Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Rajarajeshwara Temple | Taliparamba | Kerala


శ్రీ రాజరాజేశ్వర ఆలయం , తాలిపరంబా :

దక్షిణ భారతదేశంలోని అనేక శివాలయాలలో ఈ ఆలయం ప్రముఖమైనది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయం కేరళ రాష్ట్రం లోని కన్నూర్ జిల్లా  తాలిపరంబా గ్రామంలో కలదు. ఈ ఆలయ శీకరం చాలా ఎతైనది. కన్నూర్ ప్రాంతానికి 25 కి. మీ దూరంలో ఉన్నది. ఈ ఆలయంలో రాత్రి 7.15 నిమిషాల తరువాతనే మహిళలకి ప్రవేశం కలదు. 

ఆలయ విశేషాలు :

పురాతన కేరళలో పరశురాముడు స్థాపించిన 64 బ్రాహ్మణ గ్రామాలలో తాలిపరాంబా ఒకటి. అందరికీ ఈ ప్రాంతం నివసించడానికి శ్రేయస్సు గా ఉండడం వల్ల అందరూ ఆనందంగా జీవనం గడిపేవారు. ఈ ప్రాంతానికి పూర్వం లక్ష్మీ పురం అనే పేరు కూడా కలదు. 


పరశురాముడు సృష్టించిన కేరళలోని 108 శివాలయాలలో (గోకర్ణం నుండి కన్యాకుమారి వరకు పురాతన కేరళ) తాలిపరంబా ఒకటి. ఈ దేవాలయాలలో 12 చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి మరియు దీనిని ద్వదాస శివాలయాలు (12 శివాలయాలు) అని పిలుస్తారు. వారు (కర్ణాటక లో ఇప్పుడు) గోకర్ణానికి మహాబలేశ్వర ఆలయం , తాలిపరాంబా శ్రీ రాజరాజేశ్వర ఆలయం కొట్టియూర్ పెరుమాళ్ ఆలయం, త్రిస్సూర్, వడక్కున్నాథ ఆలయం , పేరువనం మహాదేవ ఆలయం , కొడునగాల్లోర్ తీరువంచిక్కులయం మహాదేవ ఆలయం, వైకోమ్ మహాదేవ టెంపుల్, ఎట్టుమనూర్ మహాదేవ ఆలయం, కడుథురుతి మహాదేవ ఆలయం, చెంగన్నూర్ మహాదేవ ఆలయం, కండీయూర్ మహాదేవ ఆలయం మరియు సుచింద్రం స్తనుమాలయ పెరుమాళ్ ఆలయలు కూడా కలవు. 

ఈ ఆలయం చతురస్రాకార గర్భగుడిలో రెండు అంచెల పిరమిడల్ పైకప్పు ఉంది. గర్భగుడి ముందు నమస్కార మండపం కూడా ఉన్నది. కేరళలోని ఇతర దేవాలయాలకు భిన్నంగా ఈ ఆలయానికి ధ్వజస్తంభము లేదు. బలిక్కల్‌కు పైకప్పు లేదు, కానీ విచిత్రమైన ముఖంతో మర్మమైన వ్యక్తితో అలంకరించబడి ఉంటుంది. బలిక్కల్ ముందు పిరమిడల్ పైకప్పు ఉన్న ఒక చిన్న దీర్ఘచతురస్రాకార భవనం ఉంది, ఇది సాధారణంగా మరెక్కడా కనిపించదు. ఆలయ ట్యాంక్ యొక్క నిర్మాణంపై ఒక శాసనం (ఇది ఉత్తరం వైపున ఉన్న ఆలయానికి కొంచెం దూరంలో ఉంది) 1524 A.D. లో ఆలయం మరియు ట్యాంక్ పునరుద్ధరించబడిందని సూచిస్తుంది. 

నమస్కార మండపం : 

ఈ ఆలయం లో  (గర్భగుడి) యొక్క వద్ద నమస్కార మండప (ముఖ మండపం) కలదు. శ్రీ రాముడు రావణుడిని ఓడించి లంకా నుండి అయోధ్యకు తిరిగి వెళ్లేటప్పుడు రాజ రాజేశ్వర ముందు సాష్టాంగ నమస్కారం చేసి అయోధ్యకు ప్రయాణం కొనసాగించాడు.  శ్రీ రాముని గౌరవంగా ఈ నమస్కార మండపంలో ఎవరినీ అనుమతించరు. కేవలం దేవాలయాలలో బ్రాహ్మణుల కోసం మాత్రమే  అనుమతించబడుతుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం      : 5.00-12.00
సాయంత్రం : 4.00-8.30

వసతి వివరాలు  :

ఆలయం యొక్క ఒకే ఒక్క గెస్ట్ హౌస్ కలదు. మరియు  ఆలయం నుంచి  5 కి.మీ దూరంలో ప్రైవేట్ హోటల్ లు కలవు. 

ఆలయ చిరునామా  :

శ్రీ రాజరాజేశ్వర ఆలయం , 
తాలిపరంబా (గ్రా), 
కన్నూర్ జిల్లా -670141 
కేరళ.

Keywords : Sri Rajarajeswara Temple , Taliparamba , Kerala , Lord Shiva , Hindu Temples Guide 


Comments

Popular Posts