Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Famous Temples List In Hyderabad District | Telangana State

హైదరాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల జాబితా :

1. శ్రీ చిలుకూరు బాలాజీ , చిలుకూరు(గ్రా):

ఈ ఆలయం దర్శించడానికి రాష్టా నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ముందుగా ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు తీరిన తరువాత 101 ప్రదక్షణాలు చేస్తారు. ఈ ఆలయం లో స్వామికి వీసాల స్వామి అనే మారియొక్క పేరు కూడా కలదు. ఈ ఆలయం లో ఇప్పటికీ ఆలయ హుండీ కనిపించదు. ఆలయం పక్కనే శివాలయం కూడా కలదు. ఆ శివాలయం లో కూడా పానవట్టం శివునికీ ఎదురుగా ఉంటుంది. ఆలయం బయట చెట్లు సుమారు 400 సం || క్రితం నుంచి ఉన్నాయి.

ఆలయ దర్శించే సమయం : 5.00AM TO 3.00PM - 3.30PM TO 8.00PM.

2. శ్రీ అష్ట లక్ష్మీ ఆలయం ,యల్. బి. నగర్ :

చాలా అరుదుగా అష్టలక్ష్మీ ఆలయాలు ఉంటాయి. అందులో L.B. Nagar (యల్. బి. నగర్)వద్ద ఈ ఆలయం కలదు. నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 3.30PM TO 8.00PM.

3. శ్రీ బిర్లా మందిర్ , ట్యాంక్ బండ్ : 

హైదరాబాద్ లో దర్శించనీయ ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం పూర్తికా పాలరాతి తో నిర్మించబడినది. ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారు. నూతన సం || మరియు తొలి ఏకాదశి , పండుగ రోజులలో రద్దీ అధికం గా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12PM - 3.30PM TO 8.30PM.

4. శ్రీ వినాయక ఆలయం , సికింద్రాబాద్ : 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం లో గణపతి స్వామితో పాటు శ్రీ సుబ్రమణ్యస్వామి , ఆంజనేయ స్వామి , శివ , ఉమా మహేశ్వర , నవగ్రహ ఆలయాలు కలవు. గణపతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 5.30AM TO 1.00PM - 3.30PM TO 8.00PM.

5. శ్రీ మహంకాళి ఆలయం , సికింద్రాబాద్ :

ఈ ఆలయం నిర్మాణంకి ప్రేరణ ఒక ఆర్మీ జవాన్ . అతని పేరు సూరటి  అప్పయ్య. మధ్యప్రదేశ్ లో కలరా వ్యాధి తగితే తన నివాస ప్రాంతంలో ఈ ఆలయం నిర్మిస్తాను అని మొక్కుకుంటాడు. ఆ కోరిక మేరకు ఈ ఆలయం నిర్మించడం జరిగినది. ఈ ఆలయం 202 సం || చరిత్ర కలిగినది. ఈ ఆలయం లో బోనాల ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 6AM TO 12.00PM - 4.00PM TO 8.00PM.

6. శ్రీ శివ ఆలయం , కీసర గుట్ట :

హైదరాబాద్ నుంచి ఈ ఆలయం 40 కి.మీ దూరం లో కలదు. శ్రీ రాముడు రవాణా సంహారం తరువాత తన బ్రహ్మ హత్య దోషాని నివారణ కోసం రాముడు స్వయంగా ఈ శివ లింగ ప్రతిష్ట చేశారు. ఈ ఆలయం లో శివ రాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్య లో పాల్గొంటారు. ఈ ఆలయం పక్కనే శ్రీ నృసింహ స్వామి ఆలయం ,శ్రీ పంచ శివ లింగ ఆలయం , శ్రీ రామ ఆలయం , బయట శ్రీ నాగ ప్రతిమ మరియు ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా దర్శించవచ్చు.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00PM - 3.30PM TO 8.30PM.

7. శ్రీ పెద్దమ్మ ఆలయం , జూబ్లీహిల్స్ :

ఈ ఆలయం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ - 55 లో కలదు. ఈ ఆలయం లో అమ్మవారు శ్రీ పెద్దమ్మగా  పూజలు అందుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారితో పాటు శ్రీ లక్ష్మీ , గణపతి , సరస్వతి , నాగదేవత ఆలయాలు కూడా దర్శించ వచ్చు. నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహిస్తారు. శుక్రవారం మరియు పండుగ రోజులలో రద్దీ అధికంగా ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 5.30AM TO 12.00PM - 3.30PM TO 8.00PM.

8. శ్రీ హనుమాన్ ఆలయం , కర్మన్ ఘాట్ :

ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయం లో హనుమాన్ జయంతి, శ్రీ రామ నవమి  ఉత్సవాలు నిర్వహిస్తారు. గురువారం మరియు శనివారం రోజులలో ఉచిత ఆన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో నూతన వాహన పూజలు కూడా భారీగా జరుగుతాయి.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12.00PM - 4.30PM TO 8.30PM.

9. సాంఘీ ఆలయం , హయాత్ నగర్ :

ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ వేంకటేశ్వర స్వామి. హైదరాబాద్ నుంచి 25 కి.మీ దూరంలో ఈ ఆలయం కలదు. చోళ - చాళుక్య రాజుల వారి ఆస్థానంలో ఉన్నట్లు ఈ ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి తో పాటు శ్రీ రాధాకృష్ణా , దుర్గమ్మ , శివ స్వామి , నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి. 1991 లో ఆలయం నిర్మాణం ప్రారంభించి కేవలం 18 నెలలలోనే పూర్తి చేశారు. సినిమా షూటింగ్ లలో ఈ ఆలయం చాలా సార్లు గమనించవచ్చు. దిల్ సుఖ్ నగర్ మరియు హయాత్ నగర్ నుంచి ఈ ఆలయానికి నేరుగా 204S బస్ లు కలవు.

ఆలయ దర్శించే సమయం : 8.00AM TO 1.00PM - 4.00PM TO 7.30PM.

10. శ్రీ భాగ్య లక్ష్మీ ఆలయం , చార్మినార్ :

హైదరాబాద్ యొక్క పూర్వ నామం భాగ్య నగరం. ఈ అమ్మవారి పేరు మీదనే హైదరాబాద్ కి పూర్వం భాగ్య నగరం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం అత్యంత పురాతన ఆలయం. గణపతి ఉత్సవాలు , నవరాత్రి ఉత్సవాలు , దీపావళి పండుగ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

ఆలయ దర్శించే సమయం : 8.00AM TO 12.00PM - 12.30PM TO 8.00PM.

11. శ్రీ శ్యామ్ బాబా ఆలయం , కాచిగూడ :

ఈ ఆలయం శ్రీ కంచి కామకోటి పీఠం వారు అధీనంలో కలదు. శ్రీ క్రిష్ణా స్వామి శ్యామ్ బాబా గా పూజలు అందుకుంటారు. ఈ ఆలయంలో శ్రీ క్రిష్ణా , గణపతి , వీరభద్ర , శివ, ఆంజనేయ , నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ క్రిష్ణా హారతి చాలా బాగా జరుగుతుంది. ఈ ఆలయం కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటుంది.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 12PM - 5.00PM TO 9.00PM.

12. శ్రీ ఎల్లమ్మ ఆలయం , బల్కం పేట్ :

ఈ ఆలయం చాలా ప్రఖ్యాతి గాంచిన ఆలయం . ఈ ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి కళ్యాణ ఉత్సవాలు జరుగుతాయి. ఈ అలయని ముకేష్ అంబానీ గారి సతీమణి కూడా దర్శించుకున్నారు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 1.00PM - 3.00PM TO 8.00PM.

13. శ్రీ సాయి బాబా ఆలయం , దిల్ సుఖ్ నగర్ :

ఈ ఆలయం 1980 లో నిర్మించారు. హైదరాబాద్ లలో దేవలయాలో చూడవలసిన మరో ముఖ్యమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ప్రధానంగా గురుపూర్ణిమ , శ్రీ రామ నవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. గురువారం రోజు అత్యంత రద్దీ ఉంటుంది. ప్రతి రోజు మధ్యాహ్న హారతి , సాయంత్ర హారతి చాలా బాగా ఇస్తారు.

ఆలయ దర్శించే సమయం : 5.30AM TO 1.00PM - 1.30PM TO 9.00PM.

14. శ్రీ  స్కంద గిరి ఆలయం , పద్మరావు నగర్ , సికింద్రా బాద్ :

ఈ ఆలయంలో శ్రీ సుబ్రమణ్య స్వామి మురుగన్ గా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో శ్రీ గణపతి ,శ్రీ ఏకాంబరేశ్వర , శ్రీ కంచి కామాక్షి , జయ దుర్గా, దక్షిణా మూర్తి , లక్ష్మీ , సరస్వతి , నవగ్రహ ఆలయాలు కూడా దర్శించ వచ్చు.

ఆలయ దర్శించే సమయం : 6.00AM TO 11.00AM - 4.30PM TO 9.00PM.

15. శ్రీ చిత్రగుప్త ఆలయం , ఉప్పుగూడ :

చిత్రగుప్త స్వామీ కి కూడా ఆలయం ఉంది అని మనలో చాలా మంది ప్రజలకి తెలియదు. చిత్రగుప్త స్వామికి హైదరాబాద్ లో ఉన్న ఏకైక ఆలయం ఈ ఆలయం. మరియు ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో భారీ ఆంజనేయ స్వామి దర్శించవచ్చు. ఈ ఆలయం 200 సం || చరిత్ర కలిగిన ఆలయం. ఇప్పడు శిధిలావాస్త కి చేరుకున్నది.

ఆలయ దర్శించే సమయం : 7.00AM TO 12.00AM - 4.30PM TO 7.00PM.

హైదరాబాద్ జిల్లాలోని కొత్తగా చేర్చిన ఆలయాల వివరాల కొరకు ఇక్కడ చేయండి. 

Telangana Temples District WiseKeyWords : Hyderabad Famous Temples List, Hyderabad Surrounding Temples, Telangana Famous Temples List, Hindu Temples Guide

Comments

Popular Posts