Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Borra Caves Visakhapatnam | Timings, Vizag, History, Araku

ఈ గుహలు ప్రకృతి అందాలకు నెలవు

విశాఖ జిల్లాలోని అరకు ఒకటి. అరకు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించడమంటే ప్రకృతితో మమేకమవడమే. ఎటుచూసినా పచ్చని కొండలు, పచ్చిక బయళ్లతో వానాకాలంలో మరింత అందంగా అరకు వ్యాలీ కనిపిస్తుంది. అటువంటి అరుకు వ్యాలీలో మరింత అందమైన, ఆకర్షణీయ పర్యాటక ప్రదేశం బొర్రాగుహలు. ప్రతీ సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా. అరకు లోయ అందించిన ప్రకృతి అద్భుతమైన బొర్రాగుహల ఒక వరం.

చరిత్రాత్మక ప్రాధాన్యం కల మరియు సహజసిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలు విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో కలవు. ఈ గృహలో శివలింగాన్ని మరియు కామధేనువు విగ్రహాన్ని కూడా దర్శించవచ్చు. సహజంగా ఏర్పడ్డ ఈ గృహలు ఆవు పొదుగు ఆకారంలో ఉండి ఒక ఒక మిలియన్‌ (10 లక్షల) సవంత్సరాల క్రితంవిగా భావించబడుచున్నవి.

బొర్రా గుహలో జరిపిన తవ్వకాలో 30 వేల నుండి 50 వేల సంవత్సరాల క్రితం నాటి రాతిపనిముట్లు భించాయి. దీనిని బట్టి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది. గుహ లోపల భాగంలో విద్యుత్‌ దీపాలతో అంకించారు.

ఈ శిలలు ఎలా ఏర్పడ్డాయి? 
బొర్రా గుహల పక్కనే గోస్తనీ నది ప్రవహిస్తుంటుంది. సహజంగా నీటిలో ఉండే హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బోనేట్‌తో కలిసినప్పుడు అది ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమంగా కరిగిపోతుంది. ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల కొంత కాలం తర్వాత గుహలు ఏర్పడతాయి. బొర్రా గుహల నుంచి నేరుగా గోస్తనీ నదికి దారి ఉంది. అయితే, అది ప్రమాదకరం కావడంతో ఆ దారిని పురావస్తు శాఖ మూసివేసింది -- భారతదేశంలో అత్యంత పొడవైన, లోతైన గుహలు ఇవే -- ఈ గుహలోపల ఏడాది పొడవునా చల్లటి వాతావరణం ఉంటుంది.

ప్రకృతిలో మనిషికి అర్ధంకాని వింతలెన్నోఉన్నాయి, ఎన్నొ అద్భుతాలున్నాయి. ఇలాంటి అద్భుతాల్లో సహజసిద్ధమైన బొర్రాగుహలు కూడా ఒకటి. తూర్పుకనుమల్లోని ఆ ప్రదేశం నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం. ప్రకృతి ప్రసాదించిన వింత ఇది. తూర్పుకనుమల్లోని అనంతగిరి మండల వరుసలో విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి అరకులోయకు వెళ్లే దారి అంతా కనుమ రహదార్లతో కూడినదే. ఈదారి వెంట ప్రయాణమే ఓగొప్ప అనుభూతి. గుండెలు గుభేలు మనిపించే కొండ దారిలో వెళ్తుంటే కింద పచ్చని తెవాచీ పర్చినట్లు ప్రకృతి, దట్టమయిన అడవులు, అందమైన వన్యప్రాణులు కనబడతాయి.

అక్కడకు ఎలా చేరుకోవాలి?
విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి కనుమల్లో ఉన్నాయి బొర్రా గుహలు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి అయితే, 448 కిలోమీటర్లు, హైదరాబాద్‌ నుంచి 656 కిలోమీటర్ల దూరం. ఇక్కడకు చేరుకోవడానికి అన్నిరకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అతిదగ్గర ఎయిర్‌పోర్ట్‌ విశాఖపట్నం. అక్కడ్నుంచి 90 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే బొర్రా గుహలు చేరుకోవచ్చు.


ప్యాసింర్ రైలు కూడా 
ఇక ప్రతీరోజూ విశాఖపట్నం నుంచి బయల్దేరే కొత్తవలస కిరండూల్‌ ప్యాసింజర్‌లో కూడా బొర్రా గుహలకు వెళ్లచ్చు. ఐదుగంటల ప్రయాణం ఖచ్చితంగా మధురానుభూతులను మిగులుస్తుంది. కొండలమీదకు ఎగబాకే రైలు.. దాదాపు ౩౦సొరంగమార్గాల గుండా ప్రయాణం ధ్రిల్లింగ్‌గా ఉంటుంది. బొర్రా గుహలు స్టేషన్‌లో రైలు దిగితే.. అక్కడ్నుంచి గుహల వరకూ స్ధానిక ఆటోలు సిద్ధంగా ఉంటాయి. అయితే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ట్రైన్‌కు ఏడాదిపొడవునా గిరాకీ ఉంటుంది. సో.. ఒకవేళ బొర్రా ట్రిప్‌ ప్లాన్‌ చేస్తే మాత్రం ఖచ్చితంగా ముందుగా టిక్కెట్స్‌ రిజర్వ్‌ చేసుకోండి.

borra caves timings and entry fee, borra caves history in telugu, borra caves history in hindi, borra caves nearest railway station, vizag to borra caves train ticket price, visakhapatnam to borra caves bus timings, borra caves to katiki waterfalls distance, borra caves katiki, borra caves araku, araku, borra guhalu telugu history, borra guhalu images, borra caves hd images, borra caves visakhapatnam.

               

Comments

Popular Posts