Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Famous Temples List In Peddapalli District | Telangana State

పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

ఈ పెద్దపల్లి జిల్లా నూతనంగా ఏర్పడిన జిల్లా. ఇంతకు ముందు కరీంనగర్  అనే జిల్లాలో కలిసి ఉండేది. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడినది.

1. శ్రీ త్రిలింగరాజరాజేశ్వరస్వామి దేవాలయం , పెద్దపల్లి :

పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, జనగామ గ్రామంలో ఉన్న బహు పురాతన శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని 12 వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. ఈ ఆలయాన్ని 16 పోళ్ళతో, మొత్తం ఇసుకరాయి తో నిర్మించారు. ఈ ఆలయం తూర్పున ఊర చెరువు, ఉత్తరాన గోదావరి నది ఉంది. ఈ నదిలో ఋషులు, మునులు ఈ ఆలయంలో ఉండే రహస్య మార్గం గుండా వెళ్లి స్నానం ఆచరించేవారట.ఈ ఆలయంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున మరియు కార్తీక పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాల జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 2.00PM - 3.00PM TO 8.00PM.

2. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , మంధనీ :

మొదట ఈ ప్రాంతంలో శ్రీ వరాదరాజ స్వామి ఆలయం ఉండేది. ఈ స్వామి శ్రీ వైష్ణవులు జరిపే పూజలు అందుకుంటున్నారు. దసరా రోజు సాయంకాలం స్వామి వారిని అశ్వ వాహనం పై ఊరేరిగింపు చేస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

3. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం , ధర్మపురి :

ఈ అలయాన్నికి ధర్మరామ , ధర్మాపురం , ధర్మవూరు అనే పేర్లు ఉన్నాయి. గోదావరి నది ఒడ్డున ఈ ఆలయం కలదు. ఈ ఆలయం 15 వ శతాబ్దం కి చెందినది. జగిత్యాల నుంచి 45 కి. మీ దూరంలో ఈ ఆలయం కలదు. వైకుంటా ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 2.00PM - 3.00PM TO 8.00PM.

4. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , కొండగట్టు :

ఈ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం. ఏ ఆలయంలో ఒక కొండ పై కలదు. ఈ ఆలయానికి 160 సం || చరిత్ర కలదు. ఆంజనేయ స్వామి భక్తులు 40 రోజుల పాటు దీక్షలు నిర్వహించి ఈ అలయాన్నికి దర్శనికి వస్తారు. అలా చేయడం వల్ల తాము కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం.  హనుమాన్ జయంతి , శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. నూతన వాహన పూజ కార్యక్రమాలు కూడా భారీగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 5.00AM TO 12.00PM - 3.30PM TO 8.30PM.

5. శ్రీ శివాలయం , కోటి లింగాల పల్లి :

ఈ ఆలయం వెలుగత్తురు అనే కరీంనగర్ లో కలదు. ఈ ఆలయంలో కోటి లింగాల ప్రతిష్ట జరిగినది. చుట్టూ ఎటు చూసిన మొత్తం లింగ మూర్తులతో స్వామి దర్శించుకోవచ్చు. శాత వాహన కాలం నాటి ప్రజలకి ఈ ప్రాంతం వర్తక వ్యాపారం చేసేవారు. శివరాత్రి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.30AM TO 12.30PM - 3.30PM TO 7.00PM.

6. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం , వేములవాడ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. చాళుక్య కావారి కాలం నాటి ఆలయం. శివ స్వామి రాజయ్య గా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు. కరీంనగర్ నుంచి 35 కి. మీ దూరంలో కలదు. దేశ నలుమూలల నుంచి ఈ ఆలయాన్నికి భక్తులు వస్తారు. శివరాత్రి మరియు దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 4.30AM TO 12.00PM - 3.00PM TO 9.00PM.

7. పంచముఖ లింగ ఆలయం , రైకల్ :

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం 1 వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయం రైకల్ అనే గ్రామంలో కలదు. జగిత్యాల నుంచి 25 కి. మీ దూరంలో ఈ ఆలయం కలదు. శివరాత్రి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

8. శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం , కాళేశ్వరం :

ఈ ఆలయం మహాదేవపురం నుంచి 16 కి. మీ దూరంలో కలదు. మరియు మంధనీ గ్రామానికి 35 కి.మీ దూరంలో కలదూ. 1976-82 మధ్య ఈ ఆలయాన్ని పునః నిర్మించారు. ఈ ఆలయంలో సోమ ,శని ఆదివారాలలో రద్దీ అధికంగా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 1.00PM - 4.00PM TO 8.00PM.

9. శ్రీ వీరభద్ర ఆలయం , కొత్తకొండ :

చుట్టూ కొండల మధ్య ఈ ఆలయం చాలా రమణీయంగా ఉంటుంది. ముల్కా నూర్ గ్రామం నుంచి 8 కి. మీ దూరంలో కలదు. కాకతీయుల కాలం నాటి ఆలయం. ప్రతి సం || జనవరి నెలలో 3 రోజుల పాటు స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.00PM TO 7.30PM.

పెద్దపల్లి  జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 

Telangana Temples District Wise
KeyWords : Peddapalli Famous Temples List, Peddapalli District Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide

Comments

Popular Posts