అథ పంచమోఽధ్యాయః |
కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి |
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ‖ 11 ‖
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ‖ 12 ‖
భావం : నిష్కామకర్మయోగి కర్మఫలాన్ని విడిచిపెట్టి ఆత్మజ్ఞానం వల్ల కలిగే శాశ్వతమైన శాంతి పొందుతాడు. అలా కాకుండా ఫలా పేక్షతో కర్మలు చేసేవాడు కర్మబంధంలో చిక్కుకుంటాడు.
సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ‖ 13 ‖
భావం : ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు మనస్సుతో కర్మలన్నీటిని వదిలిపెట్టి తాను
ఏమి చేయకుండియు ఇతరుల చేత చేయించకుండా, తొమ్మిది ద్వారాలుండే శరీరమనే పట్టణంలో హాయిగా ఉంటాడు.
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ‖ 14 ‖
భావం : పరమేశ్వరుడు జీవులకు కర్తృత్వం కాని. కర్మలు కాని, కర్మ ఫలపేక్ష కాని కలగజేయడం లేదు. ప్రకృతులూ, ప్రారబద్ధాలూ కర్తృత్వదులకు కారణాలు.
నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః |
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ‖ 15 ‖
భావం : భగవంతుడికి ఎవరి పాపాపుణ్యాలతో ప్రమేయం లేదు. జ్ఞానాన్ని , అజ్ఞానం ఆవరించడంవల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతుంది.
జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః |
తేషామాదిత్యవజ్జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ‖ 16 ‖
భావం : ఆత్మజ్ఞానంతో అజ్ఞానాన్నీ రూపుమాపుకున్న వాళ్లు సూర్యుడు కాంతి లాంటి తమ జ్ఞానంతో పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కారింప చేసుకుంటారు.
తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః |
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ‖ 17 ‖
భావం : ఆ పరమాత్మ మీదే బుద్దిని , మనస్సునూ, నిలిపినవాళ్ళు ఆ పరాత్పరుని మీదే నిష్ట, ఆసక్తి కలిగిన వాళ్లూ జ్ఞానంతో పాటు పాపాలను పోగొట్టుకొని పునఃజన్మ లేని మోక్షం పొందుతారు.
విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని |
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ‖ 18 ‖
భావం : 'విద్యా వినయాలు కలిగిన బ్రహ్మణుడిని, గోవును, ఏనుగును, కుక్కను చండాలుడిని ఆత్మజ్ఞానులు సమదృష్టితో చూస్తారు.
ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః |
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్బ్రహ్మణి తే స్థితాః ‖ 19 ‖
భావం : సర్వభూతలనూ, నిశ్చలమనస్సుతో సమభావంతో సందర్శించిన వాళ్లూ సంసార బంధాన్ని ఈ జన్మలోనే జయిస్తారు. పరబ్రహ్మం దోషం లేకుండా సర్వత్ర సమంగా ఉంటుంది కనుక అలాంటి సమదృష్టి కలిగిన వాళ్లూ ముక్తి పొందుతారు.
న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్ |
స్థిరబుద్ధిరసంమూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః ‖ 20 ‖
భావం : మోహం లేకుండా నిశ్చలమైన బుద్ది వున్న బ్రహ్మవేత్త ఇష్టమైనది సంప్రాప్తించినప్పుడు సంతోషించడు. ఇష్టం లేనిది సంభవించినప్పుడు విచారించాడు. బ్రహ్మంలోనే నిరంతరం లీనమై వుంటాడు.
5వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
భగవద్గీత మొత్తం అధ్యాయాలు చూడటం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Bhagavad Gita Slokas with Audios in English Click Here
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment