Bhagavad Gita 5th Chapter 1-10 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు 


శ్రీమద్ భగవద్ గీత పన్చమఽధ్యాయః
అథ పంచమోఽధ్యాయః |
అర్జున ఉవాచ |

సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి |
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ‖ 1 ‖


భావం : అర్జునుడు : కృష్ణా ! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరొసారి కర్మయోగం ఆచరించమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు. 

శ్రీభగవానువాచ |
సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ |
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ‖ 2 ‖
భావం : శ్రీ భగవానుడు : కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలుగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు.   

జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ప్రముచ్యతే ‖ 3 ‖
భావం : అర్జునా! దేనిమీద కోపం, ద్వేషం లేని వాడు నిత్య సన్యాసి. సుఖదుఃఖాది ద్వంద్వాలు లేకుండా అలాంటివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతాడు.

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః |
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలమ్ ‖ 4 ‖
భావం : జ్ఞానంవేరూ కర్మయోగంవేరూ అని ఆవివేకులే తప్ప వివేకులు చెప్పరు. ఈ రెండింటిలో చక్కగా ఏ ఒక్కదాన్ని ఆచరించిన మోక్షం లభిస్తుంది.  యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ‖ 5 ‖
భావం : జ్ఞానయోగులు పొందే కర్మ ఫలమే కర్మ యోగులు పొందుతారు. జ్ఞానయోగం, కర్మయోగం ఒకటె అని గ్రహించినవాడే నిజమైన జ్ఞాని. 

సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః |
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి ‖ 6 ‖
భావం : అర్జునా! కర్మయోగం అవలంబించకుండా సన్యాసం పొందడం సాధ్యపడేది కాదు. నిష్కామ కర్మచేసే ముని అచిరకాలంలో బ్రహ్మ సాక్షాత్కార్యం పొందుతాడు. 

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ‖ 7 ‖
భావం : నిష్కామకర్మచారణం, నిర్మలహృదయం, మనోజయం, ఇంద్రియనిగ్రహం కలిగి, సమస్త జీవులలో వుండే ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్నవాడు కర్మలు చేసినా ఎలాంటి ధోషమూ అంటాదు. 

నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ |
పశ్యఞ్శృణ్వన్స్పృశంజిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపఞ్శ్వసన్ ‖ 8 ‖
ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి |
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ‖ 9 ‖
భావం : పరమర్ధతత్వం తెలిసిన కర్మయోగి తానేమీ చేయడం లేదనే తలుస్తాడు. చూడడంలో, వినడంలో, తాకడంలో, వాసన చూడడంలో, తినడంలో, నడవడంలో, ఊపిరి పీల్చడంలో, మాట్లాడడంలో, గ్రహించడంలో, కళ్ళు తెరవడంలో, మూయడంలో ఆయా ఇంద్రియాలే వాటి వాటి విషయాలలో ప్రవర్తిస్తున్నాయని అతను తెలుసుకోవాడమే దీనికి కారణం. 

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః |
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ‖ 10 ‖
భావం : నిష్కామకర్మయోగి కర్మఫలాన్ని విడిచిపెట్టి ఆత్మజ్ఞానం వల్ల కలిగే శాశ్వతమైన శాంతి పొందుతాడు. అలా కాకుండా ఫలా పేక్షతో కర్మలు చేసేవాడు కర్మబంధంలో చిక్కుకుంటాడు. 

5వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Bhagavad Gita Slokas with Audios in English Click Here 
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 5th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments