అథ చతుర్థోఽధ్యాయః |
యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ‖ 31 ‖
భావం : కూరుకులభూషణా! యజ్ఞలలో మిగిలిన అన్నమనే అమృతాన్ని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మం పొందుతారు. యజ్ఞం ఒకటి చేయనివాడికి ఇహలోక సుఖం లేదు. పరలోకం అస్సలే లేదు.
ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే |
కర్మజాన్విద్ధి తాన్సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసే ‖ 32 ‖
భావం : ఈ విధంగా వివిధ యజ్ఞాలూ వేదంలో విశధీకరించబడ్డాయి. అవన్నీ కర్మల నుంచి ఏర్పడ్డాయని తెలుసుకుంటే నీవు సంసారబంధంనుంచి విముక్తి పొందుతావు.
శ్రేయాంద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః పరంతప |
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ‖ 33 ‖
భావం : అర్జునా! ద్రవ్యం వల్ల సాధించబడే యజ్ఞం కంటే జ్ఞానశ్రేష్టం. సమస్త కర్మలూ జ్ఞానం లోనే పరిసమాప్తం కావడం దీని కారణం.
తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా |
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ‖ 34 ‖
భావం : తత్వవేత్తలైన జ్ఞానులు అలాంటి జ్ఞానం నీకు ఉపదేశిస్తారు. వారి వద్దకు వెళ్ళినప్పుడు వినయవిధేయతలతో వారికి నమస్కరించి, సమయం సంధర్బం చూసి ప్రశ్నించి, సేవలు చేసి తెలుసుకో.
యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాండవ |
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ‖ 35 ‖
భావం : ఆ భావం తెలుసుకుంటే నీవు మళ్లీ ఇలాంటి మోహం పొందవు. సమస్త ప్రాణులు నీలోనూ, నాలోనూ చూడగలవు.
అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః |
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ‖ 36 ‖
భావం : పాపాత్మలందరిలో మహాపాపివైనసరే, జ్ఞానమనే తెప్పతోనే పాప సాగరాన్ని దాటివేస్తావు.
యథైధాంసి సమిద్ధోఽగ్నిర్భస్మసాత్కురుతేఽర్జున |
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ‖ 37 ‖
భావం : అర్జునా! బాగా మండుతున్న అగ్ని కట్టేలను అగ్ని ఎలా భస్మం చేస్తుందో అలాగే జ్ఞానమనే అగ్ని సర్వకర్మలను భస్మం చేస్తుంది.
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే |
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి ‖ 38 ‖
భావం : ఈ ప్రపంచంలో జ్ఞానమనే సరితూగే వస్తువు మరొక్కటి లేదు. కర్మ యోగా సిద్ది పొందినవాడికి కాలక్రమేణా అలాంటి జ్ఞానం ఆత్మ లోనే కలుగుతుంది.
శ్రద్ధావా~ంల్లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి ‖ 39 ‖
భావం : శ్రద్ధాసక్తులూ, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు బ్రహ్మ జ్ఞానం పొందుతాడు. జ్ఞానం కలిగిన వెంటనే పరమశాంతి లభిస్తుంది.
అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి |
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ‖ 40 ‖
భావం : అజ్ఞానం, ఆశ్రద్ధత, అనుమానం మనిషిని పాడు చేస్తాయి. అడుగడుగునా సందేహించే వాడికి ఇహలోకంలో కూడా సుఖశాంతు లుండవు.
యోగసంన్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ |
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ‖ 41 ‖
భావం : అర్జునా! నిష్కామ కర్మయోగం వల్ల కర్మఫలాలు విడిచిపెట్టి, జ్ఞానంతో సంశయలూ పోగొట్టుకున్న ఆత్మజ్ఞానిని కర్మలు బంధించలేవు.
తస్మాదజ్ఞానసంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మనః |
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ‖ 42 ‖
భావం : అర్జునా! అందువల్ల అజ్ఞానం మూలంగా నీ హృదయంలో కలిగిన ఈ సందేహాన్ని జ్ఞానమనే కత్తితో నరికివేసి, నిష్కామ కర్మయోగం ఆచరించు. లేచి యుద్దం చెయ్యి.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
జ్ఞానకర్మసంన్యాసయోగో నామ చతుర్థోఽధ్యాయః ‖ 4 ‖
4వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 4th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment