Bhagavad Gita 9th Chapter 12-22 Slokas and Meaning in Telugu |సరళమైన తెలుగు లో భగవద్గీత 


ŚRĪMAD BHAGAVAD GĪTA NAVAMOADHYĀYAḤ
శ్రీమద్ భగవద్ గీత నవమోఽధ్యాయః
atha navamoadhyāyaḥ |
అథ నవమోఽధ్యాయః |

moghāśā moghakarmāṇo moghaGYānā vichetasaḥ |
rākśhasīmāsurīṃ chaiva prakṛtiṃ mohinīṃ śritāḥ ‖ 12 ‖

మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః |

రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ‖ 12 ‖


భావం : అలాంటి మూఢులు పనికిమాలిన కాంక్షలూ, కర్మలూ, జ్ఞానమూ కలిగి వివేకం కోల్పోయి రాక్షసుల స్వభావాన్ని ఆశ్రయిస్తారు. 

mahātmānastu māṃ pārtha daivīṃ prakṛtimāśritāḥ |
bhajantyananyamanaso GYātvā bhūtādimavyayam ‖ 13 ‖

మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః |

భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ‖ 13 ‖

భావం : పార్ధా! సాత్వికస్వభావం కలిగిన మహాత్ములు సర్వభూతలకు అది కారణమైన వాడిగా, నాశనం లేని వాడినిగా నన్ను తెలుసుకొని ఏకాగ్రచిత్తంతో సేవిస్తారు.

satataṃ kīrtayanto māṃ yatantaścha dṛḍhavratāḥ |
namasyantaścha māṃ bhaktyā nityayuktā upāsate ‖ 14 ‖

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |

నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ‖ 14 ‖

భావం : వాళ్ళలో కొంతమంది నిరంతరం నన్ను కీర్తిస్తు, దృడవ్రతంతో ప్రయత్నిస్తూ భక్తితో నాకే నమస్కరిస్తూ మనస్సు నా మీదే నిలిపి నన్ను ఉపసిస్తారు.  

GYānayaGYena chāpyanye yajanto māmupāsate |
ekatvena pṛthaktvena bahudhā viśvatomukham ‖ 15 ‖

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే |

ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ‖ 15 ‖

భావం : మరికొంతమంది మహాత్ములు విశ్వరూపంలో వున్న నన్ను జ్ఞానయోగంతో సేవిస్తారు. అనేక భావాలతో నేను ఒక్కడినే అనీ, వేరే వ్యక్తిననీ, బహురూపాలు కలిగినవాడినీ భజిస్తారు.  
ahaṃ kraturahaṃ yaGYaḥ svadhāhamahamauśhadham |
mantroahamahamevājyamahamagnirahaṃ hutam ‖ 16 ‖

అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ |

మంత్రోఽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ‖ 16 ‖

భావం : క్రతువూ, యజ్ఞమూ, పితృదేవతలకు అర్పించే అన్నమూ, ఔషధమూ, మంత్రమూ, నేయీ, నిప్పూ హొమమూ నేనే.  

pitāhamasya jagato mātā dhātā pitāmahaḥ |
vedyaṃ pavitramoṅkāra ṛksāma yajureva cha ‖ 17 ‖

పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః |

వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ ‖ 17 ‖

భావం : ఈ జగత్తుకు తండ్రి, తల్లి, కర్మఫలాదాత, తెలుసుకోదగ్గ వస్తువు నేనే. ఓంకారం, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం కూడా నేనే.  

gatirbhartā prabhuḥ sākśhī nivāsaḥ śaraṇaṃ suhṛt |
prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam ‖ 18 ‖

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |

ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ‖ 18 ‖

భావం : ఈ జగత్తుకు గతి, పతి, ప్రభువు, సాక్షి, నివాసస్థానం, ఆశ్రయం, ఆప్తుడు, సృష్టికర్త, సంహరకుడు, ఆదారం, ప్రళయం, స్థానం, శాశ్వతబీజం నేనే.  

tapāmyahamahaṃ varśhaṃ nigṛhṇāmyutsṛjāmi cha |
amṛtaṃ chaiva mṛtyuścha sadasachchāhamarjuna ‖ 19 ‖

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |

అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ‖ 19 ‖

భావం : అర్జునా! నేనే వేడి కలుగజేస్తున్నాను. వర్షాన్ని నిలుపుచున్నాను. కురిపిస్తున్నాను. అమృతమూ, మృత్యువూ , శాశ్వతమైన సత్తు, అశాశ్వతమైన అసత్తు నేనే. 

traividyā māṃ somapāḥ pūtapāpā yaGYairiśhṭvā svargatiṃ prārthayante|
te puṇyamāsādya surendralokamaśnanti divyāndivi devabhogān ‖ 20 ‖

త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే|

తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాందివి దేవభోగాన్ ‖ 20 ‖

భావం : మూడు వేదలు చదివినవారు యజ్ఞలతో నన్ను పూజించిన, సోమపానం చేసి, పాపాలు పోగొట్టుకొని స్వర్గం కోరుతారు. అలాంటి వాళ్ళు పుణ్యఫలమైన దేవేంద్రలోకాన్ని పొంది, దివ్యభోగలు అనుభవిస్తుంటారు.   
te taṃ bhuktvā svargalokaṃ viśālaṃ kśhīṇe puṇye martyalokaṃ viśanti|
evaṃ trayīdharmamanuprapannā gatāgataṃ kāmakāmā labhante ‖ 21 ‖

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి|

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే ‖ 21 ‖

భావం : వాళ్ళు విశాలమైన స్వర్గలోకంలో సుఖాలు అనుభవించి, పుణ్యం క్షిణించిపోగానే మానవలోకంలో మళ్ళీ ప్రవేశిస్తారు. ఇలా వేదంలోని కర్మ కాండను పాటించే భోగపరాయణులు జనన మరణాలు పొందుతుంటారు.

ananyāśchintayanto māṃ ye janāḥ paryupāsate |
eśhāṃ nityābhiyuktānāṃ yogakśhemaṃ vahāmyaham ‖ 22‖

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |

ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ‖ 22‖

భావం : ఏకాగ్రచిత్తంతో నిరంతరం ననే స్మరిస్తూ సేవించేవాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తాను.
భగవద్గీతలోని 18అధ్యాయాలు  వాటి భావాలు మరియు ఆడియోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.  

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 9th chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments