Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Lambasingi Andhra Kashmir Visakhapatnam - How to Reach Lambasingi

ఆంధ్ర ‘కశ్మీర్’: లంబసింగి :
పచ్చ చీర కట్టిన వయ్యారి పర్వతాలు ఓ పక్క, పాలధారను తలపించే జలపాతాలు మరోపక్క.. మంచు తుంపర్లతో పులకింపజేసే.. ‘లంబసింగి’లో అడుగు పెడితే ఎంతటివారైనా ఫిదా అయిపోతారు. డిసెంబరు నెల వచ్చిందంటే చాలు.. ఈ ప్రాంతం పర్యాటకులతో కిక్కిరిసిపోతుంది.

తూర్పుకనుమలలో అతి చల్లని ప్రదేశం 'లంబసింగి'. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ జిల్లా మన్యం ఏరియా కిందకు వస్తుంది. మన్యం లోని చింతపల్లి మండలంలో 'లంబసింగి' అనే గ్రామము కలదు. దీనినే పర్యాటక ప్రియులు ముద్దుగా 'కాశ్మీర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్' గా లేదా 'ఆంధ్రా ఊటీ' గా పిలుస్తారు. ఈ గ్రామానికే 'కొర్రబొయలు' అనే పేరుకూడా ఉంది. లంబసింగి ఒక గిరిజనుల ప్రాంతము. ఇక్కడి ఉష్ణోగ్రతల కారణంగానే ఆంధ్రా కాశ్మీర్, ఆంధ్రా ఊటీ అనే పేర్లొచ్చాయి దీనికి. డిసెంబరు - జనవరి మాసాల్లో వాతావరణం సుమారుగా 0 డిగ్రీలు ఉంటుంది, మిగిలిన కాలాల్లో సుమారుగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అందువల్ల ఈ ప్రాంతమును ఆంధ్రా కాశ్మీర్ అని కూడా అంటారు. సముద్రమట్టానికి ఈ ప్రాంతము 1000 మీటర్ల ఎత్తులో ఉంది.

లంబసింగి గ్రామం విశాఖపట్నం నగరానికి 101 కిలోమీటర్ల దూరంలోను, నర్సీపట్నం గ్రామానికి 32 కిలోమీటర్ల దూరంలోను ఉంది. ఈ ప్రాంతాలనుండి లంబసింగికి తారు రోడ్డు ఉంది.

కాశ్మీరాన్ని తలపించే లోయలు :
అందమైన పర్వతాలు, లోయలు, మంచు వర్షాన్ని తలపించే దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతం కశ్మీర్‌ను తలపిస్తుంది. ఈ మంచు పొరలు చాటున కనిపించే పచ్చని పర్వతాల అందాల గురించి మాటల్లో వర్ణించడం కష్టమే. మన్యం ఏరియాలో ఉంది కనుక కొండలు, అడవులు దాటుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇరువైపులా లోయలు ... మధ్యలో రోడ్డు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
జాగ్రత్త :
ఎంతో అలసటతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు .... లంబసింగి వాతావరణాన్ని చూసి ఒక్కసారిగా మైమరిచిపోతారు. అంతవరకు పడ్డ శ్రమకు న్యాయం చేకూరిందని భావిస్తారు. లంబసింగి లో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఉదయం 10 అయినా ఇంకా ఇప్పుడే తెల్లారిందా ?? అన్నట్లు మంచుతెరలు కమ్ముకొని ఉంటాయి. ఉదయం పూట కూడా లైట్ వేసుకొని కారు నడపాల్సివస్తుంది ఇక్కడ. ఏదైతేనేం పర్యాటకులు రాత్రి కంటే ఉదయమే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.

అందాలను చూసి కొత్త ఉత్సాహం :
లంబసింగి ఘాట్‌రోడ్డులో కాఫీ తోటలు ఆకట్టుకుంటాయి. లంబసింగి చేరుకోడానికి ముందు బోడకొండమ్మ గుడి వస్తుంది. దీనికి అర కిలోమీటరు దిగువన జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. ఇక్కడి నుంచి పాడేరు మార్గంలో తాజంగి రిజర్వాయర్‌ వుంది. కొక్కిరాపల్లి ఘాట్‌ దిగువున కొత్తపల్లి గ్రామంలో పది జలపాతాలు ఉన్నాయి. ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

అక్టోబరు మొదలుకుని ఫిబ్రవరి వరకు శీతాకాలంలో మంచు వర్షం కురుస్తుంది. రెగ్యులర్ గా ఉదయం 6 అయ్యేసరికి కనిపించే సూర్యుడు ఇక్కడ మాత్రం 10 గంటలకు దర్శనం ఇస్తాడు. వేసవిలో మధ్యాహ్నం 12 తర్వాత సూర్యుడు ప్రకాశిస్తాడు. లంబసింగిలో ప్రతిరోజూ 3 pm కు సూర్యుడు సన్నబడిపోతాడు. సాయంత్రం 5-6 అయ్యేసరిగి చలి ప్రారంభమవుతుంది. ఈ వాతావరణానికి మంత్రముగ్ధులు అవుతుంటారు. ఈ ప్రదేశాలను తమ కెమెరాల్లో కూడా బంధించుకుంటారు. లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పర్యటించే ఒక్కరిని మైమరపిస్తాయి.

గ్రామంలో ప్రధాన పంటలు :
మిరియాలు, కాఫీ. అమెరికాలోని ఫ్లోరిడా వాతావరణానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో సిమ్లా యాపిల్ సాగుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చూడదగ్గవి :
తాజంగి రిజర్వాయర్ వద్ద పర్యాటక శాఖ తాజాగా బోట్ షికారును ఏర్పాటుచేశారు. చక్కటి అనుభూతులను పంచే ఈ ప్రాంతంలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడకొండమ్మ దేవాలయం వద్ద మొన్నీమధ్య ఒక జలపాతం కూడా కనిపించింది. దేవాలయం వద్ద కనిపించింది కాబట్టి 'బోడకొండమ్మ జలపాతం' అని పేరు పెట్టారు. అలాగే 40 కి. మీ ల దూరంలో కొత్తపల్లి వాటర్ ఫాల్స్, 75 కి. మీ ల దూరంలో ధారకొండ వాటర్ ఫాల్స్ చూడదగ్గవి.

ఇలా చేరుకోవాలి :
విశాఖ విశాఖపట్నం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. లంబసింగితో పాటు, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, పాడేరు పరిసర ప్రాంతాలను ఒకే రోజులో చూపించేవిధంగా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. లంబసింగి నుంచి మరో 90 కిమీలు ప్రయాణిస్తే బొర్రాగుహలు, అరకులోయ వస్తాయి. లంబసింగి కి చేరువలో వైజాగ్ ఎయిర్ పోర్ట్ (106 KM), వైజాగ్ రైల్వే స్టేషన్ (114 KM), నర్సీపట్నం రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ప్రభుత్వ బస్సులలో వచ్చేవారు నర్సీపట్నం, వైజాగ్, చింతపల్లి (19 KM) తదితర ప్రాంతాల నుంచి బస్సులలో రావొచ్చు.

lambasingi snow, hyderabad to lambasingi, lambasingi weather, lambasingi in summer, lambasingi in august, lambasingi campfire, lambasingi to bangalore, chennai to lambasingi, andhra kashmir lanbasingi, lambasingi , lambasingi root map,lambasingi rooms, lambasingi images.

               

Comments

Post a Comment