న‌లోకి ప్ర‌వేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వ‌స్తుంది. 
ఏ దేవాలయానికి వెళ్లినా దైవాన్ని ద‌ర్శించుకునే ముందు గుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తారు. కొంద‌రు త‌మ వీలునుబ‌ట్టి ఎక్కువ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే కొంద‌రు 3 ప్ర‌ద‌క్షిణ‌లే చాల‌ని చెప్పి అనంత‌రం దైవద‌ర్శ‌నం కోసం వెళ్తారు. ఈ క్ర‌మంలో వేరే ఏ దేవుడి గుడికైనా వెళ్లిన‌ప్పుడు భ‌క్తులు అలా త‌మ వీలును బ‌ట్టి ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌వ‌చ్చు, కానీ శివుడి గుడికి వెళ్లిన‌ప్ప‌డు ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలోనే ప్ర‌ద‌క్షిణ‌లు చేయాల‌ట‌. సాధార‌ణంగా భ‌క్తులు దేవాల‌యాల్లో 3 సార్లు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తారు. ఇందులో ఒక‌టి గుడిలో దేవుడికి, రెండోది పూజారికి, మూడోది గుడి క‌ట్టిన విశ్వ‌క‌ర్మ‌కు.
'ప్రదక్షిణం' లో 'ప్ర' అనే అక్షరం పాపాలకి నాశనము..'ద' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. 'ణ' అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఎంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వా ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుకరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.
శివాల‌యంలో ప్ర‌ద‌క్షిణ చేస్తే అది 10 వేల ప్ర‌ద‌క్షిణ‌ల‌తో స‌మాన‌మ‌ట‌. దీని గురించి లింగ పురాణంలో చెప్పారు. అయితే పైన చెప్పిన‌ట్టుగా కాక శివుని గ‌ర్భ‌గుడి చుట్టూ గుండ్రంగా ప్ర‌ద‌క్షిణ చేయ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే లింగాన్ని అభిషేకించిన జ‌లం వెళ్లే దారి వ‌ద్ద ప్ర‌మ‌ధ గ‌ణాలు కొలువై ఉంటాయ‌ట‌. వాటిని దాటి ప్ర‌ద‌క్షిణ చేయ‌కూడ‌ద‌ట‌. అలా చేస్తే త‌ప్పు చేసిన‌ట్టు అవుతుంద‌ట‌.  ప్ర‌య‌త్నిస్తే  ప్ర‌ద‌క్షిణ చేయ‌డం సుల‌భ‌మేన‌ని పండితులు చెబుతున్నారు.
గ‌ర్భ గుడిలో ఉన్న శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కదా. ప‌క్క‌నే లింగాన్ని అభిషేకించిన జ‌లం వెళ్తూ ఉంటుంది. దాని కిందే చండీశ్వ‌రుడు కొలువై ఉంటాడు. శివాలయంలోకి వెళ్ల‌గానే నేరుగా శివుని గ‌ర్భ‌గుడి చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌కూడ‌ద‌ట‌. ముందుగా నందీశ్వ‌రుని వ‌ద్ద ప్ర‌ద‌క్షిణ ప్రారంభించి చండీశ్వ‌రుని వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న్ను ద‌ర్శించుకుని మ‌ళ్లీ వెన‌క్కి రావాలి. 
ఒకసారి చండీశ్వ‌రుని ద‌ర్శించుకుని వెన‌క్కి వ‌చ్చి నందీశ్వ‌రుని వ‌ద్ద ఆగి అటు నుంచి గర్భ‌గుడి మీదుగా లింగాన్ని అభిషేకించే జ‌లం వ‌ద్ద‌కు రావాలి. అక్క‌డి నుంచి వెన‌క్కి తిరిగి నందీశ్వ‌రుని వ‌ద్ద‌కు వ‌చ్చి ప్ర‌ద‌క్షిణ పూర్తి చేయాలి. ఇలా 3 సార్లు చేస్తే చాలు దాంతో ఎంతో ఫ‌లితం క‌లుగుతుంద‌ట‌.
శివ ప్రదక్షిణ విధానము :
ధ్వజస్తంభము నుండి సవ్యంగా చండీశ్వరుని వద్దకు వెళ్ళి నమస్కరించవలెను.
మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకొని, సోమసూత్రము వరకు వెళ్ళవలెను.
అదే విధంగా, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకొని, చండీశ్వరుని చేరవలెను.
మరల ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) సోమసూత్రమును చేరవలెను.
అదే విధంగా, ధ్వజస్తంభము మీదుగా (మధ్యలో ఆగకుండా) చండీశ్వరుని చేరి నమస్కరించవలెను.
మరల, ధ్వజస్తంభము వద్దకు వచ్చి నమస్కరించుకోనిన  ప్రదక్షిణ పూర్తి యగును.
(ధ్వజస్తంభము లేని యడల, నందీశ్వరుని నుండి ఈ ప్రదక్షిణ చేయవచ్చును.)
శివ ప్రదక్షిణ చేయునప్పుడు సోమసూత్రమును దాటరాదని తెలిసికొనవలెను.
Related Postings:

Keywords:

devotees, temples, hinduvulu, hindu temples in india, devotees in temples, pradakshina, devotees doing pradakshina, devotees news, temples news, temples latest,why devotees doing pradakshina in temples.bhakti samacharam, devotional information, pradakshinalu, sree sannidhi, ఏదేవుని ఆలయంలో ఎన్నిసార్లు ప్రదక్షణలు చేయాలి, దేవుని పూజ, ప్రదక్షిణలు, భక్తి సమాచారం, శ్రీసన్నిధి,ఏ దేవుని ఆలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి?,ప్రదక్షిణలు చేసి దర్శనమా? దర్శనం తర్వాత ప్రదిక్షనలా? Dharma Sandehalu,Importance of Pradakshina in temple? గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?Significance of half pradakshina around Shivlinga,What is the Right Way to Do The Pradakshina for Lord Shiva? శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి?,శివ ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసా..? Shiva Pradakshina Ela Cheyali, Shiva Pradakshina, Pradakshina.Hidden Secrets of Shiva Pradakshina,Shivalayam,Pradakshina Between Lord Shiva and Nandi,DHARMASANDEHALU IN TELUGU,pradakshina at sivalayam in telugu
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.